Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర వ్యతిరేకతతో వెనక్కు తగ్గిన కేంద్రం
- పొరపాటు అని చెబుతూ గంటల్లోనే ప్రకటన
- ఎన్నికల నేపథ్యంలోనే ఉపసంహరణన్న విమర్శలు
న్యూఢిల్లీ : ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి సంబంధించి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వడ్డీరేట్ల తగ్గింపుపై ఆదేశాలను పొరపాటున ఇచ్చామని చెబుతూ.. ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని పేర్కొంది. అయితే ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు తెలుస్తోంది. పలు రాజకీయ పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కేంద్రం వడ్డీరేట్ల తగ్గింపు తాత్కాలికంగా వెనక్కు తగ్గిందని, ఎన్నికల తర్వాత అమలు పరిచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిజంగానే పొరబడ్డారా లేవందే దీని వెనుక ఎన్నికల జిమ్మిక్కు ఏమైనా ఉందా ? '' అని కాంగ్రెస్ ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తన తాజా ప్రకటనతో ఎవరినీ మోసం చేయలేరని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే తాత్కాలికంగా ఉపసంహరణ ప్రకటన చేసిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది.