Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ నేడు గెలాక్సీ ఎఫ్ 12 మరియు గెలాక్సీ ఎఫ్02ఎస్‌ను భారతదేశంలో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రత్యేకంగా భారతదేశం కోసం తీర్చిదిద్దిన శాంసంగ్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ సిరీస్. దీనికోసం ఫ్లిప్‌కార్ట్‌తో శాంసంగ్ భాగస్వామ్యం చేసుకుంది. గెలాక్సీ ఎఫ్ 12 స్మార్ట్‌ఫోన్ ఐసోసెల్ ప్లస్ సాంకేతికతతో అసలైన 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరాతో వస్తుంది. మృదువైన 90 హెర్ట్జ్ డిస్ప్లే మరియు అత్యుత్తమ శ్రేణి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. గెలాక్సీ ఎఫ్ 02ఎస్ స్మార్ట్‌ఫోన్ అత్యద్భుతమైన 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ –వీ డిస్ ప్లే మరియు భారీ 5000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.
‘‘భారతదేశంలోని యువ మిల్లీనియల్స్ కోసం గెలాక్సీ ఎఫ్ ను డిజైన్ చేశారు. ఈ తరం ఎక్కువ చేయాలని కోరుకుంటుంటుంది. గెలాక్సీ ఎఫ్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌పై అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్స్‌లో ఒకటిగా నిలిచింది. మేమిప్పుడు గెలాక్సీ ఎఫ్ లైనప్‌ను ఫుల్ ఆన్ ఫ్యాబ్ గెలాక్సీ ఎఫ్ 12 మరియు గెలాక్సీ ఎఫ్ 02ఎస్తో సమృద్ధి చేశాం. ఇవి అద్భుతమైన ఫీచర్లుతో రావడంతో పాటుగా మా యువ వినియోగదారులకు వినోదాత్మక మరియు అపరిమితంగా తమను తాము వ్యక్తీకరించుకునే అవకాశమూ అందిస్తుంది’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆదిత్య సోనీ, సీనియర్ డైరెక్టర్, మొబైల్ , ఫ్లిప్‌కార్ట్ మాట్లాడుతూ ‘‘శాంసంగ్ మరియు ఫ్లిప్‌కార్ట్ నడుమ భాగస్వామ్యం, వినియోగదారులే తొలుత అనే భాగస్వామ్య అభిరుచితో , స్మార్ట్ఫోన్లు చాలామందికి నూతన అత్యవసరం అయిన వేళ నడుమ బడుతుంది. ఎఫ్ సిరీస్ రెండు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకువచ్చింది నూతన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 12 తమతో పాటుగా విశ్వసనీయమైన సాంకేతికతను పూర్తి సరికొత్త విభాగానికి తీసుకువచ్చింది. ఈ ఆవిష్కరణతో, మేము ఈ ఉత్పత్తిని దేశవ్యాప్తంగా వృద్ధి చెందుతున్న మా వినియోగదారుల చెంతకు తీసుకురానున్నాం’’అని అన్నారు.
అసలైన హై రిజల్యూషన్ కెమెరా
గెలాక్సీ ఎఫ్ 12లో అత్యుత్తమ శ్రేణి 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇది జెన్ జెడ్ మరియు మిల్లీ నియల్ వినియోగదారుల అవసరాలైనటువంటి ప్రయాణిస్తున్న సమయంలో మధురక్షణాలు ఒడిసిపట్టేందుకు అనుమతిస్తుంది. వెనుక వైపు గెలాక్సీ ఎఫ్ 12లో అసలైన 48 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, ఐసోసెల్ ప్లస్ టెక్నాలజీ మరియు జీఎం2 సెన్సార్‌తో ఉంది.ఇది అద్భుతమైన స్పష్టతతో సవివరమైన షాట్స్‌ను ఒడిసిపట్టేందుకు మీకు అనుమతిస్తుంది. 5 మెగా పిక్సెల్ అలా్ట్ర వైడ్ లెన్స్‌లో 123 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంది. ఇది చిత్రాలకు మరింత దృష్టికోణం అందిస్తుంది. ఇక 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్‌లు సవివరమైన క్లోజప్ షాట్స్ తీసుకువచ్చింది. దీనితో పాటుగా 2మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా లైవ్ ఫోకస్ అద్భుతమైన పోట్రెయిట్ షాట్స్‌ను చిత్రిస్తుంది. అత్యధిక రిజల్యూషన్ సెల్ఫీల కోసం గెలాక్సీ ఎఫ్ 12 స్మార్ట్‌ఫోన్ 8 మెగా పిక్సెల్ తో వస్తుంది.
