Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరల్ కంటెంట్ క్రియేటరే కాదు
- అణగారిన వర్గాల పిల్లలకు నోరూరించే రుచులు అందించే హైదరాబాదీ
- ఈ సోమవారం రాత్రి 8 గంటలకు HistoryTV18
హైదరాబాద్: మీరు తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, భారీ మొత్తంలో నోరూరించే రుచులు వండుతూ నగరంలోని అణగారిన వర్గాల పిల్లలకు నోరూరించే వంటకాలు వడ్డిస్తూ ఎవరైనా కనిపించారనుకోండి. మీరు కచ్చితంగా నవాబ్స్ కిచెన్ వ్యవస్థాపకుల్లో ఒకరిని చూస్తున్నట్టు లెక్క. ఒకవేళ మీకు అలాంటి అవకాశం దొరక్కపోయినా పర్వాలేదు. ఎందుకంటే భారతీయుల అద్భుత విజయాలు, నైపుణ్యాలు, ఆవిష్కరణలను ప్రదర్శించే HistoryTV18 సూపర్ సక్సెస్ఫుల్ సిరీస్ ‘OMG! Yeh Mera India’లో ఈ సోమవారం, ఏప్రిల్12న ఖ్వాజా మొయినుద్దీన్‌ను తన ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది.
చక్కని జీతం వచ్చే జర్నలిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసిన మొయినుద్దీన్, 2017లో తన స్నేహితులు శ్రీనాథ్, భగత్‌తో కలిసి నవాబ్స్ కిచెన్ ప్రారంభించారు. నగరంలోని చిన్నారులకు వారు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనుకున్నారు. అంతేకాదు, సాధారణంగా వారికి అందుబాటులో ఉండని కేకులు, పిజ్జాలు, స్థానిక రుచులను వారికి చేరువ చేయాలని భావించారు. బిర్యానీ నుంచి పిజ్జాల వరకూ, 25 కేజీల భారీ కేకులను సైతం సంప్రదాయం కట్టెల పొయ్యిపైన తయారు చేయడం వీరి ప్రత్యేకత. ఈ బృందం కొత్త రెసిపీలు ఎలా సృష్టిస్తుందో, ప్రతీ నెలా 1200 చిన్నారులకు భోజనం ఎలా అందిస్తుందో ఈ ఎపిసోడ్లో చూసి తెలుసుకోండి.
ఈ సోమవారం రాత్రి 8 గంటలకు HistoryTV18లో నమ్మశ్యకం కాని నవాబ్స్ కిచెన్ కథ తిలకించి ఆ చిన్నారుల మోముపై కనిపించే సంతోషకరమైన చిరునవ్వులు చూడండి. అంతేకాక అద్భుతమైన భారతీయుల ఆశ్చర్యచకితులను చేసే నైపుణ్యాలను వీక్షించండి.
HistoryTV18 లో ప్రతీ సోమవారం రాత్రి 8 గంటలకు చూడండి ‘OMG! Yeh Mera India’