Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచంలో సేవలు లభించని జనాభాలో కంటి ఆరోగ్య సంరక్షణని పొందడానికి శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ పాత స్మార్ట్ ఫోన్స్ ని పునః సమర్పించింది. ఇంక ఏ మాత్రం ఉపయోగించబడని అప్ సైక్లింగ్ గాలక్సీ స్మార్ట్ ఫోన్లు ద్వారా కంటి వ్యాధుల్ని పరీక్షించే వైద్య పరికరాలుగా తయారు చేయడానికి కొరియాలో ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్ నెస్ (ఐఏపీబీ) మరియు యోన్ సీ యూనివర్శిటీ హెల్త్ సిస్టం (వైయూహెచ్ఎస్) కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీతో శామ్ సంగ్ భాగస్వామం చెందింది. ఈ గాలక్సీ అప్ సైక్లింగ్ కార్యక్రమం సక్రమమైన వ్యాధి నిర్థారణతో నివారించగలిగే దృష్టి లోపం గల సుమారు 1 బిలియన్ అంతర్జాతీయ కేసుల్ని పరిష్కరించడంలో సహాయపడుతోంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, కనీసం 2.2 బిలియన్ ప్రజలకు ఒక రకమైన దృష్టి లోపం ఉంది మరియు ఈ కేసులలో దాదాపు సగం కేసులు నివారించబడినవి లేదా ఇంకా పరిష్కరించబడలేదు. కంటి సంరక్షణ సేవల లభ్యత మరియు ఖర్చు భరించగలడం పై ఆధారపడి దృష్టి లోపం ప్రాబల్యంలో పెద్ద తేడా ఉంది. ఇది ఎక్కువ ఆదాయం గల ప్రాంతాలతో పోల్చినప్పుడు అల్ప మరియ మధ్యస్థమైన ఆదాయం గల ప్రాంతాల్లో నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లుగా అంచనా వేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణని పొందడానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. మరింత సుస్థిరమైన పద్ధతుల్ని ప్రోత్సహించి మరియు మన సమాజాల్లో అనుకూలమైన ప్రభావాన్ని చూపించడానికి పునః ఉపయోగించే తెలివైన, నవీన పరిష్కారాల్ని రూపొందించే అవకాశాన్ని మేము చూసాము అని శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ లో సస్టైనబిలిటి మేనేజ్మెంట్ కార్యాలయం, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ వీపీ సుంగ్-కూ కిమ్ అన్నారు. "ఈ కార్యక్రమం టెక్నాలజీ ప్రజల జీవితాల్ని సుసంపన్నం చేస్తుంది మరియు మన అందరికీ మరింత సమానమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తుని రూపొందించడంలో సహాయపడటానికి శామ్ సంగ్ వారి నమ్మకాన్ని మూర్తిభవిస్తుందని చెప్పారు."
గాలక్సీ డివైజ్ లు అనుకూలమైన ప్రభావాన్ని చూపించే కొత్త విధానాల్ని పరిచయం చేయడానికి 2017లో, శామ్ సంగ్ గాలక్సీ అప్ సైక్లింగ్ కార్యక్రమాన్ని తయారు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా, పాత గాలక్సీ స్మార్ట్ పోన్ EYELIKE™ హ్యాండ్ హెల్త్ ఫండస్ కెమేరా యొక్క కేంద్రంగా మారింది, ఇది పెంపొందించబడిన ఫండస్ నిర్థారణ కోసం లెన్స్ కి జోడించబడుతుంది, స్మార్ట్ ఫోన్ చిత్రాల్ని తీయడానికి ఉపయోగించబడుతుంది. గాలక్సీ డివైజ్ కంటి వ్యాధులు విశ్లేషించి మరియు చిత్రాల్ని నిర్థారించడానికి మరియు రోడి డేటాని ఖచ్చితంగా కాప్చర్ చేసే యాప్ కి కనక్ట్ చేయబడే మరియు వాణిజ్య సాధనాల ఖర్చు కంటే చాలా తక్కువ ఉండే చికిత్సా నియమావళిని సూచించే కృత్రిమ మేధస్తు అల్ గోరిథమ్ ని వినియోగిస్తుంది. విలక్షణమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన డయోగ్నిసిస్ కెమేరా డయాబిటిక్ రెటినోపతి, గ్లకోమా మరియు వయస్సుకి సంబంధించి కంటి మచ్చ క్షీణతతో సహా అంధత్వానికి దారితీసే పరిస్థితులు గల రోగుల్ని పరీక్షిస్తుంది.
"సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు చేరుకునే తక్కువ ఖర్చుతో కూడిన కంటి ఆరోగ్యం వ్యాధి నిర్థారణ కోసం మేము అన్వేషిస్తున్నాం మరియు శామ్ సంగ్ గాలక్సీ స్మార్ట్ ఫోన్స్ పనితీరుని మేము చూసినప్పుడు, వారి అప్ సైక్లింగ్ ప్రయత్నాల్ని మా పరిశోధనలో విలీనం చేయాలని భావించాము” అని యోన్ సీ యూనివర్శిటీ హెల్త్ సిస్టంకి చెందిన డాక్టర్ సంగ్ చుల్ యూన్ అన్నారు. "గాలక్సీ స్మార్ట్ ఫోన్ యొక్క కెమేరా పనితీరుతో కలిసి బహుళ ఆప్టికల్ టెక్నాలజీలు మరియు కృత్రిమ మేథస్సుని ఉపయోగించే కలయిక, వైద్య ప్రొఫెషనల్స్ ఉపయోగించే ఫండస్ కెమేరా వంటి సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరికరాన్ని సృష్టించిందని ఆయన అన్నారు. ఇది ఆరోగ్య సమస్యని మాత్రమే కాకుండా, పెరుగుతున్న పర్యావరణ ఆందోళనని కూడా పరిష్కరించిందని చెప్పారు."
