Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలకాట్రనిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధారిత ద్వి బాషా వాషింగ్ మెషీన్‌ను హిందీ మరియు ఆంగ్ల బాషా ఇంటర్ఫేస్తో అందిస్తుంది. ఈ నూతన శ్రేణి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లును భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి డిజిటల్ ఇండియాకు శక్తినందించాలనే శాంసంగ్ యొక్క నూతన లక్ష్యంలో భాగంగా ఉంటాయి. ఇది శాంసంగ్ యొక్క ప్రొప్రైయిటరీ ఎకో బబుల్ మరియు క్విక్ డ్రైవ్ టెక్నాలజీతో ఉండటంతో పాటుగా సమయం ఆదా చేయడంలో మరియు విద్యుత్ పొదుపు చేయడంలోనూ తోడ్పడుతూనే 45% అదనంగా ఫ్యాబ్రిక్ కేర్నూ అందిస్తుంది.
అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్లీనింగ్ మరియు పరిశుభ్రతకు భరోసా అందిస్తూ, ఈ నూతన మోడల్స్ అన్నీ కూడా హైజీన్ స్టీమ్ టెక్నాలజీతో వస్తున్నాయి. లోతైన మురికిని సైతం పొగొట్టడంతో పాటుగా 99.9% బ్యాక్టీరియా మరియు అలెర్జీన్స్ను సైతం తొలగిస్తుంది. ఈ తాజా వాషింగ్ మెషీన్ శ్రేణిలో 21 నూతన మోడల్స్ ఉన్నాయి. ఇవి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ ) ఫీచర్ కలిగి ఉండటంతో పాటుగా ఇవి వినియోగదారులకు అనుకూలీకరించిన లాండ్రీ ప్రక్రియను కూడా అందిస్తుంది. లాండ్రీ అలవాట్లను ఏఐ అభ్యసించడంతో పాటుగా గుర్తుంచుకుంటూనే ఎక్కువగా వినియోగించే వాష్ సైకిల్‌నూ వెల్లడిస్తుంది. ఈ స్మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత వాషింగ్ మెషీన్ శ్రేణిని శాంసంగ్ స్మార్ట్ఉపకరణాలు అయినటువంటి గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, శాంసంగ్ స్మార్ట్ టీవీలు మరియు ఫ్యామిలీ హబ్ రిఫ్రిజిరేటర్లతో పాటుగా వాయిస్ ఉపకరణాలు అయినటువంటి అలెక్సా,గుగూల్ హోమ్‌తో సైతం అనుసంధానించి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేని కనెక్టడ్ లివింగ్ అనుభవాలను అందిస్తుంది.
ఈ నూతన శాంసంగ్ వాషింగ్ మెషీన్ శ్రేణి సరికొత్త నూతన నూతన డిజైన్‌తో వస్తుంది. ఇది కనిష్టంగా ఉంటూనే పూర్తిగా వినియోగదారులకు అనుకూలంగా ఉంటూ అతి సరళమైన జాగ్ డయల్ కంట్రోల్‌తో పలుచటి డిజిటల్ ఇంటర్ఫేజ్ కలిగి ఉంది. లాండ్రీ అనుభవాలను మరింత ప్రభావవంతంగా మరియు సరళంగా మార్చేందుకు లాండ్రీ ప్లానర్ దీనిలో ఉంది. ఇది వినియోగదారులు తమ లాండ్రీ ముగింపు సమయం షెడ్యూల్ చేసుకునే అవకాశం అందిస్తుంది. అదే రీతిలో లాండ్రీ రెసిపీ, వినియోగదారులకు ఆటోమేటిక్ రికమెండేషన్స్‌ను గరిష్ట వాష్ సైకిల్స్ కోసం అందిస్తుంది. రంగు, ఫ్యాబ్రిక్ తరహా మరియు వినియోగదారులు అందించిన రీతిలో సాయిలింగ్ వంటి సమాచారం అందించడంతో పాటుగా ఏ వాష్ సైకిల్ అత్యుత్తమం అని ఆలోచించాల్సిన ఆవశ్యకతను తగ్గిస్తుంది. అదనంగా, హోమ్ కేర్ విజార్డ్ చురుగ్గా వినియోగదారులకు సంభావ్య సమస్యలు గురించి ఆప్రమప్తం చేయడంతో పాటుగా వేగంగా ట్రబుల్ షూటింగ్ అందించడమూ చేస్తుంది.
