Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు ఎన్ఎండీసీ గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఉత్పత్తి, అమ్మకాల్లో మెరుగైన ప్రగతిని కనబర్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తిలో 8 శాతం వృద్ధితో 34.11 మిలియన్ టన్ను (ఎంటీ)లకు చేరినట్టు ఈ ప్రభుత్వ రంగ సంస్థ పేర్కొంది. గడిచిన ఏడాదిలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ తమ సిబ్బంది కృషితో మెరుగైన ప్రగతిని కనబర్చామని ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేబ్ పేర్కొన్నారు. 2019-20లో ఇది 31.49 ఎంటీలుగా ఉన్నట్టు తెలిపింది. ఇదే సమయంలో అమ్మకాలు 31.50 ఎంటీలుగా ఉండగా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పెరిగి 33.27 ఎంటీలుగా నమోదు చేసినట్టు వెల్లడించింది. గడిచిన మార్చి త్రైమాసికంలో ఇది వరకు ఎప్పుడూ లేని స్థాయిలో ఏకంగా 30 శాతం వృద్ధితో 12.31 ఎంటీల ఉత్పత్తి చేసినట్టు తెలిపింది.