వియత్నాంలో నివసిస్తున్న 19,000 మందికి పైగా రోగుల జీవితాలు మరియు దృష్టి లోపానికి మేలు చేకూర్చడానికి 2018 నుండి, శామ్ సంగ్ తమ పొందికైన రెటినల్ కెమేరాతో ఐఏపీబీ మరియు యోన్ సీ యూనివర్శిటీ హెల్త్ సిస్టంతో భాగస్వామం చెందింది. కేవలం 2019లో మాత్రమే, ఇది వాక్-ఇన్ -క్లీనిక్స్ అందుబాటులో లేని దేశంలోని సుదూర ప్రాంతాల్లో పని చేసే 90 పొందికైన ఆఫ్తల్ మోస్కోప్స్ ని ఆరోగ్య విభాగానికి చెందిన ప్రొఫెషనల్స్ కి సరఫరా చేసింది. ఇప్పుడు, శామ్ సంగ్ ఈ కార్యక్రమాన్ని భారతదేశం, మోరోకో మరియు పపువా, న్యూ గినియాలకు విస్తరించింది. సర్వైకల్ కాన్సర్ పరీక్షించడానికి స్మార్ట్ ఫోన్ ఆధారిత పొందికైన కాల్పోస్కోప్స్ ని తయారు చేయడానికి మరియు నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణని మహిళలు అందుకోవడాన్ని మెరుగుపరచడానికి సహా తన సామర్థ్యాల్ని శామ్ సంగ్ కూడా కొత్త స్క్రీనింగ్ ప్రాంతాలకు విస్తరించింది.
"ప్రపంచం నెమ్మదిగా కోవిడ్ -19 మహమ్మారి నుండి కోలుకుంటున్నందున, ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కంటి ఆరోగ్యం పరిష్కారానికి టెక్నాలజీని ఉపయోగించవచ్చని మరింత నిరూపించబడింది. ఐలైక్ వేదిక పరీక్షించబడిన దేశాలలో, క్లిష్టమైన భూభాగం, ఎక్కువ దూరాలు, మారు మూల జనాభాలు , సంరక్షణకు కనక్ట్ చేయబడి మరియు పొందడం మెరుగుపర్చడంలో మాకు సహాయపడే టెక్నాలజీ యొక్క అవసరానికి తోడ్పడతాయని," డ్రూ కీస్, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్ నెస్ (ఐఏపీబీ)లో వెస్ట్రన్ పసిఫిక్ రీజన్ (డబ్ల్యూపీఆర్) కోఆర్డినేటర్ డ్రూ కీస్ అన్నారు. "శామ్ సంగ్ తో పని చేయడం ఈ పరిష్కారాల్ని నిర్వహించడానికి మరియు ఈ ప్రాంతాలలో సహకార మరియు నిర్మాణాత్మకమైన సంబంధాల్ని రూపొందించడంలో పైలట్ దేశాల్లో సాంకేతికతని అందించడానికి మా సభ్య సంస్థలకు అనుమతి ఇస్తుంది.”
లక్ష్యభరితమైన నవ్యతకు కట్టుబడటమే కాకుండా, శామ్ సంగ్ environmental sustainability ని మేము చేసే ప్రతీ దానిలో రూపొందిస్తోంది. దీనిలో 7.5 మిలిన్ టన్నుల ఈ-వ్యర్థం సేకరణ యొక్క మా లక్ష్యం దిశగా పని చేయడం మరియు రీసైకిల్ చేయబడిన 500,000 టన్నుల ప్లాస్టిక్ ని 2030 నాటికి ఉపయోగించడం భాగంగా ఉన్నాయి. గాలక్సీ స్మార్ట్ ఫోన్లని తక్కువ ఖర్చుతో కూడిన, పొందికైన కంటి వ్యాధి నిర్థారణ సామగ్రిగా మార్చడం ద్వారా శామ్ సంగ్ ఈ-వ్యర్థాన్ని ల్యాండ్ ఫిల్ నుండి మళ్లించడంలో సహాయపడుతోంది మరియు సేవలు లభించని జనాభాకు కొత్త వైద్య పరిష్కారాల్ని కేటాయిస్తోంది. అదనంగా, ఫండస్ కెమేరా వ్యాధి నిర్థారణ సామగ్రి 35% రీసైకిల్ చేయబడిన పదార్థంతో తయారైంది మరియు సులభంగా మళ్లీ ఉపయోగించడానికి రూపొందించడింది. ఇది సస్టైనబుల్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ కటింగ్ ఎడ్జ్ ఛాంపియన్ అవార్డ్ తో యూనైటెడ్ స్టేట్స్ ఎన్వైరన్ మెంటల్ ప్రొటక్షన్ ఏజెన్సీ (ఈపీఏ) ద్వారా గుర్తించబడింది. ద గాలక్సీ అప్ సైక్లింగ్ కార్యక్రమం 17 సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ద్వారా సుస్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాకి మద్దతు ఇవ్వడానికి శామ్ సంగ్ వారి నిరంతర నిబద్ధత యొక్క భాగం.
గాలక్సీ అప్ సైక్లింగ్ వంటి కార్యక్రమాలు ద్వారా, మన అనుభవాల్ని ప్రపంచంతో మళ్లీ తీర్చిదిద్దే కొత్త సాంకేతికతల్ని కేటాయించడమే కాకుండా మరింత పర్యావరణానుకూలమైన చైతన్యం గల ప్రవర్తనల్ని ప్రోత్సహించడంలో కీలకమైన బాధ్యత వహించడానికి ఇది వినియోగదారులకు సాధికారత కలిగిస్తోంది.