గెలాక్సీ ఎఫ్ 02 ఎస్ వెనుక వైపు కెమెరా సెటప్‌లో 13 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ రిఫైన్డ్ మాక్రో లెన్స్ మరియు పూర్తిగా అంకితం చేసిన 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా తో లైవ్ ఫోకస్ వంటివి సవివరమైన చిత్రాలను అందిస్తాయి. గెలాక్సీ ఎఫ్02 ఎస్ స్మార్ట్ఫోన్లు అత్యధిక రిజల్యూషన్ సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉన్నాయి.
డిస్ప్లే: తమ డిస్ప్లే కోసం భారీ ఆధునీకరణలను తమ డిస్ప్లేకు గెలాక్సీ ఎఫ్ 12 తీసుకువచ్చింది. 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ వీ డిస్ప్లేపై 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉండే, తమ సోషల్ మీడియా ఫీడ్‌ను వేగవంతంగా అప్లోడ్ చేయాలనుకునే జెన్ జెడ్ వినియోగదారులకు ఆనందం కలిగిస్తుంది. అదే రీతిలో ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రయాణ సమయాలలో కూడా తమ అభిమాన కంటెంట్‌ను వీక్షించాలనుకునే వినియోగదారులనూ ఆకట్టుకుంటుంది. ఇది వైడ్‌వైన్ ఎల్ 1 సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఇది విభిన్నమైన స్ట్రీమింగ్ మాధ్యమాలపై హై డెఫినేషన్ కంటెంట్‌ను వినియోగదారులు వీక్షించే అవకాశం అందిస్తుంది.
గెలాక్సీ ఎఫ్ 02 ఎస్ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో లీనమయ్యే వీక్షణ అనుభవాలు, కంటెంట్ స్ట్రీమింగ్ మరియు వీడియో కాల్స్‌తో వస్తుంది. మీరు ఒకవేళ గేమ్ ఆడుతున్నా లేదంటే మీ అభిమాన వెబ్ సిరీస్‌ను దశలవారీగా చూస్తున్నా, 20ః9 యాస్సెక్ట్ రేషియో తో పాటుగా డాల్బీ అట్మాస్ మద్దతు కలిగిన వైర్డ్ , బ్లూ టూత్ హెడ్సెట్లు అసాధారణ ఆడియో మరియు సినిమాటిక్ వీక్షణ అనుభవాలను సైతం అందిస్తుంది.
బ్యాటరీ పనితీరు: గెలాక్సీ ఎఫ్ 12 స్మార్ట్ఫోన్లు భారీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడంతో పాటుగా ఇన్‌బాక్స్ 15 వాట్ యుఎస్బీ –సీ ఫాస్ట్ చార్జర్‌తో వస్తున్నాయి. ఇది అడాప్టివ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇది అతి తక్కువ సమయంలోనే బ్యాటరీ 100% తిరిగి పొందేందుకు తోడ్పడుతుంది. దీనిలో 8ఎన్ఎం ప్రాసెసర్ ఉంది. ఈ బ్యాటరీ అసాధారణంగా శక్తిని పొదుపు చేయడంతో పాటుగా మరింత కాలం ఫోన్ వినియోగించుకునేందుకు సైతం అనుమతిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 02ఎస్‌లో భారీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది. దీనివల్ల తరచుగా బ్యాటరీ చార్జ్ చేయాలనే బాధ కూడా ఉండదు.
