Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్ సెడాన్ అప్డేటెడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ వాహనాన్ని శుక్రవారం భారత మార్కె ట్లోకి విడుదల చేసింది. పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందు బాటులోకి తెచ్చింది. ఎక్స్‌షోరూం వద్ద.. 630ఐఎం స్పోర్ట్ ధరను రూ.67.90 లక్షలుగా, 620డి లగ్జరీ లైన్ రూ.68.90 లక్షలు, 630డి ఎం స్పోర్ట్ ధరను రూ.77.90 లక్షలుగా నిర్ణయించింది. పెట్రోల్ వేరియంట్లో లభ్యమయ్యే 630ఐ ఎమ్ స్పోర్ట్‌లో 2.0 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు. 630డి కారులో అమర్చిన 3 లీటర్ల ఇంజిన్ 190 హెచ్‌పి సామర్థ్యాన్ని కలిగి ఉంది.