Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటరప్స్ చేతికి 49 శాతం వాటా
హైదరాబాద్ : ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్లో అమెరికాకు చెందిన ఇంటరప్స్ సంస్థ 49 శాతం వాటా కొనుగోలుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న టర్బో మెగా ఎయిర్వేస్ 2013లో ట్రూజెట్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ 21 ప్రాంతాలకు ఏడు ఎయిర్క్రాప్ట్లతో విమానయాన సేవలందిస్తోంది. వాటా విక్రయంతో వచ్చే పెట్టుబడులతో మరిన్ని గమ్యస్థానాలకు సేవలను విస్తరించనున్నట్టు ట్రూజెట్ పేర్కొంది. 49 శాతం వాటా విక్రయం ద్వారా వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పౌర విమానయాన రంగంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఉపయోగించుకోనున్నామని మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ గ్రూపు డైరెక్టర్ కెవి ప్రదీప్ తెలిపారు.