‘‘మహమ్మారి సమయంలో వినియోగదారులకు సౌకర్యం అందించడం అత్యుత్తమ ప్రాధాన్యతాంశం అయింది. స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్ జీవితాలను సరళీకృతం చేశాయి. మా నూతన ఏఐ ఆధారిత వాషింగ్ మెషీన్ శ్రేణి విప్లవాత్మక ఆవిష్కరణగా హిందీ మరియు ఆంగ్ల బాష యూజర్ ఇంటర్ఫేస్గా నిలువడంతో పాటుగా మెషీన్ లెర్నింగ్ వినియోగించే వినియోగదారులకు సరళమైన, తెలివైన, వ్యక్తిగతీకరించిన లాండ్రీ పరిష్కారాలను అందించేలా డిజైన్ చేశారు. దీనిని భారతదేశం కోసం 2వేలకు పైగా వాష్ కాంబినేషన్స్‌తో అనుకూలీకరించారు. అంతేకాదు 2.8 మిలియన్ బిగ్ డాటా ఎనాలిసిస్ పాయింట్లను విభిన్న రకాల ఫ్యాబ్రిక్స్ కోసం అందిస్తుంది. దీనిని స్మార్ట్‌ఫోన్ లేదా శాంసంగ్ కనెక్టడ్ ఉపకరణంతో దీనిని నియంత్రించవచ్చు. ఈ శ్రేణి ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్వాషింగ్ మెషీన్ విభాగాన్ని విప్లవాత్మీకరించడంతో పాటుగా గత సంవత్సరకాలంలో దీనిని ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ విభాగంలో నెంబర్ 1 ప్లేయర్‌గా నిలువగలమని ఆశిస్తున్నాము’’ అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు. మొత్తం శ్రేణి వాషర్లు 5స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తున్నాయి. బీఈఈ దీనిని ధృవీకరించింది. మా డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఈ వాషింగ్ మెషీన్లు అతి తక్కువ విద్యుత్ వినియోగించుకుంటాయని భరోసా అందించడంతో పాటుగా అతి తక్కువ శబ్దాన్ని చేస్తాయనే వాగ్ధానమూ చేశాయి. ఈ నూతన మోడల్స్ శాంసంగ్ యొక్క ప్రొప్రైయిటరీ ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తున్నాయి. దీనివల్ల వస్త్రాలలో వేగంగా వ్యాప్తి చెందడంతో పాటుగా మురికిని అతి సులభంగా తొలగించి 45% అదనపు ఫ్యాబ్రిక్ కేర్‌ను సైతం అందిస్తుంది.
క్విక్ డ్రైవ్ టెక్నాలజీ, వినియోగదారులు వాషింగ్ సమయాన్ని 50% వరకూ తగ్గించే అవకాశాన్ని వాషింగ్ సైకిల్ పరంగా ఎలాంటి రాజీపడకుండా అందిస్తుంది. ఆటో డిస్పెన్స్ టెక్నాలజీ స్వయం చాలకంగా తగిన మొత్తంలో డిటర్జెంట్, సాఫ్ట్‌నర్‌ను ప్రతి లోడ్‌తోనూ విడుదల చేస్తుంది. అంతేకాదు, ఇద ఒక నెల రోజుల కాలానికి వాషింగ్‌కు సరిపడా డిటర్జెంట్‌ను సైతం ఇది నిల్వ చేసుకోగలదు. అదనంగా, వినూత్నమైన బబ్లింగ్ అల్గారిథమ్ అయిన క్యు–బబల్ వేగవంతమైన వాష్ సైకిల్ కోసం మెరుగైన డిటర్జెంట్ యాక్షన్‌ను అందిస్తూ 50% వరకూ సమయాన్ని ఆదా చేస్తుంది.
