Authorization
Mon Jan 19, 2015 06:51 pm
› ఇండియా మరియు ఎక్స్ పోర్ట్ మార్కెట్ల కొరకు, MQB-A0-IN ప్లాట్ ఫార్మ్ ఆధారం మీద స్కోడా ఆటో ద్వారా ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన మొదటి ప్రొడక్షన్ మోడల్.
› స్కోడా కుషాక్ లో ఇండియన్ కస్టమర్స్ యొక్క పెర్ఫార్మన్స్ తో శ్రేష్ఠమైన స్కోడా ఆటో క్వాలిటీల సమ్మేళనం కనిపిస్తుంది.
› ఈ మిడ్-సైజ్ SUV ఆకట్టుకునే డిజైన్, ఇంటీరియర్ స్పేస్, సౌకర్యం మరియు సేఫ్టీ, మోడర్న్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ మరియు సమగ్రమైన కనెక్టివిటీ ఫీచర్లతో చాలా ఇంప్రసివ్ గా ఉంటుంది.
› రెండు శక్తివంతమైన మరియు TSI ఇంజన్లు మరియు మాన్యువల్, ఆటోమేటిక్ మరియు DSG ట్రాన్సిమిషన్స్ ఎంపిక
› మార్చి 2021 లో ఈ సరి క్రొత్త స్కోడా కుషాక్ యొక్క వరల్డ్ ప్రీమియర్ జరగబోతున్నది.
పుణె: స్కోడా ఆటో నేతృత్వం ద్వారా నడపబడిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా, ఇండియన్ కస్టమర్ యొక్క ఛాలెంజింగ్ డిమాండ్స్ కు అనుగుణంగా, MQB-A0-IN ఆర్కిటెక్చర్ తో అభివృద్ధి చేయబడిన సరి క్రొత్త స్కోడా కుషాక్ న్యూ జనరేషన్ వెహికల్స్ లో మొట్టమొదటిది. డిజైన్, క్వాలిటీ, ఇంటీరియర్ స్థానం విస్తరణ, ఎక్విప్మెంట్, డైనమిక్స్, ఎఫిషియన్సీ, సేఫ్టీ మరియు సౌకర్యం వంటి విశిష్టతలతో సగర్వంగా చెప్పుకునే సాంప్రదాయ స్కోడా ఆటో గుణాలతో వస్తున్న సరి క్రొత్త స్కోడా కుషాక్, ఇండియా లో తయారైనది, ప్రపంచం కోసం తయారైనది.
ఈ మిడ్-సైజ్ SUV 2,651 mm వీల్ బేస్ తో, పాసెంజర్లకు మరియు లగేజ్ కొరకు తగినంత చక్కని ఇంటీరియర్ స్పేస్ ఆఫర్ చేస్తూ, దీని పెర్ఫార్మన్స్ ను దీని రెండు శక్తివంతమైన మరియు సమర్థమైన TSI ఇంజన్లతో సునిశ్చితం చేస్తున్నది. ఈ సరి క్రొత్త స్కోడా కుషాక్ మార్చి 2021 లో తన వరల్డ్ ప్రీమియర్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నది.
ఈ కొత్త మోడల్ చారిత్రక ప్రవేశం పై, థామస్ స్కఫర్, సిఇఒ, స్కోడా ఆటో, ఇలా అన్నారు: “ మా కొత్త స్కోడా కుషాక్ తో ఇండియన్ సబ్-కాంటినెంట్ లో స్కోడా ఆటోకు ఒక కొత్త శకం ప్రారంభం కాబోతున్నది. ఇది ఇండియా 2.0 ప్రాజెక్ట్ స్కోప్ లో అన్ని వోల్క్సువేగన్ గ్రూప్ యాక్టివిటీలను నిరీక్షించవలసిన ప్రాంతం. ఈ కుషాక్ నాలుగు కొత్త స్కోడా మరియు వోల్క్సువేగన్ మిడ్ సైజ్ మోడల్స్ కలిగి ఉండి, ఒక అఫెన్సివ్ మోడల్ ప్రారంభానికి ఒక చక్కని నిదర్శనంగా మిగులుతుంది. ఈ వెహికల్స్ అన్నీ ఇండియన్ మర్కెట్ అవసరాలను తీర్చుటకు, స్కోడా ఆటో ప్రత్యేకంగా అడాప్ట్ చేసిన మాడ్యులార్ ట్రాన్స్వెర్స్ మ్యాట్రిక్స్ వెర్షన్ MQB-A0-IN పై ఆధారపడి ఉన్నాయి. ఈ మోడల్ మన ఇండియన్ కస్టమర్స్ అవసరాలు తీర్చేది అనే నమ్మకాన్ని కలిగించగలదని నేను విశ్వసిస్తున్నాను. ”
గుర్ ప్రతాప్ బోపరాయ్, మేనేజింగ్ డైరెక్టర్, స్కోడా ఆటో వోల్క్సువేగన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఇలా అన్నారు: “ సరి కొత్త స్కోడా కుషాక్ ప్రవేశం, ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో భాగంగా జరిగే కొన్ని లాంచెస్ లో మొదటిది కాబోతున్నది. ప్రభావవంతమైన మరియు డిమాండింగ్ వినియోగదారు అవసరాలు మనసులో ఉంచుకొని ఇది అభివృద్ధి చేయబడినది, త్వరలో రాబోతున్న లాంచెస్ లో ఒకటి అయిన ఇండియా-స్పెసిఫిక్ MQB A0-IN ప్లాట్ ఫార్మ్ మాకు ఒక గర్వకారణ విషయం. ఆన్-గ్రౌండ్ ఇంటలిజెన్స్ ఉపయోగించి స్కోడా కుషాక్ నిర్మాణం జరిగింది మరియు మా లెజండరీ క్వాలిటీలో అద్భుతమైన విలువలు ఎలాంటి రాజీ పడకుండా అందించుటకు ఇది లోకలైజ్ చేయబడింది.”
