Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలయన్స్ రిటైల్ వెల్లడి
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కొనుగోలు ఒప్పంద అంశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మరో ఆరు మాసాల గడువు పెంచింది. అమెజాన్‌తో న్యాయ వివాదం నేపథ్యంలో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం అమలు సమయాన్ని పొడిగించింది. దీంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు ఫ్యూచర్ రిటైల్ యాజమాన్యానికి ఊరట కలిగించినట్టయ్యింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేయడానికి రిలయన్స్ రిటైల్ గతేడాది ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థ ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు వాటాలు ఉండటంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తమ అనుమతి లేకుండా ఎలా విక్రయిస్తారని అమెజాన్ న్యాయస్థానాలను ఆశ్రయించగా.. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండటంతో రిలయన్స్ గడువును పొడిగించక తప్పలేదు.