ధర మరియు లభ్యత
ఈ నూతన ఏఐ ఆధారిత లాండ్రీ లైనప్ ఏప్రిల్ 6,2021 వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా రిటైల్ భాగస్వాములందరి వద్ద 35,400 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తుంది. ఎంపిక చేసిన మోడల్స్ ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ వద్ద లభిస్తాయి. నూతన వాషింగ్ మెషీన్ శ్రేణిని కొనుగోలు చేసే వినియోగదారులు 20% వరకూ క్యాష్‌బ్యాక్‌ను పొందడంతో పాటుగా అతి సులభమైన ఫైనాన్సింగ్ అవకాశాలైనటువంటి నో కాస్ట్ ఈఎంఐ, అతి తక్కువగా 990 రూపాయలతో ఈఎంఐ ప్రారంభం వంటి అవకాశాలనూ పొందవచ్చు.
శాంసంగ్ యొక్క నూతన ఏఐ శక్తితో కూడిన వాషింగ్ మెషీన్స్ ఫీచర్లు
ఏఐ కంట్రోల్
అత్యాధునిక లాండ్రీ పరిష్కారాలను సృష్టించుకోవడం ద్వారా శాంసంగ్ స్థిరంగా ఆవిష్కరణలను కొనసాగిస్తూనే ఉంది. ఇవి సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా ఇంటిలిజెంట్ ఏఐ టెక్నాలజీని సైతం కలిగి ఉన్నాయి. తద్వారా కనెక్టడ్ మరియు క్లిష్టత లేని లాండ్రీ అనుభవాలనూ అందిస్తుంది. ఈ ఏఐ కంట్రోల్స్ స్మార్ట్ సొల్యూషన్స్ అయినటువంటి లాండ్రీ రెసిపీ, లాండ్రీ ప్లానింగ్, హోమ్ కేర్ విజార్డ్, లోకేషన్ ఆధారిత సూచనలు సైతం అందించడం ద్వారా లాండ్రీని మరింత సులభంగా, ప్రభావవంతంగా అందిస్తుంది.
ఏఐ ప్యాటర్న్ మీ లాండ్రీ అలవాట్లను అభ్యసించడంతో పాటుగా గుర్తుంచుకుంటుంది. దీనితో పాటుగా అత్యుత్తమంగా తగిన లాండ్రీ సైకిల్స్‌ను సైతం సూచిస్తుంది. ఈ సైకిల్స్ వ్యక్తిగతీకరించబడినవనే భరోసా అందించడంతో పాటుగా మీ అవసరాలు, జీవనశైలికి తగినట్లుగా ఉంటూనే అత్యుత్తమ లాండ్రీ అనుభవాలను అందిస్తుందనే భరోసానూ అందిస్తుంది. అంతేకాదు సర్వీస్ సెంటర్‌కు కాల్ చేయాల్సిన అవసరం లేకుండానే లేదంటే మాన్యువల్‌ను తిరగేయాల్సిన అవసరం లేకుండానే ఇది లోపాలను సవరించుకుంటుంది. అంతేకాదు, ఆటో సైకిల్ లింక్ డ్రైయర్‌తో కమ్యూనికేట్ చేయడంతో పాటుగా ఖచ్చితమైన డ్రైయింగ్ కోర్సును సైతం ఎంపిక చేసుకునే అవకాశం అందిస్తుంది.
