Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కియా మోటార్స్ ఇండియా శుక్రవారం తమ నూతన ఉత్పత్తికి సిద్ధమైన 'కియా సోనెట్' కంపాక్ట్ ఎస్యువి యొక్క తొలి అధికారిక డిజైన్‌ను విడుదల చేసింది. నూతన చిత్రంతో కంపాక్ట్ ఎస్యువి విభాగంలో విలాసవంతమైన ఆధునిక డిజైన్, మనోహరమైన లక్షణాలతో కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. సెల్టోస్ తరువాత కియా యొక్క రెండవ 'మేడ్ ఇన్ ఇండియా' కారు కానుందని తెలిపింది. రాబోతున్న పండుగ సీజన్లో తొలుత భారతీయ మార్కెట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కియా డిజైన్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కరీమ్ హబీబ్ తెలిపారు.