Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: PhonePe యాప్‌లో UPIని ఉపయోగించి FASTagలను జారీ చేయడానికి భాగస్వామం కుదుర్చుకున్నట్లు ICICI బ్యాంక్, PhonePe సంస్థలు ఈ రోజు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా 28 కోట్ల మందికి పైగా ఉన్న రిజిస్టర్డ్ PhonePe యూజర్లు తమ సౌలభ్యాన్ని బట్టి PhonePe యాప్‌లో ICICI బ్యాంక్ FASTagను ఆర్డర్ చేసి, ట్రాక్ చేయడానికి అవకాశం కలుగుతుంది. PhonePe యూజర్లు, ఏ బ్యాంకు కస్టమర్లు అయినా కావచ్చు కానీ, వారు FASTagను కొనడానికి ఫిజికల్ స్టోర్లలోకి గానీ లేదా లేదా టోల్ ఛార్జి వసూలు చేసే ప్రదేశాలను సందర్శించాల్సిన అవసరం గానీ లేదు. ఎందుకంటే పూర్తి డిజిటలైజ్ చేయబడిన సౌకర్యం ఇప్పుడు వారికి యాప్‌లో అందుబాటులో ఉంది. FASTag జారీ కోసం PhonePeతో భాగస్వామ్యం కుదుర్చుకున్న తొలి బ్యాంక్ ICICI బ్యాంక్.
FASTag అనేది ఒక బ్రాండ్ పేరు. దీని యజమాని- ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL). ఇది నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) ఆధ్వర్యంలో, అలాగే దాని ఇతర అనుబంధ ప్రాజెక్టుల్లో టోల్ ఛార్జీలను ఎలక్ట్రానిక్ రూపంలో తీసుకుంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), IHMCL, NHAI అనే మూడు సంస్థలు సంయుక్తంగా రాష్ట్ర, జాతీయ రహదారి టోల్ చెల్లింపులను పూర్తిగా డిజిటల్ చేయడానికి కృషి చేస్తున్నాయి. ICICI బ్యాంక్, PhonePe అనుసంధానం సందర్భంగా ICICI బ్యాంక్ అన్సెక్యూర్డ్ అసెట్స్ విభాగం హెడ్ శ్రీ సుదీప్త రాయ్ ఇలా వ్యాఖ్యానించారు. “రవాణా ఎకోసిస్టమ్‌లో డిజిటల్ రూపంలో ఉన్న FASTagను తీసుకునే సౌలభ్యాన్ని మరింత సులభతరం చేయడానికి PhonePe, NPCI సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లాది మంది PhonePe కస్టమర్లు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి, వారి ఇంటి వద్దనే ఉచితంగా డెలివరీ పొందడానికి ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది. ICICI బ్యాంక్ కస్టమర్లు కాని యూజర్లకు కూడా ఈ భాగస్వామ్యం చక్కగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది, UPI సౌలభ్యంతో ఆర్డర్ చేయడానికి, తరువాత రీఛార్జ్ చేయడానికి వారికి అవకాశం కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యంతో, FASTag ఎకోసిస్టమ్‌లో ICICI బ్యాంక్ మరో ఘనతను సాధించింది. ముంబై - వడోదర కారిడార్‌లో FASTagను జాతీయ స్థాయిలో మొట్ట మొదటగా మేమే ప్రారంభించాము. ఈ కారణంగా FASTagతో మాకు ఆది నుంచి విస్తృతమైన అనుబంధం ఉంది. అప్పటి నుండి, మేము GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గురుగ్రామ్‌లోని టెక్ పార్క్స్ & మాల్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడంలోనూ, అలాగే త్రివేండ్రం, వైజాగ్ల్లో డిజిటల్ సౌలభ్యాన్ని విస్తరించడానికి, వినూత్న పరిష్కార మార్గాలను అవలంభించడానికి మేము గట్టి కృషి చేశాము. ఈ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను మేము ప్రారంభించిన తీరుపై కస్టమర్లు ఎంతో నమ్మకం ఉంచారు. ఇందుకు FASTagలోని సగటు రోజువారీ లావాదేవీల సంఖ్య, వాటి విలువలో మాకున్న మార్కెట్ లీడర్షిప్ ఒక నిదర్శనంగా నిలుస్తోంది. PhonePeతో మా తాజా ఒప్పందం FASTagను అందుకోవడాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుందని, డిజిటల్‌గా ఎలాంటి సమస్యలు లేకుండా చూడటంలో ఒక మైలురాయిగా మారుతుందని మేము నమ్ముతున్నాము.”
