Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో సీజన్ ను అందిస్తున్న సోనీ లైవ్
ఢిల్లీ: పాతబడిన గోడలు, పొరుగువారి కుతూహలం, ముగింపు లేని ఇబ్బందులు ....అయినా ఆగిపోని ఆపరిమిత కలలు; ఇవీ మిశ్రా కుటుంబసభ్యుల దృక్పథాలు. 2019లో అందరినీ ఆకట్టుకున్న షో ఇది. ఐఎండీబీ రేటింట్ 9.1 తో, ఎంతో చక్కగా తీర్చిదిద్దబడిన పాత్రలతో, ఆకట్టుకునే నటనతో, నమ్మశక్యం కాని దర్శకత్వంతో గుల్లాక్ సీజన్ 1 అందరి ప్రశంసలు పొందింది. ఇప్పుడు సోనీ లైవ్ ఈ షో నూతన సీజన్ లో కొత్త కథలు అందించనుంది. 2020 జనవరి 15నుంచి ఇది ప్రారంభం కానుంది. మధుర స్మృతుల తో పిగ్గీ బ్యాంక్ (గల్లాపెట్టె) ను నింపుకొనే ఓ అసాధారణ కుటుంబం ఎత్తుపల్లాల ప్రయాణాన్ని ఇది చాటిచెబుతుంది.
గల్లాపెట్టె దృక్పథంతో అల్లుకున్న కథ ఇది. రోజువారీ జీవితంలో చోటు చేసుకునే ఘటనలు స్టోరీటెల్లింగ్ అసాధారణ శైలితో అల్లబడ్డాయి. టీవీఎఫ్ చే నిర్మించబడిన గుల్లాక్ 2, కలసిఉండడాన్ని మించింది లేదనుకునే మిశ్రా కుటుం బపు అపరిపూర్ణ వాస్తవాలను, అనుబంధాలను మరింతగా వెలుగులోకి తీసుకువస్తుంది. ఇల్లు చిన్నదే అయినా ...భావోద్వేగాలు, వాదనలు, నవ్వులూ అధికం. అవన్నీ ఒక్కటై సాగిపోతుంటాయి. పలాశ్ వాస్వాని దర్శకత్వంలో గుల్లాక్ సీజన్ 2 ఉత్తరభారతదేశపు నేపథ్యంతో రూపుదిద్దుకుంది. జమీల్ ఖాన్, గీతాంజలి, కులకర్ణి, సునీతా రాజ్వార్, హర్ష్ మయర్, వైభవ్ రాజ్ గుప్తా ముఖ్యపాత్రలను పోషించారు. చూస్తూనే ఉండండి...మిశ్రా కుటుంబం వస్తోంది...గుల్లాక్ తో మరోసారి....జనవరి 15 నుంచి సోనీలైవ్ టీవీలో మాత్రమే.