Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రతిఏడాది తరహాలోనే ఫోర్డ్ భారతదేశ వ్యాప్తంగా తన వినియోగదారులకు డిసెంబరు 4 నుంచి డిసెంబరు 6, 2020 వరకు తన ప్రత్యేక భారీ విక్రయాల క్యాంపెయిన్ ‘మిడ్నైట్సర్ప్రైజ్’ తీసుకువచ్చింది. ఉత్సుకతను రేకెత్తించే డీల్స్ తోపాటు రూ.5లక్షల వరకు ఖచ్చిత మైన బహుమతులను అందించే 'మిడ్నైట్ సర్ప్రైజ్' ఫోర్డ్ తయారు చేసే అన్ని ఉత్పత్తుల పరిధికి అందుబాటులోకి రాగా, అందులో ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ అస్పైర్, ఫోర్డ్ ఫ్రీస్టైల్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ,ఫోర్డ్ ఎండీవర్ ఉన్నాయి.ఈ మూడు రోజుల క్యాంపెయిన్‌లో ఏదైనా ఫోర్డ్ కార్లను బుకింగ్ చేసుకోవాలని కోరుకునే వినియోగదారులు అందరూ డిజిటల్స్ క్రాచ్ కార్డు అందుకుంటారు. దానితో వారికి ఖచ్చితమైన బహుమతి లభిస్తుంది. మిడ్నైట్సర్ ప్రైజ్ అవధిలో చేసుకున్న బుకింగ్‌లకు అందించే బహుమతుల్లో ఎల్ఇడిటీవీలు, డిష్-వాషర్, ఎయిర్ప్ యూరి ఫైయర్, మైక్రోవేవ్ ఓవెన్లు, అత్యాధునిక జనరేషన్ ఐప్యాడ్, ఐఫోన్ 11, బ్రాండెడ్ బైసికిల్, ఫిట్నెస్ స్మార్ట్ వాచ్‌లు, రూ.25,000 వరకు గిఫ్ట్ కార్డులతో 3 గ్రాములు, 5 గ్రాముల బంగారు నాణేలు మరియు రూ.లక్ష వరకు గోల్డ్ వోచర్ లభిస్తుంది.
దీన్ని మరింత ఉత్సాహవంతం చేసే దిశలో డిసెంబరులో డెలివరీలను తీసుకునే వినియోగదారులు రూ.5 లక్షల బంపర్ బహుమానానికీ అర్హతపొందుతారు. ‘‘మిడ్ నైట్ సర్ ప్రైజ్ '' మరోసారి తీసుకువచ్చేందుకు మరియు వారు కొనుగోలు చేసుకునే ప్రతిఫోర్డ్ నుంచి ఎక్కువ అందుకునే అవకాశాన్ని అందించేందుకు మేము చాలాసంతోషిస్తున్నామని’’ ఫోర్డ్ఇండియామార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు.
‘‘ప్రస్తుతం మహమ్మారి సన్నివేశం నూతన ఫోర్డ్ కలిగి ఉండే స్ఫూర్తిని దెబ్బతీసింది, మేము ఈ క్యాంపెయిన్ సమయంలో డయల్-ఎ-ఫోర్డ్ టోల్ ఫ్రీ నెం 1800-419-3000కు లేదా ప్రత్యేకమైన ఆన్లైన్ బుకింగ్ ఫోర్టల్ www.booking.india.ford.com ద్వారా వాహన బుకింగ్ చేసే సురక్షత అనుకూలతను ప్రాధాన్యత ఇస్తామని’’ తెలిపారు.
ఈ అవధిలో దేశవ్యాప్తంగా ఫోర్డ్ డీలర్షిప్ ఉదయం 9 నుంచి మధ్య రాత్రి వరకు తీసి ఉంచడం ద్వారా వినియోగదారులకు టెస్ట్ డ్రైవ్ చేసేందుకు, ఫోర్డ్ బుక్ చేసేందుకు ఎక్కువ అనుకూలతను కల్పించింది.
ఫోర్డ్ కార్లు యాజమాన్యపు విలువలో ఆశ్చర్యకరంగా నిర్వహణ ఖర్చులు పూర్తి లైఫ్ సైకిల్ మొత్తం గమనార్హమైన పొదుపు ద్వారా నూతన మైలురాయిని సృష్టించడాన్ని కొనసాగించనుంది. కంపెనీ ఇప్పటికే తన వినియోగదారులకు విశ్వాసాన్ని పలు ఆవిష్కారాత్మక మరియు వినూత్న తరహా కార్యక్రమాలైన Service Price Calculator తదితరాల ద్వారా ముందుకురాగా, వారికి వారి కారుసర్వీస్ మరియు విడిభాగాల ఖర్చు డీలర్‌షిప్‌కు రాకముందే తెలుసుకునేలా చేసింది.