Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా రెండో దశతో ఒత్తిడి
- ఆర్థిక వ్యవస్థ రికవరీపై అస్తిరత : ఫిచ్ రేటింగ్స్ విశ్లేషణ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభించడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ అనిశ్చిత్తిలో చిక్కుకోవచ్చని తద్వార బ్యాంక్‌లకు ముప్పు పెరుగొచ్చని ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించింది. 2021 బ్యాంకింగ్ పరిశ్రమ వాతావరణం క్లిష్టంగా మారొచ్చని పేర్కొంది. వైరస్‌ను కట్టడి చేయడం ద్వారా వ్యాపారం, ఆర్థిక కార్యకలాపాలను పెంచేలా చర్యలు తీసుకోల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నెల ప్రారంభం నుంచి దేశంలో రోజుకు అటూ, ఇటుగా ఒక్క లక్ష కరోనా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. గడిచిన ఫిబ్రవరి మధ్య నాటికి ఈ సంఖ్య 9300గా ఉంది. స్వల్ఫ, దీర్ఘకాల వృద్థి రేటు పెంపు కోసం ప్రభుత్వం పలు విత్త చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఫిచ్ పేర్కొంది. రెండో దశ వైరస్ విస్తృతి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీపై అస్థిరతను పెంచుతుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 12.8 శాతం పెరుగొచ్చని ఇటీవలే ఫిచ్ అంచనా వేసింది. ''మొత్తం కరోనా కేసుల్లో 80 శాతం కూడా ఆరు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో 45 శాతం వాటా ఆయా రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే, ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోయినా.. 2020 తరహాలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ చేపట్టిన బ్యాంక్‌లు రిస్కులో పడనున్నాయి'' అని ఫిచ్ పేర్కొంది.
పరిస్థితులు ఎలాగున్న బ్యాంక్‌లు తిరిగి సవాళ్లను ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంది. రెండో దశ కరోనా వైరస్ విస్తృతి వినియోగదారులు, కార్పొరేట్లలో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. 2020 లాక్డౌన్ వల్ల బ్యాంక్‌ల్లో మొండి బాకీలు పెరిగిన విషయాన్ని ఫిచ్ గుర్తు చేసింది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు ముప్పులో పడే ప్రమాదం ఉంది. రిటైల్ రుణాల్లో విత్త సంస్థలు మెరుగైన ప్రగతిని కనబర్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది వరకు వైరస్ పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని ఫిచ్ అంచనా వేసింది.