Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2 నిమిషాల లోపే కోటేషన్ నుంచి జారీ వరకు కొనుగోలు పూర్తి
- సమగ్రమైన బైక్ బీమా రక్షణలతో కూడిన 24x7 రోడ్ సైడ్ సహాయం
ఢిల్లీ: భారతదేశంలోని ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో తాము ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాల యజమానుల కోసం తన వేదికలో కార్, బైక్ బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్టు భారతదేశపు సుప్రసిద్ధ డిజిటల్ పేమెంట్ల వేదిక PhonePe నేడు ప్రకటించింది. ఈ ఆవిష్కరణతో PhonePeలో నమోదు చేసుకున్న 23 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఇప్పుడు 2 నిమిషాల్లోపే తమ వాహనాలకు ఎలాంటి అంతరాయం లేకుండా బీమా చేసుకోవచ్చు. కొనుగోలుకు ముందు ఎలాంటి డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ లో తమ పాలసీ డాక్యుమెంట్లు అప్పటికప్పుడే వారి పాలసీ డాక్యుమెంట్లను కూడా చూడవచ్చు. PhonePe యొక్క కార్, బైక్ బీమా ఉత్పత్తులు మార్కెట్లో నేడు అందుబాటులో ఉన్న వాటితో పోల్చితే అత్యంత చౌకధరతో కూడుకున్నవి.
ఇందులో ప్రత్యేకించి గమనించాల్సిన విషయం ఏమిటంటే, PhonePe యొక్క కార్ మరియు బైక్ బీమా కస్టమర్లు దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న గ్యారేజీల నెట్ వర్క్ లో ఇబ్బందులు లేని రీతిలో రిన్యూవల్స్, నగదు రహిత మరమ్మతు మరియు నిర్వహణ సేవలను మరియు 20 నిమిషాల్లోపే తక్షణ పే అవుట్ తో కూడిన స్మార్ట్ ఫోన్ ఎనేబుల్ చేసిన క్లెయిమ్ ల సెటిల్ మెంట్ అందుకోవచ్చు. PhonePe వినియోగదారులు తమ అవసరాలకు తగ్గట్టు జీరో డిప్రిసియేషన్, 24X7 రోడ్ సైట్ అసిస్టెన్స్, ఇంజిన్ రక్షణ లాంటి యాడ్- ఆన్ ల శ్రేణితో తమ కార్ బీమా ప్లాన్ ను అనుకూలింపజేసుకోవచ్చు. జీరో డిప్రిషియేషన్ వాహనంలో ఏ భాగం దెబ్బతిన్నా ఈ భాగాల విలువలో వార్షిక తరుగుదలను పక్కన బెట్టి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. తద్వారా జేబులో నుంచి ఎక్కువ ఖర్చు కాకుండా చూస్తుంది.
ఈ ఆవిష్కరణ సందర్భంగా PhonePe బీమా విభాగం అధిపతి గుంజన్ ఘయ్ మాట్లాడుతూ, “మా వినియోగదారులకోసం కారు మరియు బైక్ బీమా ఉత్పత్తులను ఆవిష్కరించడం మాకెంతో ఆనందంగా ఉంది. మా కస్టమర్ల బీమా అవసరాలు అన్నిటికీ వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉండాలనే మా లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది జరుగుతోంది. దేశంలోని వాహనాల్లో 70% ద్విచక్ర వాహనాలే కావడంతో పాటు వీటిలో చాలావాటికి బీమా లేకపోవడంతో మోటారు బీమా రంగంలో వృద్ధికి గొప్ప అవకాశమున్నట్టు మేము విశ్వసిస్తున్నాము. కస్టమర్ కు అత్యంత ప్రాధాన్యమిస్తూ, వారికి చేరువ కావడమనే మా విధానం ద్వారా మేము మోటార్ బీమాను కొనడానికి ఒక తేలికైన, త్వరితమైన, సులభమైన మార్గాన్ని అందించడంతో పాటు సజావుగా సాగే రిన్యూవల్స్ ను ఎనేబుల్ చేస్తున్నాము. 230 మిలియన్లకు పైగా వినియోగదారులకు అందుబాటులో, చౌకగా ఉండేలా బీమాను చేయాలనే దృఢ సంకల్పంతో సమీప భవిష్యత్తులో అనేక కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాము.” అని అన్నారు.
ఈ సందర్భంగా Bajaj Allianz జనరల్ ఇన్సూరెన్స్ ఐటి, వెబ్ సేల్స్ & ట్రావెల్ విభాగం ప్రెసిడెంట్ & హెడ్ సౌరభ్ ఛటర్జీ మాట్లాడుతూ “మోటార్ బీమా అనేది ఆవశ్యకమైనది, ప్రమాదాల సందర్భంగా రక్షణ కల్పిస్తుంది. అయినప్పటికీ, దేశ వ్యాప్తంగా అనేక ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలు బీమా చేయకపోవడమో లేదా బీమా చెల్లుబాటులో ఉంచుకోకపోవడమో జరుగుతున్నట్టు కనిపిస్తోంది. బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ లోనూ ఎల్లవేళలా వినియోగదారులకు తేలికగా, సులభంగా అర్థం చేసుకునేలా, కొనుగోలు, క్లెయిమ్ చేసుకోవడం సులభంగా ఉండేలా మార్కెట్ లోకి బీమా ఉత్పత్తులను అందించాలనేదే మా ప్రయత్నంగా ఉంటోంది. డిజిటల్ వేదిక సేవా సంస్థలతో మా భాగస్వామ్యం ఈ దిశగా మేము చిన్నగా వేస్తున్న భారీ అడుగు. కాబట్టి ఈ ఆవిష్కరణ మాకెంతో ఆనందం కలిగిస్తోంది. భవిష్యత్తులో ఈ వేదికలో మేము మరిన్ని కొత్త మరియు వినూత్న ఉత్పత్తులతో వస్తాము.” అని అన్నారు. కొన్ని తేలికైన దశల్లో PhonePe వినియోగదారులు తమ బైక్ లు మరియు కార్లకు బీమా చేయించుకోవచ్చు. వారు చేయాల్సిందల్లా యాప్ (ఆండ్రాయిడ్& iOS రెండింటిలోనూ) లోని “నా డబ్బు“ విభాగానికి వెళితే చాలు, అక్కడ మోటారు బీమా విభాగంలో కార్ & బైక్ బీమా ఉత్పత్తులు కనిపిస్తాయి. కస్టమర్లు తమ వాహనానికి బీమా కవరేజీని ఎంచుకుని, వివరాలను నింపి, పేమెంట్ చేయడమే.