Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హైదరాబాద్ నివాసం ఉంటున్న వారి కోసం రూ. 75 లక్షల రూపాయల విలువైన ఉచిత రైడ్స్ ను ఈ మూడో దశలో అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉబర్ ప్రకటించింది. దేశంలోని 34 నగరాల్లో రూ.10 కోట్ల విలువైన ఉచిత రైడ్ లను కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేందుకు గతంలో సిద్ధమైంది ఉబర్. అందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్ లో ఈ ఉచిత రైడ్ లను అందించనుంది.
వ్యాక్సిన్ వేసుకునే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ మీ సమీప అధీకృత వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్లి వచ్చేందుకు ఈ ఉచిత రైడ్ లను ఉపయోగించుకోవచ్చు. ఈ ఉచిత రైడ్ లను సులభంగా రీడీమ్ చేయగల ప్రోమో కోడ్ల ద్వారా పొందవచ్చు. దీనిద్వారా అర్హులైన వారు వ్యాక్సిన్ సెంటర్ కు సులభంగా వెళ్లి రావొచ్చు. ఈ ఉచిత రైడ్ ల వల్ల... డ్రైవర్లకు ఈ సమయంలో మద్దతు లభిస్తుంది. వారికి మరింత మెరుగైన సంపాదన మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మద్దతు ఇచ్చినట్లు కూడా అవుతుంది. ఈ సందర్భంగా గౌరవనీయులు, తెలంగాణ ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... పౌరులు టీకా కేంద్రాలకు వెళ్లి మరియు తిరిగి ఇంటికి చేరుకోవడానికి, అలాగే వ్యాక్సిన్ పై అవగాహన కలిగించేందుకు రూ.75 లక్షల రూపాయల విలువైన ఉచిత రైడ్లు అందిస్తున్న ఉబర్ ను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. టీకా వేసుకునే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మరియు నమ్మకమైన రవాణాను అందించడం ద్వారా, ఇది జీవితాలను పునర్నిర్మించడానికి మరియు వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కొన్ని నెలల క్రితం భారతదేశం అంతటా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్‌ను ప్రారంభించినప్పటి నుంచి, మన జనాభాలో పెద్ద సంఖ్యలో రోగనిరోధక శక్తి పెరగింది. ఇలాంటి బృహత్తర కార్యాన్ని సకాలంలో పూర్తి చేయాలంటే ఉబర్ వంటి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు చాలా కీలకం అని అన్నారు ఆయన.
ఈ సందర్భంగా ఉబర్ ఇండియా మరియు దక్షిణ ఆసియా అధ్యక్షుడు ప్రభుజీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... పౌరులకు టీకాలు వేసే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి మద్దతునివ్వడం మాకు సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యంలో అర్హులైన వారందరికీ సురక్షితమైన మరియు నమ్మకమైన ప్రయాణాన్ని అందించడంపై దృష్టి సారిస్తాము. ప్రపంచవ్యాప్తంగా #MoveWhatMatters పట్ల మా నిబద్ధతలో భాగంగా, మేము టీకా డ్రైవ్‌లకు మద్దతు ఇస్తూనే ఉంటాము, తద్వారా ప్రభావిత సమాజాలు ఈ మహమ్మారి నుండి త్వరగా కోలుకొని వారి జీవితాలను పునర్నిర్మించగలవు అని అన్నారు ఆయన.
ఉబర్ ఉచిత రైడ్ లను పొందేందుకు అనుసరించవలసిన మార్గాలు:
● ముందుగా ఉబర్ యాప్ ను ఓపెన్ చేసి అందులో ఎడమవైపు ఉన్న మెను అనే ఆప్షన్ నొక్కాలి. అక్కడ వాలెట్ అనే ఆప్షన్ నొక్కాలి.
● అక్కడే ‘Add Promo Code’ అని కింద ఉంటుంది. అక్కడ 10M21V ఈ ప్రోమోకోడ్ ని యాడ్ చేసుకోవాలి
● హైదరాబాద్ లో నివాసముంటున్న వారికి ఉబర్ యాప్ లో ఈ ప్రోమో కోడ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే ఉబర్ లో కన్పించే అన్ని ఉత్పత్తులకు వీటిని ఉపయోగించుకోవచ్చు.
● ప్రోమో కోడ్ యాడ్ చేసిన తర్వాత మీ దగ్గరలోని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి మరియు తిరిగి వచ్చేందుకు ట్రిప్ బుక్ చేసుకోవాలి.
● మీ కోసం లేదా మీ వారి కోసం పికప్ మరియు డ్రాప్ లొకేషన్ ను ఎంటర్ చేసి నేవిగేషన్ హోమ్ స్క్రీన్ పై ఒకసారి సరి చూసుకోవాలి.
● మీ ట్రిప్ ను కన్ ఫర్మ్ చేయాలి
● ఉచిత రైడ్ గరిష్ట విలువ రూ. 150. దీంటోపాటు ప్రయాణికుడు గరిష్టంగా రెండు ఉచిత రైడ్ లను మాత్రమే పొందగలరు. అది కూడా వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి మరియు తిరిగి వచ్చేందుకు.
● ట్రిప్ పూర్తైన తర్వాత మీకు ఫైనల్ గా ఒక మొత్తం కన్పిస్తుంది. అది డిస్కౌండ్ మొత్తాన్ని మినహాయించిన తర్వాత కన్పించే మొత్తం.