Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: అందరూ ఆనందించే అద్భుతమైన కంటెంట్‌ను అందించడం టాటా స్కై ప్రత్యేకత. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని, అద్భుతమైన కంటెంట్‌ను అందిస్తామనే వారి కమిట్మెంట్కు నిదర్శనంగా.. భారతదేశపు నెం.1 డీటిహెచ్ ఫ్లాట్ ఫారం అయినటువంటి టాటా స్కై తన కొత్త బ్రాండ్ క్యాంపెయిన్ని రూపొందించింది. “మన కుటుంబం మరియు ఇంటి ఇంటి కోసం ఇవాళ్టి రోజు కంటే రేపుటి రోజుని టాటా మరింత మెరుగ్గా మారుస్తుంది” అనేది క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. దేశంలో డీటిహెచ్ పరిశ్రమలో లీడర్‌గా ఉన్న టాటా స్కై ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 మిలియన్ ల కుటుంబాలకు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది.
"వినియోగదారులకు ఏం అందివ్వాలే మాకు తెలుసు. వారికి మాపై నమ్మకం ఉంది. అ నమ్మకమే బ్రాండ్ టాటా స్కైకి మార్గదర్శకంగా ఉంది" అని అన్నారు టాటా స్కై ఎండి మరియు CEO హరిత్ నాగ్‌పాల్. " ప్రజల జీవితాలకు విలువను జోడించడం, దాన్ని కొనసాగించడం అదే మా ఉద్దేశం. మా బ్రాండ్ ఉద్దేశం కూడా అదే అని అన్నారు ఆయన. "'టాటా స్కైతో నేడు కంటే రేపు మరింత మెరుగ్గా ఉంటుంది’ అనే మా ఈ కొత్త ప్రకటన ఎంటర్టైన్మెంట్ మా యొక్క బ్రాండ్ నమ్మకాన్ని తెలుపుతుంది. ఇది ప్రేక్షకులు మరింత మెరుగైన జీవితాన్ని ఆస్వాదించడానికి స్ఫూర్తిని అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల జీవితాలను మెరుగైన రీతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా అవసరమయ్యే కంటెంట్ యాక్సెస్, డిస్కవరి మరియు వినియోగాన్ని సరళీకృతం చేస్తుంది. దీని వల్ల బ్రాండ్ వేల్యూ మరింతగా పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ అనురాగ్ కుమార్.
టాటా స్కై ''ఈ కిటికి తెరిస్తే చాలా లైఫ్ జింగాలాలా” అనే నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక్కడ 'కిటికి' అనేది వినోదం యొక్క ప్రతిరూపం. అంటే టాటా స్కై ద్వారా, ప్రజల దైనందిన జీవితంలో వెలుగుచూసే భావోద్వేగ సందర్భాలను వారికి అద్భుతంగా అందిస్తుంది. ఒగిల్వీ ఇండియా రూపొందించిన కొత్త ప్రచారం గురించి టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ అనురాగ్ కుమార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. "కొన్నేళ్లుగా, జింగాలాలా అనే పదం టాటా స్కైకు పర్యాయపదంగా మారింది. అంతేకాదు టాటా స్కై అందించే ఎంటర్టైన్మెంట్కు బ్రాండ్ వర్డ్లా మారింది. ఇప్పుడు ఈ టివిసి ద్వారా, టాటా స్కై స్క్రీన్ ఏవిధంగా ఉండబోతుందో చెప్పాం. అంతేకాకుండా సానుకూల భావోద్వేగాలతో వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడం, జింగాలాలతో ద్వారా మా అంకితభావాన్ని మరింతగా బలోపేతం చేయడం ఇప్పుడు ఈ బ్రాండ్ ద్వారా సాధ్యం అవుతుంది'' అని అన్నారు ఆయన. మరోవైపు ఈ సందర్భంగా ఓగిల్వీ ఇండియా వెస్ట్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ సుకేష్ నాయక్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. మా ఈ కొత్త క్యాంపెయిన్‌లో ఉన్న కిటికి అనే పదంలో మొత్తం ప్రచారం దాగుంది. అదే ఇన్నేళ్లుగా మనకు వినోదాన్ని పంచుతోంది. గోడలపై, బల్లలపై లేదా మన చేతుల్లో ఉన్న టాటా స్కై కిటీకీ మన జీవితాలను నిజంగా జింగాలాలా చేస్తుంది అని అన్నారు ఆయన.
టాటా స్కై యొక్క కొత్త క్యాంపెయిన్ హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ మరియు ఒడియా భాషల్లో వివిధ రకాల మీడియా ఛానల్స్ ద్వారా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఈ టివిసి ద్వారా కుటుంబాలు మరియు వ్యక్తులు టాటా స్కై చూస్తున్నప్పుడు వారంతా కలిసి నేర్చుకోవడం, ఆనందంగా ఉండడం, ఆశ్చర్యపోవడం లాంటి అద్భుతమైన క్షణాలను ఇందులో ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక సోషల్ మీడియాలో టాటా స్కై యొక్క లెన్స్ ద్వారా ప్రేక్షకుల యొక్క క్యాండిడ్ మరియు ఫిల్టర్ చేయని భావోద్వేగాలను హైలైట్ చేసేవిధంగా వాటిని #HarGharKiKhidki హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారం చేయడం జరుగుతుంది. మరోవైపు బ్రాండ్ రీకాల్ కోసం టాటా స్కైలో వినోదాన్ని ఆస్వాదించే కుటుంబం యొక్క రీల్స్ ని రూపొందించడం ద్వారా ఫాలోయర్ లు మరియు ఇతర కంటెంట్ క్రియేటర్స్ ఈ ప్రచారంలో పాల్గొంటారు.