Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో తమ రవాణా వ్యాపారంలో శక్తివంతంగా కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని, మరీ ముఖ్యంగా ఆటో, మోటో లాంటి ఖర్చు తక్కువ కలిగిన ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఉబెర్ నేడు వెల్లడించింది. ఈ వృద్ధి కారణంగా తమ ప్లాట్‌ఫామ్‌పై డ్రైవర్ల కోసం సంపాదనా అవకాశాలు సైతం సృష్టించబడుతున్నాయని ఉబెర్ వెల్లడించింది. లాక్డౌన్ తరువాత ఉబెర్ వేగంగా కోలుకుంటున్న మెట్రో మార్కెట్లలో కోల్‌కతా, హైదరాబాద్, ముంబై ఉన్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఉబెర్ ఆటో వేగంగా కోలుకుంది. మరీ ముఖ్యంగా బుకింగ్‌ల సంఖ్య ఇప్పుడు కోవిడ్ ముందు నాటి స్ధాయిలను సైతం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, మైసూర్, భుబనేశ్వర్, జైపూర్, నాగ్‌పూర్, ఇండోర్, నాసిక్ మరియు కొచిలలో అధిగమించడం ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది. లక్షలాది మంది భారతీయులు నూతన సాధారణత వేళ ప్రయాణాలు చేయడం ప్రారంభమైన తరువాత, చిన్న పట్టణాలలో సైతం బలీయంగా కోలుకోవడమనేది కంపెనీ యొక్క ‘ఇండియా టు భారత్’ వ్యూహ విజయాన్ని వెల్లడిస్తుంది. ఇది ప్రాంతీయ మార్కెట్లలో నూతన ఉత్పత్తి ఆఫరింగ్స్‌ను సైతం అందిస్తుంది.
ఇంటి ముంగిట పికప్స్, సురక్షిత మరియు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు వంటివన్నీ అత్యంత అందుబాటు ధరలో లభ్యమవుతున్నాయి. ఉబెర్ ఆటో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పలు నగరాలలో సంప్రదాయ రీతిలో వీధులలో ఆటోల కోసం వెదికే పద్ధతిని సమూలంగా మార్చింది. అతి కొద్ది టచ్ పాయింట్లు, అత్యుత్తమ ఎయిర్ సర్క్యులేషన్, భౌతిక దూర ప్రమాణాలు అందుబాటులో ఉండటం చేత ఆటోలను ఇప్పుడు సురక్షిత ప్రయాణ విధానంగా భావిస్తున్నారు. రైడర్స్ భద్రత, సౌకర్యంకు ఉబెర్ కట్టుబడి ఉండటంతో పాటుగా అందుబాటుధరల్లోని రవాణా పరిష్కారాలు వంటివి లాక్ డౌన్ తరువాత అత్యుత్తమంగా వీలైన ఉత్పత్తిగా మార్కెట్‌కు సరిపోతుందని నిర్థారించడంపై కంపెనీ దృష్టి సారించింది.
భారతదేశ వ్యాప్తంగా నగరాలు అన్‌లాక్ దశలో ప్రవేశించిన తరువాత ఉబెర్ యొక్క మార్కెట్ కూడా కోలుకోవడం ఆరంభించింది. తమ వేదికపై డ్రైవర్ భాగస్వాముల సంఖ్యను ఉబెర్ రెట్టింపు చేయడంతో పాటుగా వారి సంపాదన సైతం మెరుగుపడటంలో సహాయపడుతూనే వారి సమయం గరిష్టంగా వినియోగించుకునేందుకు సైతం తోడ్పడుతుంది. ఇది అసాధారణ ఆర్థిక స్వతంత్య్రతను అందించడంతో పాటుగా సమాజం ఆర్థికంగా కోలుకునేందుకు సైతం తోడ్పడింది. ప్రబ్జీత్ సింగ్, అధ్యక్షులు, ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా మాట్లాడుతూ ‘‘నగరాలలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తరువాత, ప్రజలు ప్రయాణాలు చేయడమూ ఆరంభమైంది. మేము రైడర్ డిమాండ్ పునరుద్ధరించబడటం చూశాం. ఇది డ్రైవర్లకు సైతం సహాయపడింది. కారణమేమిటంటే, మేము వారికి స్థిరంగా జీవనోపాధి అవకాశాలను సైతం సృష్టించబడటం సైతం సాధ్యమైంది. తద్వారా వారు తమ కుటుంబాలకు సైతం మద్దతునందించగలుగుతున్నారు. పలు నగరాల వ్యాప్తంగా రైడర్‌షిప్ పెరగడమనేది మా పట్ల రైడర్లు చూపుతున్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ బాధ్యతను మేము గుర్తించడంతో పాటుగా సౌకర్యవంతమైన, అందుబాటు ధరలలో సురక్షితమైన సవారీ అవకాశాలను ప్రతిరోజూ ప్రయాణ అవకాశాలకు అందించడం ద్వారా మరింతగా రైడర్లలో నమ్మకాన్ని పెంపొందిస్తూనే డ్రైవర్ భాగస్వాములకు జీవనోపాధి అవకాశాలనూ అందిస్తున్నాం’’ అని అన్నారు.
భద్రత అనేది ఉబెర్‌కు ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యతాంశం. రైడర్లతో పాటుగా డ్రైవర్లకు సైతం ఈ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదనే నమ్మకం కలిగించేందుకు గణనీయంగా పెట్టుబడులను కంపెనీ పెడుతుంది. వీటిలో డ్రైవర్ల కోసం సేఫ్టీ సప్లయ్స్‌ను సేకరించడం, కార్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన భద్రతా స్ర్కీన్లను ఏర్పాటుచేయడం, సృజనాత్మక సాంకేతికత ఆధారిత పరిష్కారాలను అమలు చేయడం ద్వారా రైడర్లతో పాటుగా డ్రైవర్లు సైతం ట్రిప్ సమయంలో సురక్షితంగా ఉన్నామనే భరోసా అందిస్తున్నాం.
ఉబెర్ యొక్క యాప్ అంతర్గత భద్రతా పరిష్కారాలలో సమగ్రమైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. వీటిలో గో ఆన్లైన్ చెక్‌లిస్ట్ ; డ్రైవర్‌తో పాటుగా రైడర్లు సైతం తప్పనిసరిగా మాస్కు ధరించాలనే విధానం ; డ్రైవర్‌తో పాటుగా రైడర్లు సైతం కలిసి రైడ్‌కు ముందుగా సెల్ఫీలను తీసుకోవడం ద్వారా ధృవీకరించుకోవడం మరియు భద్రతా ఎస్ఓపీలపై డ్రైవర్లకు తప్పనిసరిగా అవగాహన కల్పించడం వంటివి ఉన్నాయి.