Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పోటో సాంకేతికతలో అగ్రగామి అయినా కెనాన్ ఇండియాకు నూతన అధ్యక్షుడు, సీఈఓ గా మనాబు యమజకి నియమితులయ్యారు. దేశంలోని కెనాన్ యొక్క వ్యాపార వ్యూహాలకు, కార్యకలాపాలకూ యమజకి నేతత్వం వహించనున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఇంతక్రితం ఆయన తూర్పు చైనాలో బ్రాండ్‌కు చీఫ్ రీజనల్ ఆఫీసర్‌గా విధులను నిర్వహించారు. కెనాన్‌తో 1989 నుంచి ఆయనకు అనుబంధం ఉందని తెలిపింది. యూరోపియన్, మిడిల్ ఈస్ట్రన్, రష్యా, ఆఫ్రికా మార్కెట్ల వ్యాప్తంగా అత్యుత్తమ వ్యాపార నిర్వహణకు గణనీయమైన తోడ్పాటును అందించారని పేర్కొంది.