Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీమా సంస్థల్లో ఒక్కటైన మాక్స్ బూపా సమగ్ర ఆరోగ్య బీమా ప్లాన్ 'రీ అస్యూర్డ్'ను ఆవిష్కరిం చినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇది కోవిడ్-19కు సంబంధించిన వాటితో సహా ఏ విధమైన హాస్పిటలైజేషన్ కైనా అపరిమిత సమ్ ఇన్సూర్డ్ లభిస్తుందని తెలిపింది. ఒకే ఏడాదిలో పలుమార్లు హాస్పిటల్ సేవలు అవసరమయ్యే కిడ్నీ డయాలిసిస్, కేన్సర్ లాంటి క్రిటికల్ అనారోగ్యం సందర్బాల్లోనూ ఈ ప్లాన్లో ఉంటే అపరిమిత కవరేజీ ఎంతో ఉపయోగకరమని నిరూపితమైందని పేర్కొంది. మాక్స్ బూపా రీఅస్యూర్డ్ ప్లాన్ అనేది వ్యక్తులు, కుటుంబాలకు ఫ్లోటర్ ప్రాతిపదికన రూ.3 లక్షలు నుంచి రూ.1 కోటి దాకా లభ్యమవుతుందని తెలిపింది.