కాంపాంక్ట్ అయినా విశాలమైనది: స్కోడా కుషాక్
ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన కార్ - స్కోడా కుషాక్ లాంచ్ తో, స్కోడా ఆటో మొట్టమొదటి సారిగా సబ్-కాంటినెంట్ లో అత్యంత వేగంగా పెరుగుతున్న మిడ్ సైజ్ SUV సెగ్మంట్ లో ప్రవేశిస్తున్నది, మరియు స్కోడా ఇండియా లైన్ అప్ లో KODIAQ మరియు KAROQ ప్రవేశించ బోతున్నాయి. అత్యంత వైవిధ్యమైన MQB-A0-IN వెహికల్ ఆర్కిటెక్చర్ మీద ఆధార పడిన స్కోడా కుషాక్, ఇండియన్ సిటీస్ లో నేవిగేట్ చేయుటకు అత్యుత్తమ బాహ్య డైమన్షన్స్ గురించి గొప్పగా చెబుతూ ఉంది. అదే సమయంలో, 2,651 mm లాంగ్ వీల్ బేస్ తో స్కోడా కుషాక్ అయిదు మంది కూర్చొనుటకు సాటిలేని ఇంటీరియర్ రూమ్ అందిస్తున్నది. లార్జ్ బూట్ కెపాసిటీతో, లగేజ్ కొరకు కావలసినంత చోటు కూడా ఉంది. ఈ కొత్త SUV అత్యంత వైవిధ్యమైనది, సింపుల్ గా ఇదంతా తెలివైన స్కోడా నుంచి ప్రతి ఒక్కరు ఆశించదగినది.
సోఫిస్టికేటెడ్ యూరోపియన్ స్టైలింగ్ తో భారతీయ వైభవం కలయిక
ఫిబ్రవరి 2020లో ఢిల్లీ ఆటో ఎక్స్పో లో చూసిన ప్రకారం, సరి కొత్త స్కోడా కుషాక్ చాలా దగ్గరగా స్కోడా విజన్-ఇన్ ను అనుసరిస్తున్నది. ఇది స్కోడా యొక్క క్రిస్ప్ మరియు సోఫిస్టికేటెడ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ తో, సాంప్రదాయ ఇండియన్ ఆర్ట్ మరియు ఆర్కిటెక్చర్ యొక్క విశిష్ట వివరాల కలయిక ప్రభావం వలె కనిపిస్తుంది. సైజ్ తో సంబంధం లేకుండా మొత్తం సిల్హౌటి అంతా స్లీక్ గా ఉన్నా, స్కోడా ఆటో SUV శ్రేణిలో చూపిన ప్రకారం చాలా దృఢంగా కనిపిస్తుంది. ఈ సరి కొత్త స్కోడా కుషాక్ ఇండియన్ రోడ్ల మీద కనిపించినప్పుడు సరికొత్త లెవెల్ విజువల్ అప్పీల్ తీసుకు రాబోతున్నది అని ప్రామిస్ చేస్తున్నది. దీని విశిష్టతకు లైటింగ్ అదనపు మెరుగు అదిస్తుంది: ట్రిమ్ లెవెల్ పై ఆధారపడి స్కోడా కుషాక్ LED హెడ్ లైట్స్ మరియు డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఫీచర్స్ ఉంటాయి. టెయిల్ మరియు బ్రేక్ లైట్స్ కూడా ఎఫిషియంట్ మరియు ఇన్స్టాంట్ గా రెస్పాన్సివ్ LED లతో ఫిట్ చేయబడినవి.
