Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్సంగ్ నేడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ ఆఫర్లతో, గెలాక్సి ఉపకరణాలను వినియోగదారులకు మరింత చౌకగా అందుబాటులోకి తీసుకు వస్తున్నామని ప్రకటిచింది. అతి పెద్ద పండుగ ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ తన విస్తృత పోర్ట్ ఫోలియోలోని స్మార్ట్ఫోన్లు, వేరబుల్స్ మరియు టాబ్లెట్లతో పాటు వినియోగదారులకు ఉత్తేజకరమైన బండిల్ ఆఫర్లు మరియు ఇతర ప్రయోజనాలను; ‘రివార్డ్ యువర్ సెల్ఫ్’ ద్వారా అందిస్తోంది.
ప్రత్యేకమైన ఆఫర్లు:
రూ.30,000 వరకు టైమ్స్ ప్రైమ్ మెంబర్షిప్ ప్రయోజనాలు: వార్తల యాప్‌లు, మనోరంజన అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారాలపై వినియోగదారులు 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను, ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లపై 30% వరకు రాయితీలు, భోజనం, ప్రయాణం, సంగీతం తదితరాలపై ప్రత్యేక ఆఫర్లను పొందవచ్చు. ఈ ఆఫర్ ఎంపిక చేసిన, రూ.15,000 నుంచి రూ.1,04,999 ధరల మధ్య ఉండే కొన్ని స్మార్ట్ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 19 నుండి 2020 అక్టోబర్ 31 వరకు జిటి స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
జీరో డౌన్ చెల్లింపుతో నో కాస్ట్ ఇఎంఐ: వినియోగదారులు తమకు అత్యంత ఇష్టమైన గెలాక్సి స్మార్ట్‌ఫోన్‌ను జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు మరియు సున్నా వడ్డీతో కొనుగోలు చేసుకోవచ్చు.
శామ్సంగ్ కేర్+: 2020 అక్టోబర్ 16నుంచి నవంబర్ 17 మధ్య కొనుగోలు చేసుకున్న స్మార్ట్ఫోన్లు, ఎల్‌టిఇ ఆధారిత టాబ్లెట్లపై ప్రమాదవశాత్తు మరియు లిక్విడ్ డ్యామేజ్ (ADLD) రక్షణ ప్లాన్లను వినియోగదారులు 50% తగ్గింపు ధరలో అందుకోవచ్చు.
రివార్డ్ యువర్సెల్ఫ్ ప్రోగ్రామ్ ప్రయోజనాలు:
ఎస్బీఐ కార్డులపై 10% క్యాష్‌బ్యాక్: రూ.4,999 నుంచి రూ.47,999 ధరల మధ్యలో ఉండే అన్ని గెలాక్సి స్మార్ట్ఫోన్లు మరియు ఎంపిక చేసిన ట్యాబ్లెట్లు మరియు వేరబుల్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ అక్టోబరు 28 నుంచి నవంబరు 17, 2020 వరకు జారీలో ఉంటుంది.
గరిష్ఠ చిల్లర ధరలో 50 శాతానికి యువి స్టెరిలైజర్ : గెలాక్సి ఎ71, గెలాక్సి ఎ51 మరియు గెలాక్సి ఎ31లపై అక్టోబరు 15 నుంచి నవంబరు 17, 2020 వరకు ఈ ఆఫర్ జారీలో ఉంటుంది.
ట్యాబ్లెట్ కొనుగోలు చేయండి మరియు రూ.10,000 తగ్గింపులో కీబోర్డు కవర్ పొందండి: గెలాక్సి ట్యాబ్ ఎస్7 మరియు గెలాక్సి ట్యాబ్ ఎస్7+లపై అక్టోబరు 15 నుంచి నవంబరు 30, 2020 వరకు ఈ బండిల్ ఆఫర్ జారీలో ఉంటుంది.
గెలాక్సీ స్మార్ట్‌వాచ్ కొనండి మరియు గెలాక్సీ బడ్స్+ ను రూ.3,990లకు పొందండి: ఈ ఆఫర్ అక్టోబర్ 15నుంచి నవంబర్ 17 వరకు, అక్టోబరు మరియు నవంబరులో అన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులపై 10% క్యాష్ బ్యాక్‌తో చెల్లుబాటు అవుతుంది. ఇదే సమయానికి గెలాక్సీ బడ్స్+ మరియు గెలాక్సీ బడ్స్ లైవ్‌ను విడి కొనుగోళ్లపైనా ఇది అందుబాటులో ఉంటుంది.
గెలాక్సి ఫరెవర్ ఆఫర్: వినియోగదారులు ఒక బ్రాండ్ న్యూ గెలాక్సి స్మార్ట్ ఫోన్‌ను దాని ధరలో 60% మొత్తానికే కొనుగోలు చేసుకోవచ్చు.
గెలాక్సి అస్యూర్డ్ ఆఫర్: వినియోగదారులు ఉపకరణం ధరలో ఉత్కంఠ రేకెత్తించే 70%బై బ్యాక్ ఆఫర్లతో సరికొత్త గెలాక్సి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.
గెలాక్సి ఫరెవర్ గెలాక్సి &అస్యూర్డ్ ఆఫర్లు ఎంపిక చేసిన ఫ్లాగ్‌షిప్‌లు మరియు ప్రీమియం ఉపకరణాలపై మాత్రమే వర్తిస్తుంది.
శామ్సంగ్ ఫైనాన్స్+ ఆఫర్: వినియోగదారులు తమ ఇళ్ల వద్దే సౌకర్యవంతంగా ఉంటూ, సరళమైన కాగిత రహిత ఫైనాన్స్ సదుపాయంతో గెలాక్సి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు.
అన్ని పండుగ ఆఫర్లు శామ్సంగ్.కామ్ మరియు ప్రముఖ రిటైల్ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి.