Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· శాంసంగ్ యొక్క అత్యాధునిక జీవనశైలి టీవీ, ద సెరిఫ్ ఇప్పుడు వడ్డీలేని సులభ నెలసరి వాయిదా 2,916 రూపాయలకు లభ్యం
· నూతన 7కేజీల ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్ మెషీన్‌ను 29,490 రూపాయలకు ఆవిష్కరించనున్నారు
ఢిల్లీ:భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, నేడు తమ అత్యద్భుతమైన జీవనశైలి టీవీ, ద సెరిఫ్ను అమెజాన్ ప్రైమ్ డే అమ్మకాలలో భాగంగా ఆగస్టు 6 మరియు ఆగస్టు7, 2020 తేదీలలో 10వేల రూపాయల ప్రత్యేక తగ్గింపు ధరతో అందిస్తున్నట్లు వెల్లడించింది. శాంసంగ్ తమ అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్ మెషీన్లో7కేజీ వేరియంట్‌ను సైతం ఆవిష్కరించడంతో పాటుగా 19% రాయితీ మరియు ఉత్సాహపూరితమైన ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను సైతం అందించనున్నట్లు తెలిపింది.
ద సెరీఫ్ అనేది స్టేట్మెంట్ సెంటర్‌పీస్. ఇది టీవీ వీక్షణ అనుభవాలను పునర్నిర్వచించడమే కాదు ఎలాంటి లివింగ్ స్పేస్ డిజైన్‌ను అయినా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతుంది. సంప్రదాయ టీవీల్లా కాకుండా ఇది గోడ మీద ఆకర్షణీయంగా కూర్చుండి పోతుంది. ఈ సెరీఫ్ గదిలో ఎక్కడైనా సరే ఫిట్ కావడంతో పాటుగా ఏ కోణంలో చూసినా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా వినియోగదారులు 10% ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్‌ను తమ హెచ్డీఎఫ్సీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై పొందగలరు. అలాగే వారు 24 నెలల నో కాస్ట్ ఈఎంఐను అవకాశాలను సైతం పొందవచ్చు. ఈ ఈఎంఐ అతి తక్కువగా 2916 రూపాయలతో ప్రారంభమవుతుంది.
ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్ మెషీన్లు శాంసంగ్ యొక్క హైజీన్ స్టీమ్ సాంకేతికతతో వస్తాయి. ఇవి వస్త్రాల పరిశుభ్రత, స్వచ్ఛతకు భరోసా అందిస్తాయి. అత్యంత కఠినమైన మరకలను సైతం తొలగించే సామర్థ్యం ఇది కలిగి ఉండటంతో పాటుగా 99.9 % బ్యాక్టీరియా మరియు అలెర్జీన్స్ను సైతం తొలగిస్తుంది. ఈ అమ్మకాలలో వినియోగదారులు వాషింగ్ మెషీన్లపై 19% రాయితీని అందుకోగలరు మరియు తమ హెచ్డీఎఫ్సీ డెబిట్ మరియు క్రెడిట్కార్డులపై 10% క్యాష్‌బ్యాక్ మరియు 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ అవకాశాలను అతి తక్కువ ఈఎంఐ 2458 రూపాయలతో పొందగలరు.
‘‘అత్యుత్తమ డిజైన్, ప్రీమియం సాంకేతికత, వ్యక్తిగతీకరణ మరియు పనితీరు అనేవి కన్స్యూమర్ డ్యూరబల్స్ను కొనుగోలు, తమ ఇళ్లను ఆధునీకరించే సమయంలో వినియోగదారులు ప్రధానంగా పరిగణలోకి తీసుకునే అంశాలు. మా వినియోగదారులకు ఉత్సాహపూరితమైన ఆఫర్లను అత్యంత అందమైన లైఫ్‌స్టైల్ టీవీ ద సెరీఫ్ మరియు నూతన ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్ మెషీన్‌పై అందించేందుకు అమెజాన్‌తో భాగస్వామ్యం చేసుకున్నాం. తద్వారా ప్రత్యేక రాయితీలు మరియు క్యాష్భ్యాక్ ఆఫర్లను సైతం తీసుకువస్తున్నాం. ఈ పోర్ట్‌ఫోలియోతో, మారుతున్న మా వినియోగదారుల అభిరుచులను , మరీముఖ్యంగా తమ ఇళ్లలోనే అధికసమయం గడుపుతున్న ప్రస్తుత సమయంలో తీర్చగలం’’ అని పియూష్ కున్నాపల్లిల్, డైరెక్టర్– ఆన్లైన్ బిజినెస్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ధరలు మరియు ఆఫర్లు
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా వినియోగదారులు ప్రత్యేక రాయితీగా 10వేల రూపాయల తగ్గింపును ద సెరీఫ్ అన్ని మోడల్స్‌పై పొందగలరు. ఈ ప్రత్యేక రాయితీ తరువాత ద సెరీఫ్ 43 అంగుళాల టీవీ (1 మీటర్ 08 సెంటీమీటర్లు) 69,990 రూపాయలకు, 49 అంగుళాల టీవీ (1 మీటర్ 23 సెంటీమీటర్లు) 89,990 రూపాయలకు మరియు 55 అంగుళాల టీవీ (1 మీటర్ 38 సెంటీమీటర్లు) 1,09,990 రూపాయలకు లభ్యమవుతాయి. వినియోగదారులు 24 నెలల నో–కాస్ట్ ఈఎంఐ అవకాశాన్ని సైతం అందుకోవచ్చు. ఈ ఈఎంఐలు అతి తక్కువగా 2,916 రూపాయలతో ఆరంభమవుతాయి. ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ క్లీన్ వాషింగ్ మెషీన్ 7కేజీ సామర్థ్యపు రకం ఇప్పుడు 29,490 రూపాయలకు 19% రాయితీ తరువాత లభిస్తుంది. వినియోగదారులు 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ అవకాశాన్ని వరుసగా 1166 రూపాయలు మరియు 2458 రూపాయల ధరలో పొందగలరు. అంతేకాదు, వినియోగదారులు 10% తక్షణ క్యాష్‌బ్యాక్‌ను తమ హెచ్డీఎఫ్సీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై పైన పేర్కొన్న ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసిన ఎడల పొందగలరు.
