Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటీవలనే సుప్రీంకోర్టు క్రిప్టో కరెన్సీ వాణిజ్యంపై నిషేదం ఎత్తి వేయడం అనుసరించి కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు ఈ నూతన తరపు డిజిటల్ అద్భుతం పట్ల సానుకూల ప్రకటన చేయడంతో భారతదేశపు తరువాత దశ డిజిటల్ నాయకత్వానికి ఇది శుభసూచకంగా నిలిచే అవకాశాలున్నాయి. నూతన తరపు ఫిన్‌టెక్ సేవలు, బిట్‌కాయిన్ మైనింగ్, క్రిప్టో కరెన్సీ వాణిజ్యంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి అపార అవకాశాలున్నాయి అని బింగ్బాన్ –చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, డాలీ యంగ్ అన్నారు. సింగపూర్ కేంద్రంగా కలిగిన బింగ్బాన్, కేవలం డిజిటల్ ఎస్సెట్స్‌ను కవర్ చేయడం మాత్రమే కాకుండా ఫారెక్స్, ఇండిసిస్, కమోడిటీలాంటి ఇతర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్నూ కవర్ చేస్తుంది. భారతదేశంలో తాజా పరిణామాలను గురించి డాలీ యంగ్ మాట్లాడుతూ భవిష్యత్ దిశగా దేశం చూడటంతో పాటుగా రేపటి తరపు డిజిటల్ సాంకేతికతలలో ప్రయోజనాలను పొందటానికి తమ మూలాలను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. ఆయనే మాట్లాడుతూ ఇప్పటికే ఇండియా సృజనాత్మక భావి తరపు బ్లాక్ చైన్, డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీస్‌ను అభివృద్ధి చేసింది. దీనితో పాటుగా ఇక్కడ ఉన్న అద్భుతమైన ప్రతిభ కారణంగా ఈ రంగంలో అంతర్జాతీయంగా నాయకత్వ స్థాఽనంలో నిలిచే అవకాశాలున్నాయి అని అన్నారు.
శక్తివంతమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఉందన్న శ్రీ డాలీ యంగ్, విశ్వసనీయ క్రిప్టో ఎక్సేంజ్‌లు ప్రభావవంతంగా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటుగా క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా వ్యాపారాలను నిర్వహించాలన్న ఆసక్తి కలిగి ప్రజలకు సురక్షితమైన వేదికలనూ అందిస్తుంది అని అన్నారు. విస్తృతస్థాయి క్రిప్టో పర్యావరణ వ్యవస్థతో ఆర్ధిక, లావాదేవీల నిర్వహణ ఖర్చును తగ్గించడంతో పాటుగా వేగవంతంగా డిజిటల్ స్వీకరణకు సహాయపడుతూనే నూతన ఉపాధి అవకాశాలనూ సృష్టించడంలో తోడ్పడుతుంది.