Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 627 పాయింట్ల పతనం
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 627 పాయింట్లు లేదా 1.25శాతం కోల్పోయి 49,509కి పడిపో యింది. అదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 16,691 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో 20 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుస లో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, ఎస్బీఐ, హెచ్యూఎల్, టాటా మోటార్స్ సూచీలు 4 శాతం మేర పెరిగి అధిక లాభాలు నమోదు చేసిన వాటిలో టాప్లో ఉన్నాయి. 2020-21లో బీఎస్ఈ సెన్సెక్స్ 68 శాతం, నిఫ్టీ 70.8 శాతం చొప్పున పెరిగాయి. ఇంతక్రితం గరిష్టంగా 2009-10లో సెన్సెక్స్ 80.5 శాతం, నిఫ్టీ 73.7 శాతం చొప్పున లాభపడ్డాయి.