Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· 2017 సంవత్సరం తరువాత విడుదలైన శాంసంగ్ స్మార్ట్ టీవీ మోడల్స్‌పై టీవీ ప్లస్ లభ్యం
· శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ మరియు ‘ఓ’ ఓఎస్ కలిగిన ట్యాబ్‌లు లేదా ఆ పైన సాఫ్ట్వేర్ వెర్షన్
హైదరాబాద్: శాంసంగ్ నేడు శాంసంగ్ ప్లస్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్ స్మార్ట్ టెలివిజన్ యొక్క వినియోగదారులకు ఉచిత టీవీ కంటెంట్ అందించే వినూత్నమైన సేవ ఇది. యాడ్ మద్దతు కలిగిన ఎంపిక చేసిన లైవ్ ఛానెల్స్, ఆన్ డిమాండ్ వీడియోలను ఎలాంటి అదనపు ఉపకరణాలు అయినటువంటి సెట్ టాప్ బాక్స్ అవసరం లేకుండానే వీక్షించవచ్చు. ఈ సేవలను పొందడం కోసం వినియోగదారులకు కావాల్సినది శాంసంగ్ స్మార్ట్ టీవీ (2017 తరువాత మోడల్స్) మరియు ఇంటర్నెట్ కనెక్షన్ !
టీవీ ప్లస్ పరిచయంతో, వినియోగదారులు తక్షణమే ఉత్సాహపూరితమెన కంటెంట్‌ను విభిన్నమైన విభాగాలైనటువంటి న్యూస్, లైఫ్‌స్టైల్, టెక్నాలజీ, గేమింగ్, సైన్స్, స్పోర్ట్స్, ఔట్‌డోర్స్, మ్యూజిక్, మూవీస్ మరియు బింగేబల్ షోలను ఎలాంటి సబ్‌స్ర్కిప్షన్ లేకుండానే చూడవచ్చు. టీవీ ప్లస్ ఇప్పుడు అధికశాతం శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు మరియు ‘ఓ’ ఓఎస్ లేదా అంతకు మించిన సాఫ్ట్వేర్ వెర్షన్ కలిగిన ఉపకరణాలపై లభ్యమవుతుంది. గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై ఈ సేవలు ఏప్రిల్ 2021వ తేదీ నుంచి లభ్యమవుతాయని అంచనా. ఈ టీవీ ప్లస్ యాప్‌ను శాంసంగ్ గెలాక్సీ స్టోర్ మరియు గుగూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ వినూత్నమైన సేవలను మారుతున్న వినియోగదారుల అభిరుచులు, వారి ప్రవర్తనలను దృష్టిలో పెట్టుకుని పరిచయం చేశారు. మహమ్మారి కారణంగా వచ్చిన లాక్డౌన్ సమయంలో, వినియోగదారులు మరీముఖ్యంగా మిల్లీనియల్స్ మరియు జెన్ జెడ్ వినియోగదారులు తమ టెలివిజన్లను మరింత అధికంగా నూతన, ఉత్సాహపూరితమైన కంటెంట్ కోసం వీక్షించారు. భారతదేశంలో, శాంసంగ్ టీవీ ప్లస్ తక్షణమే అన్ని శాంసంగ్ స్మార్ట్ టీవీ మోడల్స్‌పై లభ్యం కానుంది. మరీ ముఖ్యంగా 2017 నుంచి 2021 వరకూ విడుదలైన అన్ని స్మార్ట్‌టీవీలపై ఇది లభ్యమవుతుంది .దీని ద్వారా వినియోగదారులు 27కు పైగా అంతర్జాతీయ, స్ధానిక ఛానెల్స్ వీక్షించవచ్చు. ఈ సేవలు మరింత విస్తృతం చేసేందుకు అనువుగా మరిన్ని ఛానెల్స్‌ను ఈ వేదిక పైకి తీసుకురానున్నారు.
‘‘గత సంవత్సర కాలంగా, వినియోగదారులు అధిక సమయం ఇంటి వద్దనే గడుపుతున్నారు. వారి టెలివిజన్ సెట్స్ మరియు స్మార్ట్ఫోన్లు వారి జీవితాలలో అతి కీలకంగా మారాయి. అది వినోద పరంగా మాత్రమే కాదు, సమాచార పరంగానూ ఇదే ధోరణి కనిపిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు అద్భుతమైన మీడియా కంటెంట్‌కు అసాధారణ విలువనందిస్తున్నారు. ఈ కారణం చేతనే మేము శాంసంగ్ టీవీ ప్లస్‌ను భారతదేశంలో పరిచయం చేశాం. రాబోయే కొద్ది నెలల్లో, మేము టీవీ ప్లస్‌ను మరిన్ని ఛానెల్స్‌కు మరియు కంటెంట్‌కు విస్తరించనున్నాం’’ అని రేష్మ ప్రసాద్ విర్మానీ, డైరెక్టర్, సర్వీసెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ఓ దశాబ్దకాలంగా భారతదేశంలో నెంబర్ 1 బ్రాండ్ టెలివిజన్‌గా శాంసంగ్ టెలివిజన్లు నిలుస్తున్నాయి. శాంసంగ్ ఇప్పుడు తమ స్మార్ట్‌టీవీలను 18,900 రూపాయల నుంచి 15,79,900 రూపాయలలో అందిస్తుంది. భారతదేశంలో ఈ ఆవిష్కరణతో శాంసంగ్ టీవీ ప్లస్ ఇప్పుడు 14 దేశాలలో లభ్యమవుతుంది. వీటిలో యుఎస్, కెనడా, కొరియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, యుకె, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో ఉన్నాయి.
అంతర్జాతీయంగా, శాంసంగ్ టీవీ ప్లస్ ఇప్పుడు శాంసంగ్ టీవీ మరియు గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు 800కు పైగా ఛానెల్స్‌ను న్యూస్, స్పోర్ట్స్,ఎంటర్టైన్మెంట్ మరియు మరెన్నో విభాగాలలో అందిస్తుంది. శాంసంగ్ టీవీ ప్లస్ మరియు ఛానెల్ లైనప్ గురించి మరింత సమాచారం పొందేందుకు https://www.samsung.com/in/tvs/smart-tv/samsung-tv-plus/చూడవచ్చు.