రెండు శక్తివంతమైన మరియు సమర్థమైన TSI ఇజన్లు
సరి కొత్త స్కోడా కుషాక్ కు సమర్థమైన TSI ఇంజన్ల ద్వారా శక్తి లభిస్తుంది, ఇవి ఫ్రంట్ వీల్స్ కు పవర్ అందిస్తాయి: 1.0-లీటర్ మరియు 1.5- లీటర్ TSI. మూడు గిర్ బాక్స్ ఆప్షన్లు మోడల్ పై ఆధారపడి, ఆఫర్ చేయబడతాయి: ఒక 6-స్పీడ్ మాన్యువల్, ఒక 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఒక 7-స్పీడ్ DSG. TSI టెక్నాలజీ ప్రయోజనాలు అందిస్తూ, రెండు ఇంజన్లు ఉత్సాహవర్థక పెర్ఫార్మన్స్ తో పాటు, అత్యుత్తమమైన మైలేజి అందిస్తాయి.
మీ సేవలో: అత్యాధునిక కనెక్టివిటీ మరియు ఇన్ఫోటైన్మెంట్
సరి కొత్త స్కోడా కుషాక్, మై స్కోడా కనెక్ట్ అనే పవర్ఫుల్ కనెక్టివిటీ ఫీచర్ల స్యూట్ తో లభిస్తుంది. దీని వలన డ్రైవింగ్ అనుభవం, మరియు మెరుగైన వెహికిల్ యూసేజ్ డయాగ్నాసిస్ తో పాటు సెక్యూరిటీ అనుభూతి లభిస్తుంది. వీటన్నింటి కంటె పైగా, ఒక సెంట్రల్ టచ్ స్క్రీన్ తో మాడర్న్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ లభిస్తాయి. ఇంకా ఆహ్లాదకరమైన ఇంటీరియర్ టెంపరేచర్ సునిశ్చితం చేస్తూ, ప్రతి కారు ట్రిమ్ లెవెల్ పై ఆధారపడి, ఎయిర్ కండిషనింగ్ లేదా ఆటోమేటిక్ క్లైమేట్రానిక్ ఫీచర్ కలిగి ఉంటుంది.
ఉన్నత స్థాయి సేఫ్టీ మరియు అత్యుత్తమ సౌకర్యం కొరకు అసిస్టంట్ సిస్టమ్స్
సరి కొత్త స్కోడా కుషాక్ అత్యుత్తమమైన యాక్టివ్ మరియు పాసివ్ సెఫ్టీ మరియు అలాగే అనేక సహాయక సిస్టమ్స్ అందిస్తుంది. దీనిలో పయనించువారికి ఆరు ఎయిర్ బ్యాగ్స్ రక్షణ లభిస్తుంది- డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసెంజర్ కు, ఆప్షనల్ ఫ్రంట్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ – ఇంకా ESC ఒక ఆల్ ట్రిమ్స్ స్టాండర్డ్ ద్వారా డ్రైవర్ సేఫ్టీ మెరుగు పడుతుంది. హిల్ హోల్డ్ కంట్రోల్, రెయిన్ మరియు లైట్ సెన్సర్లు మరియు క్రుయిజ్ కంట్రోల్ సిస్టం ద్వారా భద్రత మరియు సౌకర్యం రెండూ మెరుగు పడతాయి. ట్రిమ్ లెవెల్ పై ఆధారపడి, ఎయిర్ ప్రెషర్ మీద దృష్టి పెట్టుటకు టైర్ ప్రెషర్ మానిటరు ఫీచరుతో కారు వస్తున్నది.
సరి కొత్త స్కోడా కుషాక్ – ఇండియా 2.0 ప్రోడక్ట్ కాంపైన్ యొక్క మొదటి మోడల్
జూన్ 2018 నుండి, ఇండియన్ సబ్-కాంటినెంట్ లో స్కోడా ఆటో ఇండియా 2.0 ప్రాజెక్ట్ లో అన్ని వోల్క్సువేగన్ గ్రూప్ యాక్టివిటీలను నిరీక్షిస్తూ ఉంది. ఇండియన్ మార్కెట్ లో వాల్యూమ్ సెగ్మెంట్లలో స్కోడా ఆటో మరియు వోల్క్సువేగన్ కు సుస్థిరమైన మోడల్ కాంపైన్ అనుసరించుట దీని ఉద్దేశం. వోల్క్సువేగన్ గ్రూప్, SUVs మరియు కార్స్ యొక్క రిసెర్చ్ మరియు డెవలప్మెంట్ మీద 275 మిలియన్ యూరోలతో సహా, ఈ ప్రాజెక్టులో మొత్తం ఒక బిలియన్ యూరోలు పెట్టుబడి పెడుతున్నది. జెక్ బ్రాండ్ కూడా ఇండియా లో ఆడి, పోర్స్క్ మరియు లెంబార్గిని యొక్క యాక్టివిటీలను రహస్యంగా ఆరా తీస్తూ ఉంది. మొత్తం మీద 30 మోడల్స్ వరకు వివిధ మార్కెట్ సెగ్మంట్స్ మరియు బడ్జెట్ల అవసరాలను పూర్తి చేస్తున్నవి.