శక్తివంతమైన 8ఎన్ఎం ఎక్స్నాస్ 850 ఆక్టాకోర్ 2.0 గిగా హెర్ట్జ్ ప్రాసెసర్ కలిగిన గెలాక్సీ ఎఫ్ 12 గరిష్ట పనితీరుకు భరోసా అందించడంతో పాటుగా మృదువైన మల్టీ టాస్కింగ్‌కు సైతం భరోసా అందిస్తుంది, దీనిలో తగ్గించబడిన ఇంధన వినియోగంతో బ్రౌజింగ్, బహుళ యాప్‌లను సౌకర్యవంతంగా వినియోగించుకోవడమూ సాధ్యమవుతుంది. గెలాక్సీ ఎఫ్02 ఎస్‌లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ ఉంది. ఇది 4జీబీ రామ్ కలిగి ఉండటం చేత మెరుగైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్, క్లిష్టత లేని యాప్ నేవిగేషన్ మరియు అవాంతరాలు లేని గేమింగ్‌కు భరోసా అందిస్తుంది.
గెలాక్సీ ఎప్ 12 స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఔట్ ఆఫ్ ద బాక్స్ తో రావడంతో పాటుగా ఒన్ యుఐ 3.1 కోర్కు మద్దతునందిస్తుంది. అదే సమయంలో గెలాక్సీ ఎఫ్ 02 ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 తో రావడంతో పాటుగా ఒన్ యుఐ 2.5 కోర్కు మద్దతునందిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 12 మరియు గెలాక్సీ ఎఫ్ 02 ఎస్‌లు అసాధారణ వేగ అనుభవాల కోసం ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ రామ్ కలిగి ఉంది.
డిజైన్
గెలాక్సీ ఎఫ్ 12 మరియు గెలాక్సీ ఎఫ్ 02ఎస్‌లు ప్రీమియం ఫినీష్‌తో పాటుగా మృదువైన ఒంపులతో వస్తాయి. ఇవిసౌకర్యవంతమైన గ్రిప్ అందించడంతో పాటుగా మీ అభిమాన షోస్ లేదంటే చిత్రాలు చూసేటప్పుడు మరింత సౌకర్యం అందిస్తుంది. గెలాక్సీ ఎఫ్ 12 స్మార్ట్ఫోన్లు మూడు ఆకర్షణీయమైన రంగులు– సీ గ్రీన్, స్కై బ్లూ మరియు సెలస్టియల్ బ్లాక్‌లో వస్తున్నాయి. అదే సమయంలో గెలాక్సీ ఎఫ్ 02 ఎస్ స్మార్ట్ఫోన్లు మూడు అద్భుతమైన రంగులు – ఫైన్ డైమండ్ గ్రేడియంట్ ను ప్రదర్శిస్తూ డైమంట్ బ్లూ, డైమండ్ వైట్ , డైమండ్ బ్లాక్‌లో లభిస్తుంది.
మెమరీ వేరియంట్స్, లభ్యత మరియు ధరలు
గెలాక్సీఎఫ్ 12 స్మార్ట్ఫోన్లు రెండు మెమరీ వేరియంట్స్ –4జీబీ /64జీబీ మరియు 4జీబీ/128 జీబీలో లభ్యమవుతున్నాయి. 4జీబీ/64జీబీ రకపు ధర 10,999 రూపాయలు కాగా, 4జీబీ/128 జీబీ రకపు ధర 11,999 రూపాయలు.
అదే సమయంలో గెలాక్సీ ఎఫ్ 02 ధర 4జీబీ/64జీబీ రకానికి 9999 రూపాయలు కాగా, 3జీబీ/32జీబీ రకపు ధర 8999 రూపాయలలో లభ్యమవుతుంది. ఈ రెండు ఉత్పత్తులూ శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతాయి.