Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో 3వ అతిపెద్ద ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో, నేడు తన తాజా స్మార్ట్‌ఫోన్ POCO X3ను POCO F1ను #PROformance లెగసీపై తయారు చేసి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. యువతకు, టెక్ మరియు గేమింగ్ ఔత్సాహికులకు తక్షణమే వినియోగించుకునేందుకు అనువుగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని నమ్మశక్యం కాని ఫ్లూయిడ్ మరియు శక్తివంతమైన అనుభవాన్ని అందిస్తుంది. POCO ఇండియా కంట్రీ డైరెక్టర్ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘POCOలో మా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, ఉత్తమమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మేము ప్రయత్నిస్తాము. ఆన్లైన్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మేము మొదటి 3 స్థానాలకు ఎదగడం అనేది మా వినియోగదారుల నుంచి అందుకుంటున్న అభిమానానికి నిదర్శనం. మా మొట్టమొదటి ఫోన్, POCO F1 2018లో విడుదల కాగా, ఇప్పటి వరకు మార్కెట్లో పనితీరులో ఛాంపియన్‌గా ఉంటూ, అత్యంత ప్రాచుర్యం పొందిన స్మార్ట్‌ఫోన్‌గా కొనసాగుతోంది’’ గుర్తుచేశారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ ‘‘పనితీరు వారసత్వాన్ని మరింత ముందుకు తోడ్కొని వెళ్లి, మార్కెట్లో ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాలన్న నమ్మకానికి అనుగుణంగా, మేము మా వినియోగదారులకు మా ప్రధాన X సిరీస్ నుంచి POCO X3 Proను అందుబాటులోకి తీసుకు వస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా భారతదేశంలో ఇప్పటివరకు రూ.20,000 కన్నా తక్కువ ధరలో అందుబాటులోకి రాని అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేస్తున్నాము. ఫ్లాగ్షిప్ క్వాల్కామ్® స్నాప్‌డ్రాగన్ 860 ఆధారంగా పని చేసే POCO X3 ప్రో ఈ విభాగంలో గతంలో ఎన్నడూ చూడని ఫీచర్లు మరియు పనితీరును అందుబాటులోకి తీసుకు వస్తుంది. గేమింగ్, ఫోటోగ్రఫీ మరియు అధిక పనితీరుల సంపూర్ణ సమ్మేళనంగా POCO X3 ప్రో సున్నితమైన గేమింగ్ అనుభవానికి లిక్విడ్ కూల్ ప్లస్ టెక్నాలజీ కలిగి ఉంది మరియు ‘ఎప్పటికీ ఆపవద్దు’ అనే అనుభవానికి ఎంఎంటి ఛార్జింగ్ టెక్నాలజీతో భారీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి తీసుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరియు మా అభిమానుల ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నామని’’ తెలిపారు.
POCO F1 మరియు #PROformance లెగసీపై నిర్మితమైన POCO X3 ప్రో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 860తో అందుబాటులోకి వస్తుండగా, ఈ చిప్‌సెట్‌ను కలిగిన మొదటి ఉపకరణం ఇదే కావడం విశేషం. దీనిలోని 8-కోర్ చిప్సెట్ 7nm ప్రాసెసింగ్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది అత్యుత్తమ, గరిష్ఠ #పనితీరుకు 2.96GHz గరిష్ట ఫ్రీక్వెన్సీని అందిస్తుంది. శక్తివంతమైన అడ్రినో 640 జిపియు గ్రాఫిక్స్ ప్రాసెసర్ కలిగిన ఈ ఉపకరణం మార్కెట్ ప్రధాన స్రవంతిలో అందుబాటులో ఉన్న అన్ని ఆటలను వేగవంతంగా ఆడేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనిలో 491000+ అంటుటు V8 స్కోరుతో, POCO X3 ప్రోను దాని విభాగంలో ఏ ఇతర ఉపకరణాల కన్నా ముందంజలో ఉంచుతూ, దాని వర్గంలో తిరుగులేని శక్తిగా మరియు #పనితీరులో రాజుగా ఉంచేందుకు మద్దతు ఇస్తుంది. ప్రతిసారీ పీక్ గేమింగ్ సెషన్లకు మరియు ఫ్రిక్షన్ లేని స్థిరమైన పనితీరుతో వినియోగదారుని అనుభవాన్ని మరింత ఉన్నతీకరించేందుకు POCO X3 ప్రో లిక్విడ్ కూల్ ప్లస్‌ను కలిగి ఉండగా- ఇది ఉపకరణంలోని ఉష్ణ సామర్థ్యాన్ని తగ్గించేందుకు విస్తరించిన రాగి హీట్ పైపు మరియు బహుళ పొరల గ్రాఫైట్ ప్యాకింగ్‌తో కలిసి ఉండే శీతలీకరణ పరిష్కారంగా పని చేస్తుంది. ఈ ఉపకరణం LPDDR4X మరియు యుఎఫ్ఎస్ 3.1 వంటి లైన్ హార్డ్వేర్లతో కలిసి ఉంటుంది మరియు ఇది పరిశ్రమలో అత్యంత వేగవంతమైన మొబైల్ స్టోరేజ్ టెక్ కాగా, ఈ ధర విభాగంలో ఫోన్లలో ఇది యుఎఫ్ఎస్ 3.0 కన్నా 3 X వేగంగా మరియు యుఎఫ్ఎస్ 2.1 కన్నా 14 X వేగంగా నిలువ చేసుకుంటుంది.
మృదువైన మరియు వేగవంతమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించడమే కాకుండా గేమర్లకు ఆనందాన్ని అందించే ప్రో-గ్రేడ్ ఫీచర్లు మరియు టెక్‌ను అందించడం, POCO X3 ప్రో తన శక్తివంతమైన #PROformance సామర్థ్యాలను Z-షాకర్ హాప్టిక్ మోటారుతో పూర్తి చేస్తుంది, ఇది అనుకూలీకరించిన వైబ్రేషన్స్‌తో ఫీడ్‌బ్యాక్‌ను పునర్నిర్వచించింది.
స్మార్లర్ మరియు వేగవంతమైన 120హెడ్జ్ డిస్ప్లే: అన్నింటికన్నా ఉత్తమమైన వాటిని అందించడమే తెలిసిన POCO తన POCO X3 ప్రోతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చింది. ఆధునిక హై-రిఫ్రెష్ రేట్ డిస్ప్లేల చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో, రియాలిటీ ఫ్లో 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉపకరణం స్మార్ట్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఒక ఇంటెలిజెంట్ డిస్ప్లే కాగా, ఇది ఇది అనువర్తనానికి సంబంధించి కంటెంట్‌లోని ఫ్రేమ్ రేట్ వేరియబిలిటీని చదివి అర్థం చేసుకుంటుంది మరియు కావలసిన రిఫ్రెష్ రేట్‌ను 50Hz, 60Hz, 90Hz లేదా 120Hzకు ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసి బ్యాటరీని ఆదా చేస్తుంది మరియు స్మార్ట్‌ఫోన్‌కు గతంలో కన్నా ఎక్కువ శక్తినిస్తుంది. ఇది ఫోన్ రిఫ్రెష్ రేటు గేమింగ్ వంటి అధిక-సామర్థ్య పరిస్థితులకు మరియు చలన చిత్రాన్ని వీక్షించడం లేదా దేన్నైనా చదివేందుకు తేలికైన ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంది.
అంతరాయం లేని ఎడ్జ్-టు-ఎడ్జ్ వీక్షణ అనుభవం కోసం, ఉపకరణం 2400x 1080p రిజల్యూషన్‌తో డాట్-టైప్ బెజెల్-లెస్ 16.9 సెం.మీ (6.67) ఫుల్ హెచ్డి+ డిస్ప్లేను కలిగి, ఫ్లాగ్షిప్ లెవల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో రక్షించబడుతుంది. ఇది 240 హెడ్జ్ టచ్ స్యాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. సున్నితమైన లాగ్-ఫ్రీ పనితీరును అందిస్తుంది. డిస్ప్లే పంచీ వివిడ్ వర్ణాలను అందిస్తుంది మరియు HDR10 మద్దతుతో అద్భుతమైన విజువల్స్ మరియు కాంట్రాస్ట్‌ను అందిస్తుంది.
ప్రో 48ఎంపి క్వాడ్ కెమెరా సెటప్: కంప్యూటర్ విజన్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్, ఎఫ్/1.79 అపర్చర్‌తో 48 ఎంపి ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.2 అపర్చర్‌తో 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 118° ఎఫ్‌ఒవి, పోట్రెయిట్కు 2 ఎంపి మాక్రో కెమెరా మరియు డెప్త్ సెన్సర్ కలిగిన POCO X3 ప్రో ఆకట్టుకునే క్వాడ్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇది 20ఎంపి ఫ్రంట్ కెమెరా విలక్షణ సెటప్‌తో వినియోగదారులకు సహజమైన రూపంలో అందించే ఉత్తమ సెల్ఫీలు మరియు చిత్రాలను తీసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. తద్వారా నిజ-జీవిత వర్ణ నాణ్యతను ప్యాక్ చేస్తుంది.
ఈ ఉపకరణం 30/60 ఎఫ్పిఎస్ వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది మరియు కంటెంట్ సృష్టించేందుకు మరియు సోషల్ మీడియా కథనాలకు చక్కని నాణ్యతతో అధిక-రెసొల్యూషన్ వీడియోలను తీసుకునేందుకు, మృదువైన వీడియో జూమ్, ఫోకస్ పీకింగ్ మరియు వ్లాగ్ మోడ్‌తో పాటు AE/AF లాక్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. అదనంగా, ఇది నైట్ మోడ్ 2.0, లాంగ్ ఎక్స్పోజర్, క్లోన్ ఫోటో మరియు వీడియో మోడ్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది. ఇది సృష్టికర్తలకు ప్రాథమిక స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీకి మించి ప్రతిభ చూపించేందుకు అవకాశం కల్పిస్తుంది.
ప్రో ఛార్జింగ్‌తో ప్రో బ్యాటరీ: POCO X3 ప్రో 5160mAh బ్యాటరీని కలిగి ఉండగా, ఈ శ్రేణిలో అతి పెద్ద బ్యాటరీల్లో ఇది ఒకటి. ఇది MMT టెక్, స్ల్పిట్ ఛార్జ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తుంది మరియు ఇది తక్కువ సమయంలోనే చక్కగా ఛార్జ్ అవుతుంది మరియు బ్యాటరీ హెల్త్ సైకిల్న ఎక్కువ కాలం సంరక్షిస్తుంది. ఈ ఉపకరణం ఇన్-బాక్స్ ఫాస్ట్ 33W టైప్-సి ఛార్జర్‌తో వస్తుంది మరియు దీని విభాగంలో వేగవంతమైన పీడీ మద్దతు యుఎస్బి పిడి ఛార్జ్‌ను 26W వద్ద సపోర్ట్ చేస్తుంది.
ప్రో ఫోన్, ప్రో ఫీచర్స్ : లీనమయ్యే ఆడియో అనుభవాన్ని అందిస్తూ, POCO X3 ప్రో డ్యూయల్-స్టీరియో స్పీకర్ సెటప్‌తో జత చేయబడింది మరియు హై-రెసొల్యూషన్ ఆడియో మరియు మరియు aptX™ HD సర్టిఫైడ్ కలిగి ఉంది. ఇది బిగ్గరైన మరియు స్పష్టమైన ధ్వనిని అందిస్తూ, మొత్తం మల్టీ మీడియా మరియు లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. స్మార్ట్ కార్యాచరణను కలిగి ఉన్న, ఉపకరణంలోని స్పీకర్లు ఆటోమేటిక్‌గా – శుభ్రపరుచుకునే సామర్థ్యంతో, స్థిరమైన పనితీరు మరియు దీర్ఘకాలంలో స్పష్టమైన ఆడియో నాణ్యతను అందిస్తాయి. ఉపకరణం ప్రమాదవశాత్తు పడిపోవడం మరియు గీతలు పడకుండా చూసేందుకు POCO X3 ప్రో IP53 ధృవీకరణతో వస్తుంది. కఠినమైన వాతావరణ పరిస్థితులలో, ఉపకరణం దుమ్ము మరియు నీరు చొరబడకుండా రక్షించడాన్ని ఇది ధృవీకరిస్తుంది.
లభ్యత మరియు ధర: POCO X3 ప్రో మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది: గ్రాఫిట్ బ్లాక్, స్టీల్ బ్లూ, మరియు గోల్డెన్ బ్రాంజ్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా 2021 ఏప్రిల్ 06 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ‘Everything you need and nothing you don't’ అనే తత్వానికి అనుగుణంగా POCO దాన్ని వినియోగదారులకు అందించేందుకు తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూ ప్రేక్షకులు మరియు కొత్త వినియోగదారులకు తన శ్రేణిలోకి చేరిన కొత్త ఉత్పత్తితో విజ్ఞప్తి చేస్తోంది.
6GB + 128GB వేరియంట్: రూ.18,999 / -
8GB + 128GB వేరియంట్: రూ.20,999 / - కొనుగోలుదారులు ఐసిఐసిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ అందుకుంటారు.