Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హవా బ్రాండ్‌తో మార్కెట్లోకి..
నవతెలంగాణ - వాణిజ్యప్రతినిధి
అవాన్స్ ప్యూచర్ ప్రయివేటు లిమిటెడ్ మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లను విడుదల చేసింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) స్మార్ట్ సొల్యూషన్స్‌తో వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు ఆ కంపెనీ డైరెక్టర్లు అనీల్ బొండ, దివ్య బోగ్రా, సంజీవ్ జోషి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 'హవా కోనే కోనే మే' నినాధంతో తొలుత ఐదు మోడళ్లను మూడేసి రంగుల్లో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రిమోట్ కంట్రోల్‌తో పని చేసే వీటి ధరల శ్రేణీ రూ.4000గా ఉంటుందన్నారు. మూడేండ్ల వారంటీ అందిస్తున్నామన్నారు. త్వరలోనే స్మార్ట్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. విశాఖపట్నం, చెన్నెలో ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ ఫ్యాన్లను ఉపయోగించడం ద్వారా విద్యుత్‌ను 58 శాతం మేర ఆదా చేయడం ద్వారా ఏడాదికి రూ.1500 వరకు మిగులొచ్చన్నారు. ఏడాది కాలంలో 40వేల ఫ్యాన్ల అమ్మకాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం ముంబయి, ఢిల్లీలో తయారు చేస్తున్నామనీ.. తెలంగాణలో ప్లాంట్ పెట్టే యోచనలో ఉన్నామన్నారు.త