Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· కొత్త బ్రాండ్ కంపెనీ ప్రత్యేక సంస్థగా విజయవంతంగా మార్పు చెందగా, తన ముందు తరానికి మొబిలిటీ పరిష్కరణలు అందించనుంది
· టికెఇను ప్రజా-కేంద్రిత సేవా బ్రాండ్‌గా ఎలివేటర్ పరిశ్రమలో ముందంజలో ఉంది
· కంపెనీ దశాబ్దాల పాటు దక్కించుకున్న విజయాన్ని డిజిటల్ ఆఫర్లలో ముందంజలో ఉన్న నూతన అవకాశాలతో సంయోజన
హైదరాబాద్: థైస్పెన్‌క్రుప్ ఎలివేటర్ ఇప్పుడు టికెఇగా ఎలివేటర్లు మరియు ఎస్కలేటర్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంస్థ టి.కె.ఎలివేటర్ తన నూతన గ్లోబల్ బ్రాండ్ టికెఇను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది మధ్యలో యాజమాన్యం మార్పు ఫలితంగా ఈ బ్రాండ్ తన పేరును మార్చుకుంది. ‘‘కొత్త టికెఇ బ్రాండ్ స్వతంత్ర కంపెనీ కాగా, మరింత విస్తరణ అయ్యేందుకు అవకాశాలను కల్పిస్తోంది. ఇది తదుపరి తరపు మొబిలిటీ సేవల్లో మా మార్కెట్ పొజిషనింగ్ అలానే సాంకేతికత నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు మహోన్నత అవకాశంగా ఉంది. క్లౌడ్-ఆధారిత డిజిటల్ ప్లాట్ఫారం మ్యాక్స్‌ను అన్ని రకాల నూతన ఎలివేటర్ సిస్టమ్‌లకు ఇటీవల జోడించగా, మేము మా ఉత్పత్తులు మరియు సేవల డిజిటలైజేషన్లో గమనార్హమైన ముందడుగు వేశాము. ఇది నగరాల మొబిలిటీ పరిష్కరణలో నూతన నాణ్యత కొలమానాలను రూపొందించిందని’’ టి.కె.ఎలివేటర్ సీఈఓ పీటర్ వాకర్ తెలిపారు. ‘‘మరొకవైపు, బ్రాండ్ టికెఇ మనకు దశాబ్దాల సంప్రదాయం, ఇంజినీరింగ్ జ్ఞానం మరియు విజయాన్ని క్రోఢీకరించేందుకు అవకాశాన్ని ఇస్తుందని’’ వివరించారు. అన్ని డిజిటల్ మరియు భౌతిక ఛానెళ్లలో ప్రయత్నరహితంగా పని చేసేందుకు డిజైన్ చేసిన నూతన బ్రాండ్ లాంఛనపు శక్తి అలానే ఆశావాదంలో సూర్యుడు వెలువరిస్తున్న వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. వెచ్చని, ఉజ్వల వర్ణం మరియు అక్షరం అలాగే లోగో అన్నీ చలనం, సకారాత్మకత మరియు వేగాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సబలీకరణ స్ఫూర్తి, స్వయం ప్రతిపత్తి మరియు శ్రేష్ఠతల అగ్రగామి సాంకేతికతకు ప్రాతినిధ్యం వహించేందుకు సరైన పరిసరంగా ఉంది. కొత్త టికెఇ బ్రాండ్ ప్రజల జీవితాన్ని స్మార్ట్ మరియు అడ్డంకులు లేని మొబిలిటీ పరిష్కరణల ద్వారా మార్పు తీసుకు వచ్చే ప్రజల నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 50,000కు పైచిలుకు ఉద్యోగులను కలిగి ఉన్న టికె ఎలివేటర్ థైస్సెన్క్రుప్ప్ ఎలివేటర్ విజయ పరంపరలో నిర్మాణం కాగా 2019-20 ఆర్థిక ఏడాదిలో 8 బిలియన్ యూరోల విక్రయాలను నమోదు చేసుకుంది. అత్యంత ప్రముఖ టికె ఎలివేటర్ బిజినెస్ లైన్ ఈ లావాదేవీల సేవలను కొనసాగించేందుకు కట్టుబడి, ప్రస్తుతం 1.4 మిలియన్ ఎలివేటర్ మరియు ఎస్కలేటర్ యూనిట్లను ప్రపంచ వ్యాప్తంగా 24,000 సర్వీస్ సాంకేతికత సేవల మద్దతుతో నిర్వహిస్తోంది. టికెఇ ఉత్పత్తుల పరిధి విస్తృత శ్రేణి ఉత్పత్తులను కలిగి ఉంది: వసతి అలాగే వాణిజ్య భవంతులకు రెండు ఎలివేటర్లతో అత్యాధునిక, న్యూయార్క్‌లోని ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి అత్యాధునిక ఆకాశ హార్మ్యాలకు అత్యంత కస్టమైజ్ చేసిన పరిష్కరణలు ఉన్నాయి. ఎలివేటర్లలో దాని పోర్ట్‌ఫోలియోలో ఎస్కలేటర్లు మరియు మూవింగ్ వాక్స్, ప్యాసింజర్ బోర్డింగ్ వంతెనలు, మెట్లు మరియు ప్లాట్ఫారం లిఫ్ట్‌లు మాత్రమే కాకుండా అన్ని ఉత్పత్తులకు ప్రత్యేకంగా రూపొందించిన సేవా పరిష్కరణలను కలిగి ఉండగా, నగరంలోని మొబిలిటీకి విస్తృత వ్యాప్తిని కలిగి ఉంది.
‘‘ఒక ఏడాదిలో టికె ఎలివేటర్ తన సేవా ఆఫర్లను విజయవంతంగా వైవిధ్యమయం చేసింది మరియు గ్లోబల్ అడుగు జాడలను విస్తృతం చేసుకుందని పీటర్ వాకర్ తెలిపారు.‘‘మా నూతన బ్రాండ్ గుర్తు సాధన మా సదృఢ పరంపరను మరింత ఉత్తమంగా ప్రతిఫలిస్తుంది. ఇది ప్రజల కేంద్రిత సేవా బ్రాండ్‌గా మా లక్ష్యాన్ని చాటి చెబుతుంది అలాగే డిజిటల్ పరిష్కరణల్లో అగ్రగామిగా పని చేస్తుందని’’ తెలిపారు.