Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో పని చేస్తున్న సిబ్బందిలో 4 లక్షల ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది. దీర్ఘకాలంలో ప్రస్తుత పరిస్థితి కొనసాగితే ఈ పరిశ్రమ తీవ్ర అనిశ్చిత్తిలోకి జారుకోనుంది. కరోనా వైరస్ వల్ల అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే టికెట్ అమ్మకాలు లేవు, కంపెనీల వద్ద నగదు లేకుండా పోయింది. ప్రజలు కూడా ప్రయాణలు చేయడానికి జంకుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానయాన దిగ్గజాలు బ్రిటిష్ ఎయిర్వేస్, డచీ లుప్తాన్సా ఎజి, ఎమరైట్స్ ఎయిర్లైన్స్, కాంటస్ ఎయిర్వేస్ తదితర సంస్థలు ఉద్యోగులకు చెల్లింపులు లేని సెలవులను ప్రకటించాయి. భారత్లో సేవలందిస్తున్న అనేక విమానయాన కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు, చెల్లింపు లేని సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.