Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవల ముగిసిన 13వ ఎక్ఛేంజ్ 4 మీడియా న్యూస్ బ్రాడ్‌క్రాస్టింగ్ అవార్డ్స్ (ENBA)2020లో భారతదేశ ప్రీమియం ప్రసార నెట్‌వర్క్‌గా గుర్తింపు దక్కించుకున్న టైమ్స్ నెట్వర్క్ పలు విభాగాలలో అత్యుత్తమ గౌరవాన్ని దక్కించుకుంది. భారతీయ వార్తా ప్రసార పరిశ్రమలో ఉత్తమమైన వాటికి పెద్ద పీట వేయడం మరియు మహమ్మారి తీవ్రంగా ఉన్న ఏడాదిలో న్యూస్ ఛానెల్స్ శ్రమను గుర్తించి బ్రాడ్కాస్ట్ సంస్థలైన టైమ్స్ నెట్‌వర్క్‌తో పాటు ఇండియా టుడే, ఆజ్ తక్, సిఎన్‌బిసి-టివి 18, ఎబిపి న్యూస్, జీ మీడియా కార్పొరేషన్లను ఇఎన్బిఎ 2020 అవార్డులతో సత్కరించింది.
మహమ్మారి తీవ్రంగా విస్తరించిన ఏడాదిలో కొవిడ్-19కు సంబంధించిన తప్పుడు సమాచారానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రచారం, సేవలను పరిగణనలోకి తీసుకుని టైమ్స్ నెట్‌వర్క్‌కు ఇఎన్బిఎ 2020లో 22 కీలక పురస్కారాలను ప్రదానం చేశారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని గుర్తించి, గౌరవించే క్రమంలో టైమ్స్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఎం.కె.ఆనంద్‌కు ‘‘సీఈఓ ఆఫ్ ది ఇయర్’’ పురస్కారాన్ని ప్రదానం చేయగా, ఆయన నాయకత్వంలో నెట్వర్క్ పరివర్తన చెందిన వృద్ధిని సాధించింది మరియు ప్రసార పర్యావరణ వ్యవస్థలో సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. సలహాదారులు మరియు వీక్షకులకు మార్గదర్శకత్వంపై తీవ్రమైన దృష్టితో, టైమ్స్ నెట్వర్క్- ప్యాక్ మ్యాన్ సేస్, స్టే హోమ్ అనే రెండు ఇనీషియేటివ్స్‌ను ప్రారంభించింది. సురక్షితంగా ఉండండి మరియు కర్వ్‌ను ఫ్లాట్‌గా చేయండి పేరిట మహమ్మారి సమయంలో ప్రజల భద్రత మరియు సురక్షితంగా ఉండేందుకు ప్రసారం చేసిన సందేశాలకు ‘‘ఉత్తమ ఛానల్/ ప్రోగ్రామ్ ప్రోమో’’కు ఇఎన్బిఎ పురస్కారాన్ని దక్కించుకుంది. అదే విధంగా మహమ్మారి గురించి పెరుగుతున్న తప్పుడు సమాచారం, అపోహలను తొలగించేందుకు నెట్వర్క్ వినూత్నంగా చేసిన ప్రయత్నం ఫైటింగ్ ఫియర్ విత్ ఫ్యాక్ట్స్ కార్యక్రమం ‘బెస్ట్ క్యాంపెయిన్ ఫర్ సోషల్ కాజ్’ పురస్కారాన్ని దక్కించుకుంది. తన ఉద్యోగుల భద్రత మరియు శ్రేయస్సుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చే నెట్వర్క్, ఈ సందర్భంలో మరింత శ్రద్ధ చూపించింది మరియు ‘కొవిడ్-19 సమయంలో ఉద్యోగుల భద్రతకు అనుసరించిన నూతన ప్రక్రియలకు’ ప్రత్యేక పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ గర్వించదగిన క్షణంలో, టైమ్స్ నౌ, విశ్వసనీయత మరియు నిష్పాక్షికమైన వార్తలు మరియు నివేదికలకు అద్దం పడుతుండగా, ఆనాటి మహమ్మారి మరియు ఉధృతితో కూడిన ఇతర సమస్యలకు సంబంధించి సమగ్రమైన మరియు సమతుల్యమైన కవరేజ్‌కు ‘‘న్యూస్ ఛానల్ ఆఫ్ ది ఇయర్ – ఇంగ్లీష్’’ టైటిల్ గెలుచుకుంది. టైమ్స్ నెట్వర్క్ గ్రూప్ పాలిటిక్స్ విభాగం ఎడిటర్- నవికా కుమార్ ఇంగ్లీషులో ‘‘బెస్ట్ యాంకర్’’ అవార్డు అందుకోగా, ఆమె షో ‘ఫ్రాంక్లీ స్పీకింగ్’ ‘‘బెస్ట్ టాక్ షో’’గా ఎంపికైంది. అంతే కాకుండా, సాయంత్రం 6 నుండి అర్ధరాత్రి వరకు ఇంగ్లీష్‌లో ప్రైమ్ టైమ్ వార్తలకు తిరుగులేని నాయకుడిగా టైమ్స్ నౌ నిలిచిందని ఇఎన్బిఎ ధృవీకరించింది. బ్లూప్రింట్ ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్క్లూజివ్కు ‘‘బెస్ట్ ఎర్లీ ప్రైమ్‌టైమ్ షో’’తో పాటు అవార్డులను దక్కించుకోవడంలో టైమ్స్ నౌ ఆధిపత్యం చెలాయించగా, ఇండియా అప్ ఫ్రంట్ మరియు న్యూస్ హవర్ @ 9 ‘‘బెస్ట్ ప్రైమ్ టైమ్ షో’’, న్యూస్ హవర్ @ 10 ఎజెండా ‘‘బెస్ట్ లేట్ ప్రైమ్‌టైమ్ షో’’ అవార్డులను సొంతం చేసుకుంది. భారత సైనిక చరిత్రపై పలు-భాగాల డాక్యుమెంటరీ సిరీస్ మరియు దేశ సరిహద్దులను కాపాడటానికి చేసిన త్యాగాన్ని టేల్స్ ఆఫ్ వాలర్ ద్వారా ప్రసారం చేయగా, అది ‘‘బెస్ట్ ఇన్-డెప్త్ సిరీస్’’ అవార్డును దక్కించుకుంది.
దక్కించుకున్న అవార్డుల గురించి టైమ్స్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ ఎం.కె.ఆనంద్ మాట్లాడుతూ, “ఈ గుర్తింపులను, పురస్కారాలను అందుకోవడం మాకు గౌరవంగా మరియు గర్వంగా ఉంది మరియు మా ప్రయత్నాలను గుర్తించినందుకు ఇఎన్బిఎకు ధన్యవాదాలు. న్యూస్ బ్రాడ్కాస్టర్లకు 2020 సవాళ్లను ఎదుర్కొన్న ఏడాదిగా నిలిచింది. కేవలం మమమ్మారి మాత్రమే కాకుండా, టీఆర్పీ కుంభకోణంతో పాటు పలు విఘాతకరమైన సంఘటనలను, ఆటుపోట్లను ఎదుర్కొనవలసి వచ్చింది. అన్ని సమస్యల మధ్య మా అత్యుత్తమ శ్రేణి న్యూస్ బ్రాండ్లు దీటుగా నిలవడంతో పాటు సమగ్రత, ప్రయోజనంతో నడిచే రిపోర్టేజ్, విభిన్న కంటెంట్ మరియు డిజిటల్ ఆవిష్కరణలతో నిష్కళంకమైన ప్రమాణాలతో మార్కెట్‌ను ముందుకు నడిపించగలిగాయి. చురుకుదనం, సమగ్రత మరియు స్థితిస్థాపకతకు నిదర్శనంగా ఈ అవార్డులు మా ప్రేక్షకులు మాపై ఉంచిన విశ్వసనీయతకు తార్కాణంగా, విశ్వసనీయమైన, అధిక ప్రభావాన్ని చూపే మరియు నిరంతరాయమైన వార్తలను తీసుకురావడం కొనసాగించే మా అభిరుచికి మరింత ఉత్ర్పేరకాలుగా నిలుస్తాయని’’ పేర్కొన్నారు.
