Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 471 శాతం పెరుగుదల
ముంబయి : బంగారం వినియో గంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ గడిచిన నెలలో రికార్డ్ స్థాయిలో దిగుమతులు చేసు కుంది. మార్చిలో పసిడి దిగుమతులు 471 శాతం పెరిగి ఏకంగా 160 టన్నులుగా నమోదయ్యాయి. దిగుమతి పన్నుల తగ్గింపు, ధరలు రికార్డు స్థాయి నుంచి దిగిరావడంతో కొనుగోళ్లు పెరిగాయి. 2020 ఆగస్టు నాటి ధరలతో పోల్చితే ప్రస్తుతం దాదాపు 17 శాతం లేదా రూ.12వేల మేర దిగివచ్చాయని... దీంతో ఇటీవళ కొనుగోళ్లు పెరిగాయని బులియన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఏడాది మార్చి త్రైమాసికంలో భారత్ రికార్డు స్థాయిలో 321 టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 124 టన్నుల దిగుమతి చోటు చేసుకుంది. గతేడాది మార్చిలో 1.23 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9వేల కోట్లు) విలువ చేసే పసిడి దిగుమతులు నమోదు కాగా.. గడిచిన మాసంలో వీటి దిగుమతుల విలువ ఏకంగా 8.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.61,320 కోట్లు)కు చేరుకుందని అధికార వర్గాల సమాచారం. రిటైల్ డిమాండ్ పెంచేందుకు, దేశంలోకి పసిడి అక్రమ రవాణాను తగ్గించడానికి ఫిబ్రవరిలో బంగారంపై దిగుమతి సుంకాలను 12.5శాతం నుండి 10.75శాతానికి కేంద్రం తగ్గించింది. అధిక ధరల వల్ల ఇంత కాలం కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వినియోగదారులు ఇటీవల పసిడిని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని అభరణాల వర్తకులు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.46750గా నమోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ.42250గా పలికింది.