Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐఫోన్ ఉపకరణాలు మరియు మాక్ కంప్యూటర్లతో సహా తమ అనుకూల ఉపకరణాలపై కంటెంట్‌ను పంచుకోవడానికి ఆకర్షణీయమైన మరియు ఆధారపడతగిన పరిష్కారాల కోసం వెదుకుతున్న వినియోగదారుల కోసం వెస్ట్రన్ డిజిటల్ (నాస్డాక్ డబ్ల్యుడీసీ) నేడు తమ కంపెనీ యొక్క మొట్టమొదటి ఫ్లాష్ డ్రైవ్ శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్‌డ్రైవ్ లక్స్ ను డ్యూయల్ లైటెనింగ్ మరియు యుఎస్బీ టైప్ సీ కనెక్టర్స్తో ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. లైటెనింగ్ మరియు యుఎస్బీ టైప్–సీ కనెక్టర్లుతో పూర్తి మెటల్ కేసింగ్ కలిగిన శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ ఇప్పుడు వినియోగదారులకు ఐఫోన్, ఐపాడ్ ప్రో, మాక్ మరియు ఇతర యుఎస్బీ టైప్ సీ ఉపకరణాలు, ఆండ్రాయిడ్ ఫోన్ల నడుమ ఫైల్స్‌ను ఎలాంటి అసౌకర్యమూ లేకుండా బదిలీ చేసేందుకు అనుమతిస్తుంది.
నూతన శాన్ డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్‌తో విభిన్నమైన కనెక్టర్లు కలిగిన ఉపకరణాల నడుమ వేగంగా ఫైల్స్‌ను బదిలీ చేయడంలోని సమస్యను వెస్ట్రన్ డిజిటల్ పరిష్కరిస్తుంది. ఈ నూతన ఫ్లాష్ డ్రైవ్ రెండు కనెక్టర్లుతో వస్తుంది. ఇది వేగంగా ఫైల్స్‌ను బదిలీ చేయడంలో తోడ్పడటంతో పాటుగా కంటెంట్‌ను ఓ ఉపకరణం నుంచి మరో ఉపకరణానికి ఈమెయిల్ లేదంటే అప్లోడ్ లేదంటే సేవ్ చేయవలసిన ఆవశ్యకతనూ తప్పిస్తుంది. ఒకసారి ఫైల్స్ డ్రైవ్‌లోకి బదిలీ అయితే,వాటిని హై స్పీడ్ యుఎస్బీ 3.0 కనెక్టర్ వినియోగించి యుస్బీ టైప్ సీ కంపాటిబల్ కంప్యూటర్‌కు బదిలీ చేయవచ్చు. తమ డాటాను పూర్తి గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులు తమ ఫైల్స్ మరియు ఫోటోలను ఐఎక్స్‌పాండ్ డ్రైవ్ యాప్‌తో పాస్వర్డ్ భద్రత కల్పించవచ్చు. ఈ యాప్‌ను ఐఫోన్లో స్పేస్‌ను ఖాళీ చేసేందుకు వినియోగించవచ్చు లేదంటే ఆటోమేటిక్‌గా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు మరియు కాంటాక్ట్స్‌ను బ్యాకప్ చేసుకునేందుకు వినియోగించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ అతి నెమ్మదిగా ఉందనే సమస్య కూడా దీనికి లేదు. ఈ డ్రైవ్ ఇప్పుడు 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ పరిమాణాలలో లభ్యం కావడం ద్వారా ఫోటోలు, వీడియోలు, గేమ్స్ కోసం మరింత స్పేస్‌ను అందిస్తుంది.
శ్రీ ఖాలిద్ వణి, సేల్స్ డైరెక్టర్, ఇండియా, వెస్ట్రన్ డిజిటల్ మాట్లాడుతూ ‘‘ వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ గాడ్జెట్ స్వీకరణతో , సాధారణ నూతన తరపు భారతీయుడు ఒకటి కన్నా ఎక్కువ ఉపకరణాలను వినియోగిస్తున్నాడు. వారు విభిన్నమైన ఉపకరణాలపై ఐఫోన్ నుంచి కంటెంట్‌ను బదిలీ చేసుకోవడంతో పాటుగా ఎలాంటి క్లిష్టత లేని విధానంలో దానిని వీక్షించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్‌ను పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. విభిన్నమైన గాడ్జెట్స్ నడుమ డాటా మరింత సౌకర్యవంతంగా పొందేందుకు ఏకీకృత పరిష్కారంగా ఇది నిలుస్తుంది. అందువల్ల వినియోగదారులు కనెక్టివిటీ లేదంటే నిల్వ ప్రదేశం లేదని బాధపడాల్సిన అవసరం లేదు మరియు తమ డిజిటల్ జీవితాన్ని సంపూర్ణంగా జీవించవచ్చు’’ అని అన్నారు.
