Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) దివాలాకు చేరువ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అప్పుల ఊబిలో చిక్కుకున్న ఈ సంస్థ 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.280 కోట్ల రుణ వాయిదాలను చెల్లించ లేకపోయింది. దీంతో కాఫీ డే సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకర్లు ఆ సంస్థపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. ద్రవ్య లభ్యత సంక్షోభం వల్ల కాఫీ డే మొత్తం రూ.518 కోట్ల రుణ భారంతో డిఫాల్టర్‌గా మారింది.