Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశానికి స్మార్ట్‌ఫోన్ తయారీ భవిష్యత్తును రూపొందించడానికి ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ డివైస్ బ్రాండ్ ఒప్పో సిద్ధంగా ఉంది. హైటెక్ తయారీ శక్తి సామర్థ్యాలు, వినూత్నమైన ఆటోమేషన్ మరియు అత్యాధునిక ఉపకరణాలతో ఒప్పో ఇండియాకు నోయిడాలో ఉన్న పరిశ్రమలో ప్రస్తుతం ప్రతి మూడు క్షణాలకు ఒక స్మార్ట్‌ఫోన్ తయారవుతుంది. స్మార్ట్ఫోన్లకు వేగవంతమైన సప్లయ్ చెయిన్ మార్కెట్‌ను హామీ ఇచ్చేందుకు, పరిశ్రమలో ఏ సమయంలోనైనా 1.2 మిలియన్ ఫోన్లకు పైగా నిలువ ఉండేలా కంపెనీ చూసుకుంటుంది.
అధిక-నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చే సామర్ధ్యంతో, పరిశ్రమలో ఉత్పత్తి స్థాయికి తగిన అత్యాధునిక యంత్రాలు ఉన్నాయి. అసెంబ్లీ, SMT (సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ), స్టోరేజ్, సప్లై వేర్‌హౌస్‌తో సహా మొత్తం పరిశ్రమను నాలుగు విభాగాలుగా విభజించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా SMT విభాగంలోని సూపర్ మెషిన్లు గంటకు 37,000 మైక్రో భాగాలను ఉత్పత్తి చేస్తాయి. PCB ఎంత క్లిష్టతను కలిగి ఉన్నా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇక్కడి సిబ్బంది ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ లేదా పిసిబిఎను 6.25 క్షణాల్లో పూర్తి చేస్తుంది.
ప్రతి ఉత్పత్తిని ప్యాక్ చేసి మార్కెట్‌కు పంపించే ముందు ఎలక్ట్రికల్ పని తీరు పరీక్షలు, నిర్మాణాత్మక విశ్లేషణలు (విధ్వంసక, స్ట్రక్చర్-ప్లగ్), పర్యావరణ ఏజింగ్ పరీక్ష (ఫంక్షనల్ భాగాల నిరంతర ఏజింగ్, వివిధ వాతావరణాల్లో అనుకూలత) తదితర పలు రకాల పరీక్షలను నిర్వహించడం ద్వారా హై-ఎండ్ ప్రీమియం ఒప్పో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తారు. ప్రతి అసెంబ్లి లైన్లో హార్డ్ ప్రెజర్ టెస్ట్ వంటి వినూత్నమైన పరీక్ష ఉపకరణాలతో 20 టెస్ట్ పాయింట్లు ఉండగా, ఇందులో 35 కిలోల పుష్ 100 సార్లు ప్రయోగించిన తర్వాత స్మార్ట్‌ఫోన్ పనితీరును పరీక్షిస్తారు. మైక్రో-డ్రాప్ పరీక్షలో భాగంగా ఉపకరణాలను 10 సెం.మీ ఎత్తు నుంచి 28,000 సార్లు కిందకు పడేస్తారు. తయారీ యూనిట్ 37 అసెంబ్లి స్టేషన్లు మరియు 20 టెస్ట్ స్టేషన్లతో 52 వరుసల్లో ఉంటుంది మరియు 10 నిమిషాల్లో 200 స్మార్ట్ఫోన్ల తయారీకి వందలాది మైక్రో-పార్ట్‌లను పంపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
దీని గురించి ఒప్పో ఇండియా అధ్యక్షుడు ఎల్విస్ జౌ మాట్లాడుతూ, “భారతదేశం ఒప్పోకు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన మార్కెట్‌గా ఉంద మరియు ఈ పరిశ్రమ దేశం పట్ల సంస్థకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని చెప్పవచ్చు. అధిక స్థాయి నైపుణ్యం, సృజనాత్మక మరియు కాగ్నిటివ్ నైపుణ్యాలతో హై-ఎండ్ టెక్నాలజీ మరియు మానవ వనరుల శ్రామిక శక్తి ఏకీకరణతో మనందరికీ అత్యంత ప్రియమైన ఒప్పో స్మార్ట్ ఫోన్లను తయారు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఒప్పో స్మార్ట్ఫోన్లకు వృద్ధి చెందుతున్న ప్రజాదరణ, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మేము మా ఉత్పాదక సామర్థ్యాలను మరింత వృద్ధి చేసుకుంటున్నాము. ఒప్పో ఇండియా విజయానికి చురుకుదనం, వినూత్నత మరియు సృజనాత్మకత కీలకంగా ఉన్నాయని’’ ఆయన పేర్కొన్నారు.
2016లో నెలకొల్పిన మెగా ఫెసిలిటీ భారతదేశంలో ఒప్పో వృద్ధి మరియు విజయాన్ని వరుసగా మార్గదర్శనం చేస్తూ వచ్చింది. 10,000 మందికి పైగా వర్క్ ఫోర్స్‌తో, పరిశ్రమ ఆయా సీజన్లలో గరిష్టంగా నెలకు 6 మిలియన్ల పైచిలుకు ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. పరిశ్రమలోని ప్రతి శ్రామిక శక్తి కఠినమైన షెడ్యూల్లో శిక్షణ పొందుతుంది. విలువ సృష్టి, కచ్చితమైన పని మరియు నాణ్యత నిర్వహణ భరోసా ఇచ్చే ప్రపంచ స్థాయి పరిశ్రమను నిర్వహించేందుకు సాంకేతిక నైపుణ్యాలు మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలను కలిగిన చక్కని శిక్షణ పొందిన వర్క్ ఫోర్స్‌ను తయారు చేసేలా దీన్ని రూపొందించారు. నేషనల్ జియోగ్రాఫిక్ నుంచి ‘‘సూపర్ ఫ్యాక్టరీ’’గా అభివర్ణించబడిన నోయిడాలోని 110 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఈ పరిశ్రమ భారతదేశంలో ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ ప్రయాణంలో ముందంజలో ఉంది. ఒప్పో ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించిన అవలోకనం ఇక్కడ ఉంది.