‘మీ కోసం పోరాడుతుంది’ మరియు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలపై దృష్టి సారించే ఛానెల్ మిర్రర్ నౌ, ముఖ్యమైన సమస్యలకు సంబంధించి అద్భుతమైన రిపోర్టింగ్ మరియు తమ విధులను నిర్వహించడంలో చూపిన ప్రతిభకు 9 అవార్డులు దక్కించుకుంది. ‘‘ఉత్తమ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాం’’గా అర్బన్ డిబేట్ నిలువగా, మానసిక ఆరోగ్యానికి సంబంధించి మిర్రర్ నౌ ప్రసారం చేసే కార్యక్రమానికి ‘‘సామాజిక సమస్యలపై ఉత్తమ కవరేజ్’’ పురస్కారాన్ని దక్కించుకోగా, ఈ అవార్డులు ప్రజలను నిజంగా ప్రభావితం చేసే సమస్యలను కవర్ చేయవలసిన ప్రాముఖ్యతను చాటి చెప్పాయి. మిర్రర్ నౌ కూడా క్లిష్ట పరిస్థితులలో గ్రౌండ్ రిపోర్టు చేసేందుకు తన నిబద్ధతను కాపాడుకుంటూ గుర్తింపు దక్కించుకుంది. ఈ విభాగంలో ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఫుటేజ్‌కు ‘‘బెస్ట్ న్యూస్ వీడియోలు’’ మరియు కొవిడ్-19 రోగులకు అందుబాటులో ఉన్న పడకల కొరతపై పలు-నగరాల్లో వాస్తవ స్థితులను బహిర్గతం చేసిన కార్యక్రమానికి ‘‘బెస్ట్ న్యూస్ కవరేజ్ (నేషనల్)’’ అవార్డు దక్కించుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చి తప్పిపోయిన ఆస్టిక్ టీనేజర్ కథనం ‘‘లెట్స్ ఫైండ్ తరుణ్’’కు ‘‘బెస్ట్ కవరేజ్ ఆన్ సోషల్ ఇష్యూస్’’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ షో ఆటిజం గురించి అవగాహన పెంచడంతో పాటు తప్పిపోయిన యువకుడిని కనుగొనే ప్రయత్నాలను విస్తరించేందుకు మద్దతు అందించింది.
మిర్రర్ నౌ సంపాదకీయ బృందం తమ అద్భుతమైన రచనలకు ఇఎన్బిఎ నుంచి ప్రశంసలు అందుకుంది. వలస సంక్షోభంపై వెలుగులు నింపేందుకు చేసిన కృషికి శాంటియా గోరాకు ‘‘బెస్ట్ కంటిన్యూయింగ్ కవరేజ్ బై ఏ రిపోర్టర్’’ పురస్కారాన్ని దక్కించుకుంది మరియు సాంగ్లీ వరదలను కవరేజ్‌కు చేసిన కృషికి నితిన్ ఫడ్టారేకు ‘‘ఉత్తమ వీడియోగ్రాఫర్’’గా పురస్కరాన్ని దక్కించుకున్నారు. హాస్పిటల్ బెడ్ దుర్వినియోగం మరియు బీహార్ ఎన్నికల కవరేజ్‌కు ఆయుష్మాన్ కుమార్ ‘‘యంగ్ ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్’’గా ఎంపికయ్యాడు మరియు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో తుపాకీ పట్టుకుని హల్చల్ చేసిన వ్యక్తికి సంబంధించిన కథనాన్ని కవర్ చేసిన అలోక్ కుమార్ ‘‘బెస్ట్ రిపోర్టింగ్’’ పురస్కారాన్ని పొందారు.