ఈ తాజా పరిణామంపై, PhonePe పేమెంట్స్ విభాగం హెడ్ శ్రీ దీప్ అగర్వాల్ ఇలా వ్యాఖ్యానించారు. “కోట్లాది మంది PhonePe యూజర్లు నేరుగా మా ప్లాట్ఫామ్లో ఎలాంటి సమస్యలు లేకుండా, సౌకర్యవంతంగా FASTagను కొనుగోలు చేయడానికి ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. రవాణా రంగంలో పేమెంట్స్ విభాగాన్ని డిజిటలైజ్ చేయడంలో FASTag కీలక పాత్ర పోషించింది. మా ప్లాట్ఫామ్లో FASTagను రీఛార్జ్ చేస్తున్న మా యూజర్ల నుండి మేము ఇప్పటికే అద్భుతమైన ప్రతిస్పందనను చూశాము. మా యాప్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది మంది కస్టమర్లు రీఛార్జ్ చేసుకుంటున్నారు. నిజానికి, FASTag రీఛార్జ్ గత 3 నెలల్లో 145% వృద్ధిని సాధించింది, ఇది, లాక్డౌన్ తదనంతరం మార్కెట్లు తెరుచుకున్న తరువాత నగరాల మధ్య ప్రయాణాలు పెరిగిన తీరును సూచిస్తుంది. PhonePeకి ఉన్న విస్తృత వ్యాప్తి, పేమెంట్స్‌లో ఉన్నత శ్రేణి సామర్థ్యం, చక్కటి యూజర్ ఎక్స్పీరియన్స్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు FASTagను కొనుగోలు చేసి, ఉపయోగించడానికి మా తోడ్పాటు ఉపకరిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము”
NPCIలోని NETC & AEPS విభాగం హెడ్ శ్రీ డెన్నీ థామస్ NPCI దృక్కోణాన్ని ఇలా వివరించారు. “PhonePe, ICICI బ్యాంక్‌ల భాగస్వామ్యం NETC FASTagను తీసుకోవడాన్ని కచ్చితంగా పెంచుతుంది. అలాగే కస్టమర్లకు వారి ఇంటి వద్దనే FASTagను డోర్ డెలివరీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా FASTag వినియోగాన్ని మరింతగా పెంచుతుందని, PhonePe యాప్ ద్వారా యూజర్లకు ఎలాంటి సమస్యలు లేని రీఛార్జ్ అనుభవాన్ని అందిస్తుంది అని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు కాంటాక్ట్‌లెస్ ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ల ప్రాధాన్యాన్ని కస్టమర్లు గుర్తించారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లోని టోల్ ప్లాజాల్లో FASTagను అంగీకారం పెరగడం వల్ల రిటైల్ కస్టమర్లు ఇప్పుడు పార్కింగ్‌లోనూ, ఇతర చోట్ల కూడా ఇలాంటి కాంటాక్ట్‌లెస్ చెల్లింపు సౌకర్యం అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు.”
PhonePe యూజర్లు కొన్ని సులభమైన దశలను అనుసరించి ICICI బ్యాంక్ FASTagను కొనుగోలు చేయవచ్చు. యూజర్లు PhonePe యాప్‌లో హోమ్ పేజీకి వెళ్లి ‘ICICI బ్యాంక్ FASTag’ (నా డబ్బు, స్విచ్ విభాగం కింద)పై క్లిక్ చేసి, ‘కొత్త FASTag కొనండి’ పై క్లిక్ చేయాలి. అప్పుడు PAN నంబర్, వెహికల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తయిన తరువాత FASTag కస్టమర్ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. దాన్ని వాహనంలోని విండ్‌షీల్డ్‌కు అతికించవచ్చు. ఆ మరుక్షణం నుంచే దాన్ని వినియోగించవచ్చు.
ICICI బ్యాంక్ పరిచయం: ICICI బ్యాంక్ లిమిటెడ్ ((BSE: ICICIBANK, NSE: ICICIBANK మరియు NYSE:IBN) భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంక్ యొక్క మొత్తం కన్సాలిడేటెడ్ అసెట్స్ ₹ 15,19,353 కోట్లుగా ఉన్నాయి. ICICI బ్యాంక్ యొక్క సబ్సిడరీల్లో భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బీమా, అసెట్ మేనేజ్మెంట్, సెక్యూరిటీల బ్రోకరేజ్ కంపెనీలు ఉన్నాయి. అలాగే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో కూడా ఈ బ్యాంకు సబ్సిడరీలు ఉన్నాయి. భారత దేశంతో సహా 15 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.