ద సెరిఫ్
సంప్రదాయ టీవీ నేపథ్యానికి ఆవల , గృహాలంకరణ వస్తువుగా ఎలాంటి లివింగ్ స్పేస్‌ను అయినా అత్యంత ఆకర్షణీయంగా మారుస్తుంది ద సెరీఫ్. శాంసంగ్ మరియు సుప్రసిద్ధ పర్శియన్ డిజైనర్ ద్వయం రోనన్ మరియు ఇర్వాన్ బౌరౌల్లెక్ యొక్క అసలైన భాగస్వామ్య ప్రతీక ఇది. ప్రతిష్టాత్మక యుని –బాడీ డిజైన్ ‘ఐ’ ఆకృతిలో ఉండటం దగ్గర నుంచి అత్యంత స్పష్టమైన క్యుఎల్‌ఈడీ చిత్రం వరకూ ద సెరిఫ్ ఓ స్టేట్మెంట్ సెంటర్పీస్లా నిలుస్తుంది. ఇది కేవలం టీవీ వీక్షణ అనుభవాలను పునర్నిర్వచించడమే కాదు, ఒకరి జీవనశైలికి తగినట్లుగా శాశ్వత ముద్రను సృష్టిస్తూ అసాధారణ స్థలాన్ని సైతం సృష్టిస్తుంది. క్లిష్టతలేని వినోదం కోసం ఎన్ఎఫ్సీ (నియర్ఫీల్డ్ కమ్యూనికేషన్) సాంకేతికత ను అంతర్గతంగా నిర్మించుకున్న ఒకే ఒక్క టెలివిజన్ ద సెరిఫ్. క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో కూడిన ద సెరిఫ్, అత్యద్భుతమైన చిత్ర నాణ్యతను స్పష్టమైన మరియు లీనమయ్యే శబ్ద అనుభవాలతో కలిపి ప్రదర్శిస్తుంది. అసహనం కలిగించే శబ్దాలను ముందుగానే కనుగొనడంతో పాటుగా స్వయంచాలకంగా శబ్దాన్ని వాస్తవ సమయంలో మార్చుకుంటుంది. యాక్టివ్ వాయిస్ యాంఫ్లిఫయర్ (ఏవీఏ) ఫీచర్‌తో అర్థవంతమైన శబ్దాలు మరియు గొంతులపై దృష్టి సారించింది ద సెరీఫ్.
ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్‌మెషీన్
వస్త్రాలు స్పష్టంగా మరియు శానిటైజ్ చేయబడ్డాయన్న భరోసాను హైజీన్ స్టీమ్ సైకిల్ అందిస్తుంది. ఇది వాషింగ్ నాణ్యతను డ్రమ్ యొక్క అడుగు నుంచి ఆవిరిని విడుదల చేయడం ద్వారా అందిస్తుంది. ఈ ఫలితంగా, డ్రమ్ లోపల ప్రతి వస్త్రమూ పూర్తిగా శాచురేట్ చేయబడుతుంది. అంతేకాదు, ఇది 99.9% వరకూ బ్యాక్టీరియా మరియు మురికిని తొలగిస్తుంది. శాంసంగ్ ఫ్రంట్ లోడ్ హైజీన్ స్టీమ్ వాషింగ్ మెషీన్లు 5 స్టార్ రేటింగ్‌తో వస్తాయి. ఇది వినియోగదారులు అతి తక్కువగా విద్యుత్‌బిల్లులపై ఖర్చు చేసేందుకు వీలు కల్పించడంతో పాటుగా భూగోళాన్నీ రక్షిస్తుంది. ఇది విద్యుత్ వినియోగం తగ్గించిన కారణంగా ఖర్చులను తగ్గించడంతో పాటుగా ప్రమాదకరమైన కార్బన్ డై ఆక్సైడ్ ఉదార్గాల విడుదలను సైతం తగ్గించి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది.
స్మార్ట్ చెక్ ఫీచర్‌తో వినియోగదారులు అసౌకర్యం నివారించగలగడంతో పాటుగా చెడిపోయిన మెషీన్ ఖర్చులను సైతం తగ్గించుకోవచ్చు. స్మార్ట్ చెక్ అనేది ఆటోమేటిక్ ఎర్రర్ మానటిరింగ్ వ్యవస్థ. శాంసంగ్ స్మార్ట్ వాషర్/డ్రైయర్ స్మార్ట్‌ఫోన్ వినియోగించి ఇది ముందుగానే సమస్యను గుర్తించి నివారిస్తుంది. ఒకవేళ అప్పుడు వేగవంతమైన, సులభమైన పరిష్కారాలను అందిస్తే మీ సమయమూ ఆదా అవుతుంది.