ఇండియన్ మార్కెట్ కు అనుగుణంగా స్థానికంగా డెవలప్ చేయబడినది: MQB-A0-IN
మొట్టమొదటి సారిగా, స్కోడా ఆటో వోల్క్సువేగన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ MQB ప్లాట్ ఫార్మ్ మీద ఆధారపడిన వెహికల్ ను డెవలప్ చేస్తున్నది. MQB-A0-IN – స్థానికంగా డెవలప్ చేయబడినది – సరి కొత్త స్కోడా కుషాక్ కు మరియ త్వరలో రాబోయే ఇతర వాల్యూమ్ మోడల్స్ కు టెక్నికల్ ఆధారం అందిస్తుంది. ఈ ప్లాట్ ఫార్మ్ లోని వైవిధ్యత ఇండియాలో కొత్త, మరింత దృఢమైన సేఫ్టీ మరియు ఎమిషన్ రిక్వైర్మెంట్స్ కలిగి ఉంటుంది మరియు భవిష్య రెగలేషన్స్ కు ఇది అడాప్ట్ చేయబడుతుంది. ఇండియా 2.0 ప్రాజెక్టు లో ఒక భాగంగా ప్లాన్ చేయబడిన ఈ కార్లు 95 శాతం వరకు ఉన్నత లోకలైజేషన్ లెవెల్ ను ఆశిస్తూ, పుణెలో జనవరిలో ప్రారంభమైన అత్యాధునిక టెక్నాలజీ సెంటర్ లో వీటి సాంకేతిక అభివృద్ధితో తయారు చేయబడుతున్నవి. 250 స్థానిక ఇంజనీర్ల బృందం MQB-A0-IN అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషించి, ఈ ప్లాట్ ఫార్మ్ అబివృద్ధికి సహరించారు. వారి సాంకేతిక అనుభవ సంపద, విస్తృతమైన లోకల్ మార్కెట్ అవగాహన ద్వారా మరింత ఎక్కువ టార్గెట్ కలిగిన, ఫ్లెక్సిబుల్ మరియు మరింత వేగంగా మారుతున్న కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఇవి రూపు దిద్దుకున్నవి. 2025 నాటికి, స్కోడా ఆటో మరియు వోల్క్సువేగన్, మార్కెట్ మరియు సెగ్మంట్ డెవలప్మెంట్ పై ఆధారపడి, ఇండియాలో సంయుక్తంగా 5 శాతం మార్కెట్ షేర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నవి.
స్కోడా ఆటో ఇండియాలో సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది
గతంలో అనేక గ్లోబల్ ప్రయాణీకులు తమ స్కోడా ఆటోలతో సబ్-కాంటినెంట్ కి డ్రైవ్ చేసి వచ్చిన తర్వాత, 1930 రెండవ అర్థ భాగంలో, కారు నిర్మాతలు ఇండియాకు 90 వెహికల్స్ వరకు ఎగుమతి చేసారు. 1938 నాటికి ఇండియా లో అప్పటి 39 ఎక్స్ పోర్ట్ మార్కెట్లలో ఇండియా ఏడవ అతిపెద్ద స్కోడా ఆటో మార్కెట్ స్థానంగా రూపొందింది. జెక్ కార్ నిర్మాత 2001 వరకు ఇండియాలో తమ సొంత సబ్సిడరీని స్థాపించ లేదు. ప్రస్తుతం, SAVWIPL రెండు ఫెసిలిటీలు (ఔరంగాబాద్ మరియు పుణెలో) ఆపరేట్ చేస్తున్నది. ఇంకా ఇది పుణెలో టెక్నాలజీ సెంటర్, మరియు 2020 ప్రారంభంలో స్థాపించబడిన ఒక స్కోడా ఆటో డిజిటల్ ల్యాబ్ ఇండియా (గురుగ్రామ్ మరియు పుణెలో ఆఫీసులతో) నిర్వహిస్తున్నది. ప్రస్తుతం, ఇండియన్ మర్కెట్ కొరకు స్కోడా ఆటో యొక్క లైన్ అప్ లో RAPID, OCTAVIA మరియు ఫ్లాగ్ షిప్ SUPERB, అలాగే KODIAQ మరియు KAROQ SUVs కూడా చేరాయి.