ఎకో బబుల్
శాంసంగ్ ఎకో బబుల్ టెక్నాలజీ, బబుల్ జనరేటర్‌ను వినియోగించుకోవడంతో పాటుగా నీటిలో డిటర్జెంట్ కరిగేలా ఆ తరువాత దానిలో గాలి నింపేలా చేస్తుంది. తద్వారా సోపీ ఫోమ్ కుషన్ సృష్టిస్తుంది. ఇది 40 రెట్లు వేగంగా లోపలకు చొచ్చుకుపోతుంది. మృదువైన బబుల్ యాక్షన్ సున్నితమైన వస్త్రాలు అయినటువంటి ఔట్‌డోర్ వేర్, వాటర్ రిపెల్లంట్ ఫ్యాబ్రిక్స్‌ను రక్షిస్తుంది. ఎకో బబుల్ సాంకేతికత,డిటర్జెంట్ పూర్తిగా నీటిలో కరుగుతుందనే భరోసా అందించడంతో పాటుగా వస్త్రాలలో వేగంగా చొచ్చుకుపోతుందనే భరోసానూ అందిస్తుంది. సూపర్ ఎకో వాష్ ప్రోగ్రామ్, కేవలం 15డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వాష్ ఫలితాలను అందిస్తుంది. తద్వారా 30% విద్యుత్‌ను ఆదా చేస్తుంది.
క్విక్ డ్రైవ్
పూర్తిగా నూతన స్థాయి వాషింగ్ పనితీరు అందించడం కోసం ప్రత్యేకంగా క్విక్ డ్రైవ్‌ను డిజైన్ చేశారు. ఈ సాంకేతికత వేగంగా లాండ్రీ సైకిల్స్ పూర్తి కావడంలో సహాయపడటంతో పాటుగా ఈ ప్రక్రియను మరింత సులభంగా, విద్యుత్ ఆదా చేసే రీతిలో చేస్తుంది. సృజనాత్మక ఫ్యాబ్రిక్ కేర్ డ్రమ్‌లో పల్సేటర్ ఉంది. ఇది వినూత్నమైన డైనమిక యాక్షన్‌ను మీ వస్త్రాలు వేగంగా, సమర్థవంతంగా ప్రతిసారీ ఉతికేలా అందిస్తుంది. ఇప్పుడు మీరు వస్త్రాలను ఉతకడంలో అతి తక్కువ సమయాన్ని , వాటిని ధరించడంలో అధిక సమయాన్ని గడపవచ్చు. ఉదాహరణకు, 5కేజీ లోడ్‌తో సూపర్ స్పీడ్ సైకిల్ వినియోగించడం ద్వారా క్విక్ డ్రైవ్ టెక్నాలజీ తో కేవలం 39 నిమిషాలలోనే పూర్తి స్ధాయిలో శుభ్రతను అందుకోవచ్చు.
ఆటోడిస్పెన్స్
అతి తక్కువ సమయం మరియు ప్రయత్నంతో మీరు వస్త్రాలను పూర్తిగా ఉతికేందుకు ఆటో డిస్పెన్స్ సాంకేతికత తోడ్పడుతుంది. ఇది స్వయంచాలకంగా తగిన మొత్తంలో డిటర్జెంట్, సాఫ్ట్‌నర్‌ను ప్రతి లోడ్లోనూ విడుదల చేస్తుంది. దీనిద్వారా 26% డిటర్జెంట్ మరియు 46% సాఫ్ట్నర్ ఆదా అవుతుంది. అతి సులభంగా నింపతగిన డిటాచబల్ ట్యాంక్‌తో ఒక నెలకు సరిపడా డిటర్జెంట్‌ను లోడ్ చేయవచ్చు.
యాడ్ వాష్
యాడ్ వాష్ తో వినియోగదారులు అదనపు వస్తువులు లేదంటే డిటర్జెంట్‌ను వాష్ సైకిల్ ప్రారంభ మైన తరువాత జోడించవచ్చు. తాము మరిచిపోయిన వస్తువులను జోడించుకోవడంతో పాటుగా అదనపు సాఫ్ట్నర్ సైతం జోడించడం మరియు కేవలం వస్త్రాలను నీటిలో ముంచి ఆరేయడం కోసం మాత్రమే ఈ సైకిల్లో జోడించవచ్చు.
