Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· స్టార్టప్ గ్రాంట్స్ నాల్గవ ఎడిషన్‌కు 9 ఇంక్యుబేటర్ల నుంచి ఎంపిక
· గత 4 ఏళ్లలో 87 స్టార్టప్‌లకు ₹19.4 కోట్ల నిధుల మద్దతు
ఢిల్లీ: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నేడు స్టార్టప్ గ్రాంట్స్ 2021 నాల్గవ ఎడిషన్ విజేతలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన 300 దరఖాస్తుల్లో సామాజిక వలయంలో పని చేస్తున్న ఇరవై ఒక్క స్టార్టప్‌లను కఠిన పరీక్షల అనంతరం ఎంపిక చేశారు. ఈ నిధులు సమాజం మరియు పర్యావరణంలో సుస్థిరమైన మార్పు విశిష్ఠ పరిష్కరణలను అందించే స్టార్టప్‌లను పోషించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఈ నిధులు బ్యాంకులో సామాజిక కార్యక్రమాలకు కేంద్రమైన #పరివర్తన్‌లో భాగంగా అందిస్తున్నారు.
బ్యాంకు 2017లో స్టార్టప్ నిధిని ప్రారంభించింది మరియు గత 4 ఏళ్లకు పైగా భారతదేశంలోని వివిధ నగరాల్లో 87 స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చింది. విద్యా సాంకేతికత మరియు కౌశల్యాభివృద్ధి రంగంలో పని చేస్తున్న స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తోంది. షార్ట్ లిస్ట్ చేసేందుకు మరియు విజేతలకు మార్గదర్శనం చేసేందుకు బ్యాంకు ఐఐటి ఢిల్లీ, ఎఐసి-బిమ్‌టెక్, ఐఐఎం కాశీపూర్, ఐఐటి బిహెచ్‌యు, బనస్థల్ యూనివర్సిటీ, సి-క్యాంప్, గుసెక్, టి-హబ్ మరియు విల్గ్రోవంటి తొమ్మిది ఇన్‌క్యుబేటర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. గత నాలుగేళ్లలో బ్యాంకు ₹19.4 కోట్ల మేర నిధులు విడుదల చేసింది.
ఈ ఏడాది మహమ్మారి నియమాలను అనుసరించి ఆన్లైన్లో ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. స్టార్టప్‌లు తమ వివరాలను వర్చ్యువల్ ప్లాట్ఫారం ద్వారా దాఖలు చేశారు. స్టార్టప్‌ల మూల్యాంకనలో అత్యంత ప్రముఖ కొలమానం అంటే ఈ దిగువ పేర్కొన్న అంశాలకు అనుగుణంగా చేపట్టారు:
· ఐడియా సుస్థిరత
· విస్తరణ సాధ్యత
· సమాజం మరియు పర్యావరణానికి అది ఎలా అనుకూలమవుతుంది
· ప్రణాళిక ప్రత్యేకత
గతంలో స్టార్టప్ నిధులను వాతావరణం మార్పు, వ్యర్థాల నిర్వహణ, కౌశల్య శిక్షణ మరియు జీవనోపాధి విస్తరణ ఆవిష్కరణ పరిష్కరణల్లో పని చేస్తున్న ప్రత్యేక ఆలోచనలకు అందజేశారు. గతంలో ఈ నిధులను ముంబయి, పుణె, బెంగళూరు మరియు ఢిల్లీలకు చెందిన స్టార్టప్‌లే కాకుండా జెమ్షడ్ పూర్, ఒడిశాలోని కలహంది, కొచ్చి, తిరువనంతపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని స్టార్టప్‌లకు కూడా అందించారు. ఉదాహరణకు, గతంలో ఇచ్చిన నిధుల్లో శ్రవణ దోషం ఉన్నవారికి ఆధారంగా ఉండే, అవసరమైన పరిష్కరణలను అందించేందుకు శ్రమిస్తున్న స్టార్టప్ బ్లీటెక్కు నిధులు అందించారు. మరొక ఉదాహరణలో వ్యవసాయ వ్యర్థాలైన వరి చెత్తను పల్ప్‌గా మార్చడం, దాన్ని కప్పులు, ప్లేట్లు తదితర బయో డీగ్రెంట్ టేబుల్వేర్గా మార్చడం.
