Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఫోర్డ్ మళ్లీ నగదుకు మహోన్నత విలువ ఇచ్చే తన భరోసాను నెరవేర్చగా, 2020 ఎడిషన్ ఆటోకార్ ఇండియా వెహికల్ మెయింటెయినెన్స్ అధ్యయనంలో తన కార్లు మరియు ఎస్‌యువిలు ఆయా వర్గాల్లో అత్యంత అందుబాటు ధరలో ఉన్నాయని గుర్తింపు ఇచ్చింది. అన్ని వాహన శ్రేణులు మరియు తయారీదారుల పరిధి కలిగి ఉన్న ఆటోకార్ నివేదిక ప్రకారం ఫోర్డ్ ఉత్పత్తులు ఫోర్డ్ ఫిగోకు రూ.20,682 లేదా ప్రతి కిలో మీటరుకు 34 పైసల నుంచి ఫోర్డ్ ఎండీవర్ రూ.42,548 లేదా ప్రతి కిలోమీటరుకు 71 పైసల నిర్వహణ కలిగి ఉండగా, ఈ శ్రేణిలో 60,000 కిలోమీటర్లు లేదా అయిదేళ్ల యాజమాన్యపు సైకిల్‌ను కలిగి ఉంది.
ఈ అధ్యయనం ప్రకారం ఫోర్డ్ ఫిగో పెట్రోల్ మిడ్ సైజ్ హ్యాచ్ బ్యాక్‌లో అత్యంత అందుబాటు ధరలో ఉండగా నిర్వహణకు ప్రతి కిలో మీటరుకు కేవలం 34 పైసలు, ఈ విభాగంలో వాల్యూమ్ లీడర్ కన్నా 28% తక్కువగా ఉంది. ఫిగో డీజిల్ తన అత్యంత శక్తియుతమైన మరియు పెద్ద ఇంజిన్‌తో అత్యంత ఖరీదైనదిగా ఉండగా, నిర్వహణ విషయంలో ప్రతి కిలోమీటరుకు 45 పైసలు మాత్రమే ఖర్చవుతుంది.
కాంప్యాక్ట్ ఎస్యువిల్లో ఫోర్డ్ ఫ్రీస్టైల్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ల నిర్వహణకు అత్యంత తక్కువ ఖర్చు అవుతుండగా, వరుసగా 35% మరియు 38% తక్కువ ఖర్చు వస్తుండగా, నిర్వహణకు ప్రతి కిలోమీటరుకు 34 పైసలు మరియు 45 పైసలు మాత్రమే ఖర్చు వస్తుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్‌కు రూ.21,754 మరియు డీజిల్‌కు రూ.27,882ను 60,000 కిలోమీటరు యాజమాన్యపు సైకిల్‌కు ఖర్చు వస్తుండగా మరోసారి ఈ శ్రేణిలో మైలురాయిని నెలకొల్పింది. ప్రీమియం ఎస్యువి వర్గంలో ఈ అధ్యయనంలో 2020 ఎండీవర్ చూపించగా, మార్కెట్టులోని నాయకునితో పోల్చితే 12% ఖర్చు ఆదా చేస్తుంది. ఫోర్డ్ ఎండీవర్ యజమానులు నిర్వహణకు ప్రతి కిలో మీటరుకు 71 పైసలు మాత్రమే ఖర్చు వస్తుండగా, దాని పోటీ మోడల్ ప్రతి కిలోమీటరుకు 81 పైసలు ఖర్చు చేయడం ద్వారా ఎస్‌యువిను సుస్థితిలో ఉంచుకుంటారు.
‘‘మా ఉత్పత్తులు వారి పూర్తి యాజమాన్యపు సైకిల్లో అద్భుత యాజమాన్యపు విలువలను భర్తీ చేయడాన్ని కొనసాగించేందుకు శ్రమిస్తున్నాము మరియు తప్పు అభిప్రాయాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఆటోకార్ నిర్వహణ నివేదిక మహోన్నత ఉత్తేజనకారిగా ఉంది మరియు మా నిరంతర ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తోందని’’ ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా తెలిపారు. ఆటో కార్ ఇండియా వార్షిక అధ్యయనం తమ కార్లను సుస్థితిలో ఉంచుకునేందుకు యజమానులు చేయవలసిన నిరీక్షిత ఖర్చు అలాగే కాలానుగుణంగా చేయవలసిన సర్వీస్, లేబర్, స్పార్క్ ప్లగ్‌లు, ఫిల్టర్లు (ఆయిల్, ఎయిర్, ఫ్యూయల్, ఎయిర్-కండిషనర్) తదితర నియమిత విడిభఆగాలు మరియు అవసరం అయ్యే ఫ్లూయిడ్ల (ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్) మార్పిడిని విశ్లేషిస్తుంది. ‘‘ఆటో కార్ ఇండియా స్టడీ 2020 కారును దాని సర్వీస్ భాగాలు, వాటి సర్వీస్ అవధి, కార్మికుల ఖర్చు మాత్రమే కాకుండా సర్వీస్ ఇంటర్నెల్స్ ఖర్చు గురించి ఒక స్పష్టత ఇస్తుందని’’ ఆటో కార్ ఇండియా సంపాదకుడు హొర్మద్ సొరాబ్జి తెలిపారు. ‘‘మా వార్షిక సమీక్ష అధీకృతమైన, ఉత్తమ పరిశోధన డేటాతో మేము వినియోగదారులకు పూర్తి సమాచారాన్ని, కొనుగోలు నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం కల్పించడంలో చిన్న పాత్రను పోషించడం సంతోషాన్ని కలిగిస్తోందని’’ పేర్కొన్నారు.