హైజీన్ స్టీమ్
హైజీన్ స్టీమ్ తో వస్త్రాలు మరింత శుభ్రమవుతాయి. దీనిలో డ్రమ్ అడుగు నుంచి ఆవిరి విడుదల అవుతుంది. దీనిద్వారా వస్త్రాలు పూర్తిగా శుభ్రమవుతాయి. హైజీన్ స్టీమ్ తో మురికి పూర్తిగా వదలడంతో పాటుగా 99.9% బ్యాక్టీరియా మరియు అలర్జీన్లు సైతం తొలగించబడతాయి. హైజీన్ స్టీమ్సైకిల్లో ముందుగా నీరు, మురికి, డిటర్జెంట్ బయటకు పోతుంది. ఆ తరువాత, కొద్ది మొత్తంలో నీటిని తీసుకుని దానిని ఆవిరిగా మారుస్తుంది. ఆ తరువాత లోపల ఉన్నటువంటి హీటర్ 20 నిమిషాల పాటు నీటిని వేడి చేస్తుంది. ఈ స్టీమ్ దశ తరువాత, ఇది నీటిని బయటకు వదలడంతో పాటుగా గుంజడం చేసి, చివరగా తరువాత దశ వాషింగ్ ప్రాసెస్‌కు పంపి, ఈ వాష్ సైకిల్ పూర్తి చేస్తుంది.
డిజిటల్ ఇన్వర్టర్ సాంకేతికత
డిజిటల్ ఇన్వర్టర్ సాంకేతికత (డీఐటీ) శక్తివంతమైన అయస్కాంతాలను నిశ్శబ్ద మరియు మరింత శక్తివంతమైన పనితీరు కోసం వినియోగించుకుంటుంది. ఇది యూనివర్శిల్ మోటార్ విత్ బ్రష్‌తో పోలిస్తే అతి తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఇది బయట వినియోగించేలా బ్రష్‌లను వాడదు మరియు అత్యున్నత నాణ్యత కలిగిన విడిభాగాలను మరియు అసాధారణ మెకానికల్ ఇంజినీరింగ్ సైతం కలిగి ఉంటుంది. ఇది 10 సంవత్సరాల వారెంటీ కలిగి ఉండటంతో పాటుగా మీ వాషింగ్ మెషీన్‌కు జీవితాంతం గ్యారెంటీ అందిస్తుంది.
డ్రమ్ క్లీన్/డ్రమ్ క్లీన్ +
డ్రమ్ క్లీన్ తో ఎలాంటి రసాయనాలనూ వినియోగించాల్సిన అవసరం లేకుండా మీ వాషర్ లో మురికి, బ్యాక్టీరియా తొలగించబడతాయనే భరోసా ఉంటుంది. ఇది 99.9% బ్యాక్టీరియాను వాషర్ లోపల నుంచి తొలగించడంతో పాటుగా రబ్బర్ గాస్కట్ నుంచి సైతం మురికి తొలగిస్తుందనే భరోసా అందిస్తుంది. డ్రమ్క్లీన్+ సైకిల్ ఇంటర్‌టెక్ పరీక్షల ఆధారం. ఈ వాషింగ్ మెషీన్ స్వయం చాలకంగా యూజర్లకు క్లీనింగ్ అవసరమైన వేళ తెలుపుతుంది.
స్టే క్లీన్ డ్రాయర్
ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాటర్ ఫ్లషింగ్ వ్యవస్ధతో అధిక శాతం డిటర్జెంట్ పూర్తిగా తొలగిపోతుందనే భరోసాను స్టే క్లీన్ డ్రాయర్ అందిస్తుంది. అందువల్ల మిగిలిన డిటర్జెట్ లేదా సాఫ్ట్నర్ పూర్తిగా వినియోగించబడుతుందనే భరోసా కలుగడంతోపాటుగా ట్రై మరింత స్వచ్ఛంగా మరియు పరిశుభ్రంగా ఉంటుందనే భరోసానూ అందిస్తుంది.
బబుల్ సోక్
ఒక్క టచ్‌తో విభిన్న రకాల మరకలు ప్రభావవంతంగా, అతి సులభంగా తొలగించడంలో బబుల్ సోక్ సహాయపడుతుంది. ఈ యాక్టివ్ బబుల్ ఫంక్షన్ , విస్తృత స్ధాయిలో కఠినమైన మరకలు అయినటువంటి రక్తం, టీ, వైన్, మేకప్ మరియు గడ్డి మరకలను సైతం తొలగిస్తుంది.