‘‘స్టార్టప్ గ్రాంట్స్ భారతదేశపు స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు బ్యాంకు నిబద్ధతలో భాగంగా ఉంది. SmartUp programme ద్వారా మేము స్టార్టప్ సముదాయపు వ్యాపారశీలత స్ఫూర్తిని కాపాడడం ద్వారా ఉద్యోగాలు మరియు అవకాశాలను సృష్టించడం మరియు సమాజం అలాగే పర్యావరణంపై చక్కని ప్రభావాన్ని చూపిస్తున్నాము. మేము వారికి స్మార్ట్ ఆర్థిక ఉపకరణాలు, సలహా సేవలు మరియు సాంకేతికతతో తయారుగా ఉండేలా చేస్తుండగా, వారికి తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సహకరిస్తున్నాము. స్టార్టప్‌లు సమాజంలో సుస్థిరమైన మార్పును తీసుకు వచ్చేందుకు ఆవిష్కారాత్మక పరిష్కరణలతో పని చేస్తున్నారని మాకు తెలిసింది. ఈ నిధులు మా సమాజాన్ని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్న స్టార్టప్‌లకు ప్రశంస మరియు మద్దతుగా చేపడుతున్నామని’’ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గవర్నమెంట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, ఇ-కామర్స్ అండ్ స్టార్టప్ కంట్రి హెడ్ స్మితా భగత్ తెలిపారు.
సమాజంలో సకారాత్మక సామాజిక మార్పు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్టార్టప్‌లు అసాధారణ వరుసలో భాగమయ్యేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా అగ్రగామి సిఎస్ఆర్ కార్యక్రమం #పరివర్తన్ కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉంది. జీవనోపాధి, కౌశల్యాభివృద్ధి మరియు సమాజంలోని సవాళ్లను ఎదుర్కొంటున్న సముదాయాలతో పని చేసే స్టార్టప్‌లు ఉన్నాయి: మనం జీవిస్తున్న సమాజానికి తిరిగి ఇచ్చే మా ఉద్దేశంతో సకారాత్మక మార్పు తీసుకురావడానికి అనుగుణంగా ఉందని’’ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్స్ గ్రూప్ హెడ్-సిఎస్ఆర్ ఆశిమా భట్ తెలిపారు.
స్టార్టప్ నిధులు స్టార్టప్ రంగంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆవిష్కరణ మరియు వ్యాపారశీలత స్ఫూర్తిని కాపాడే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు భారీ ప్రయత్నంలో భాగంగా ఉంది. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు స్మార్టప్ పరిష్కరణకు విస్తరణ కాగా, ఇందులో బ్యాంకు ప్రత్యేకంగా రూపొందించిన బ్యాంకింగ్ మరియు సలహా పరిష్కరణను వ్యాపారులకు అందిస్తుంది.
ఈ ప్రయాణం స్మార్టప్లకు వినూత్న పరిష్కరణ అయిన స్మార్టప్ పరిష్కరణ ప్రారంభంతో విస్తరిస్తుండగా, ఇది బ్యాంకింగ్ మరియు చెల్లింపుల పరిష్కరణతో సలహా మరియు విదేశీ వినిమయ సేవలతో కలిపి అన్ని అవసరాలను పరిష్కరిస్తోంది. ఇదే కాకుండా, బ్యాకుంలో స్మార్టప్ పోర్టల్ ఉపయోగించడం ద్వారా స్టార్టప్‌లు ఈ ప్రపంచానికి తమ సేవలను అందిస్తూనే స్టార్టప్‌ల సంపూర్ణ నెట్వర్క్ జ్ఞానం మరియు అనుభవాన్ని పొందేందుకు అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. బ్యాంకుకు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 70 శాఖల్లో స్మార్టప్ జోన్లను ప్రారంభించగా, అందులో స్టార్టప్ కేంద్రాలుగా విస్తరిస్తున్న టైయర్ 2 మరియు టైయర్ 3 నగరాలు కూడా ఉన్నాయి.