Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: పురుషుల సంరక్షణ ఉత్పత్తుల శ్రేణిని అందిస్తున్న ది హిమాలయ డ్రగ్ కంపెనీ హిమాలయ మెన్ 2022లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పురుషులకు నిర్వహించే పోటీలు, కార్యక్రమాలకు అధీకృత మెన్స్ గ్రూమింగ్ భాగస్వామిగా మారేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ భాగస్వామ్యం ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2021, ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ 202 మరియు ఐసిసి వరల్డ్ కప్ 2022కు కూడా కొనసాగనుంది.
ఈ భాగస్వామ్యం గురించి ది హిమాలయ డ్రగ్ కంపెనీ కన్సూమర్ ప్రొడక్ట్స్ డివిజన్ బిజినెస్ డైరెక్టర్ రాజేశ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘భారతదేశంలో క్రికెట్ అంటే ప్రతి ఒక్కరూ ఆస్వాదించే క్రీడగా ఉంది మరియు ఇది క్రికెట్‌కు గ్లోబల్ పాలక మండలి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భాగస్వామ్యం ఉండడం మహోన్నత అవకాశమని చెప్పవచ్చు. ఇది స్థానికంగా వృద్ధి చెందిన పురుషుల గ్రూమింగ్ బ్రాండ్ అయిన హిమాలయ మెన్‌ను గ్లోబల్ వేదికకు తోడ్కొని వెళ్లేందుకు అద్భుత అవకాశం కాగా, ఇది వెల్నెస్ మరియు క్రీడకు మా నిబద్ధతను మరోసారి ధృవీకరిస్తుంది. ఈ భాగస్వామ్యం మా భారీ వినియోగదారుని వలయానికి ‘ప్రతి ఇంట్లోనూ వెల్నెస్ మరియు ప్రతి హృదయంలోనూ సంతోషాన్ని అందించే మా బ్రాండ్ లక్ష్యాన్ని మరింత వృద్ధి చేయనుందని’ వివరించారు.
ఈ భాగస్వామ్యం గురించి ది హిమాలయ డ్రగ్ కంపెనీ కన్సూమర్ ప్రొడక్ట్స్ డివిజన్ అసోసియేట్ జనరల్ మేనేజర్ అశ్వని గాంధి మాట్లాడుతూ ‘‘పురుషులు కేవలం మెట్రోల్లో మాత్రమే కాకుండా టైయర్ 2 మరియు టైయర్ 3 నగరాల్లో వారు కనిపించే విధానం మరియు వారు కనిపించే విధానాల గురించి చాలా ప్రజ్ఞను కలిగి ఉన్నారు. పురుషుల గ్రూమింగ్ ఆత్మ విశ్వాసాన్ని పెంచడంలో ప్రముఖ పాత్రను కూడా వహిస్తుంది మరియు హిమాలయ కూడా దానిపైనే నమ్మకాన్ని ఉంచింది. క్రికెట్‌తో హిమాలయ అనుసంధానం భారతదేశపు క్రికెట్ జట్టు నాయకుడు విరాట్ కోహ్లి మరియు రిషభ్ పంత్ హిమాలయ మెన్ బ్రాండ్‌కు రాయబారులుగా ఉండడంతో ప్రారంభమైంది. నేడు హిమాయల మెన్ తన పురుషులు మొహం సంరక్షణకు తన పరిధిని విస్తరించుకుంది. రానున్న నెలల్లో మేము ఈ భాగస్వామ్యానికి ప్రత్యేక యాక్టివేషన్ క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నాము. మేము ఐసిసి నుంచి చాలా ఉత్సాహకరమైన భాగస్వామ్యాన్ని వేచి చూస్తున్నామని’’ పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి ఐసిసి చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా మాట్లాడుతూ ‘‘మా కార్యక్రమాలు అగ్రగామి బ్రాండ్లను అద్భుతంగా తమతో కలుపుకుని వెళుతున్నాయి మరియు తీవ్ర ఆసక్తి ఉన్న అభిమానులతో కమ్యూనికేషన్లకు సరిసాటి లేని, ఉన్నత పరిధిలో వేదికను కల్పిస్తున్నాయి. హిమాలయ మెన్ మేము నిర్వహించిన కొన్ని పురుషుల ప్రముఖ టోర్నమెంట్లకు భాగస్వామిగా ముందుకు రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. సౌతాప్టంన్లో జరుగనున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో ప్రారంభమై భారతదేశంలో జరిగగే ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్ 2021 అనంతరం ఆస్ట్రేలియాలో ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ 2022వరకు కొనసాగనుందని’’ వివరించారు.