ఈ ఆవిష్కరణ గురించి శ్రీ జగన్నాథన్ చెల్లియ్య, డైరెక్టర్– మార్కెటింగ్, ఇండియా, వెస్ట్రన్ డిజిటల్ మాట్లాడుతూ ‘‘ నేడు వినియోగదారులు అధికంగా ప్రయాణాలలోనే గడుపుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పనిచేయడం, ప్రయాణాలు, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశంకు వెళ్లడం తో పాటుగా తమ ఐ ఫోన్లలో కంటెంట్ సృష్టించుకుని దానిని విభిన్నమైన ఉపకరణాలపైకి ఎడిటింగ్,షేరింగ్, బ్యాకప్ కోసం బదిలీ చేయాలనుకుంటున్నారు. డాటా బదిలీ మరియు నిల్వ అనేవి వారు బాధపడేందుకు చివరి అంశాలుగా ఉంటున్నాయి. ఇక్కడే వినియోగదారులకు సేవలనందించడానికి శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ తోడ్పాటునందించడానికి ముందుకు వచ్చింది.మీ ఐఫోన్ మరియు ఇతర ఉపకరణాల వ్యాప్తంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా పనిచేసేందుకు ఇది తోడ్పడుతుంది. శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు విశ్వసించే ఆధారపడతగిన బ్రాండ్‌గా నిలువనుంది’’ అని అన్నారు.
ముఖ్య ఆకర్షణలు
· అనుకూలమైన ఉపకరణాలు , ఐఫోన్, ఐ పాడ్ ప్రో, మాక్ తో పాటుగా యుఎస్బీ టైప్ సీ ఉపకరణాలు, ఆండ్రాయిడ్ ఫోన్ల1 నడుమ కంటెంట్‌ను సౌకర్యవంతంగా బదిలీ చేయవచ్చు
· ద్వంద్వ లైటెనింగ్మరియు యుఎస్బీ టైప్ సీ కనెక్టర్లతో పూర్తి మెటల్ కేసింగ్ ఫ్లాష్ డ్రైవ్
· ఐఫోన్ ఉపకరణాలపై అతి సులభంగా స్పేస్‌ను ఫ్రీ చేసుకోవచ్చు అందువల్ల మీరు కంటెంట్‌ను సృష్టించుకుంటూనే ఉండవచ్చు1
· ఐఫోన్ ఫోటోలు, వీడియోలు మరెన్నో స్వయంచాలకంగా బ్యాకప్ చేసుకోవచ్చు2
· ఐఫోన్, పీసీ మరియు మాక్ ఉపకరణాల నడుమ మీ ఫైల్స్కుపాస్వర్డ్తో రక్షణ కల్పించవచ్చు1,3
· ఆకర్షణీయమైన ద్వంద్వ ప్రయోజనాలు కలిగిన స్వివెల్ డిజైన్ కనెక్టర్లను కాపాడటంతో పాటుగా ప్రయాణ సమయాల్లో సైతం సౌకర్యవంతంగా తీసుకువెళ్లేందుకు కీరింగ్ హోల్ కలిగి ఉంటుంది.
ధర మరియు లభ్యత
నూతన శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ తో పాటుగా 2 సంవత్సరాల పరిమిత కాలపు వారెంటీ వస్తుంది. ఇది వెస్ట్రన్ డిజిటల్ స్టోర్,అమెజాన్ మరియు ఇతర ఎంపిక చేసిన రిటైలర్ల వద్ద లభ్యమవుతుంది. శాన్డిస్క్ ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ 64జీబీ రకం 4449 రూపాయలకు, 128 జీబీ రకం 5919 రూపాయలకు, 256 జీబీ రకం 8999 రూపాయలకు లభ్యమవుతుంది. ఐఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్ లక్స్ ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా వద్ద లభ్యమవుతుంది.
శాన్డిస్క్ నుంచి తాజా సమాచారం పొందేందుకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్‌పై అనుసరించవచ్చు.
1జీబీ = 1,000,000,000 బైట్స్. వాస్తవ యూజర్ నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
1ఐఫోన్, ఐపాడ్ ప్రో మరియు ఐపోడ్ కంపాటబిలిటీ కోసం http://www.sandisk.com/support/ixpandcompatibility చూడవచ్చు. ఆండ్రాయిడ్ ఉపకరణాలకు యుస్బీ టైప్ సీ పోర్ట్ మరియు ఆన్ ద గో (ఓటీజీ) మద్దతు అవసరం. ఈ కంపాటబల్ ఉపకరణాల జాబితా కోసం www.sandisk.com/dualdrive-c చూడవచ్చు.
2 ఐఎక్స్‌పాండ్ డ్రైవ్ యాప్ అవసరం (ఆండ్రాయిడ్ డివైజెస్ మినహాయించి). యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి లభ్యం. ఐఓఎస్ 10.0.2 లేదా అంతకు మించి అవసరం. యాప్ సెట్టింగ్స్‌లోనే ఆటోమేటిక్ బ్యాకప్‌ను సెట్ చేసుకోవచ్చు. షరతులు వర్తిస్తాయి.
3 పాస్వర్డ్ ప్రొటెక్షన్‌కు ఐఓఎస్ 10.0.2 మరియుఅంతకు మించిన, మాక్ ఓఎస్ 10.9 మరియు అంతకు మించిన, విండోస్ 7, విండోస్ 8 మరియువిండోస్ 10 మద్దతు అందిస్తాయి.