Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి సమయంలో కూడా ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఇండియా ఫస్ట్ లైఫ్) తమ వృద్ధిని కొనసాగించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ 5% వృద్ధిని వ్యక్తిగత నూతన వ్యాపారం (ఎన్బీ) వార్షిక ప్రీమియం ఈక్వివాలెంట్ (ఏపీఈ) నమోదు చేసింది.
రుషబ్ గాంధీ, డిప్యూటీ సీఈవో, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇప్పుడు 894 కోట్ల రూపాయల ఇండివిడ్యువల్ నూతన వ్యాపార (ఎన్బీ) వార్షిక ప్రీమియం ఈక్వివాలెంట్ (ఏపీఈ)ని నమోదు చేసింది. ఆరంభించిన నాటి నుంచి ఇది అత్యధికం.
ఇది ఇయర్ ఆన్ ఇయర్ 5% వృద్ధిని నమోదు చేసినట్లయింది. 2020 ఆర్ధిక సంవత్సరంలో 25% ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధిని సాధించిన నేపథ్యంలో ఇది సంతృప్తికరం. ఈ వృద్ధికి నిబద్ధత కలిగిన, ప్రొఫెషనల్ ధైర్యవంతమైన బృందం కారణం. వరుసగా నాలుగవ సారి గ్రేట్ ప్లేసేస్ టు వర్క్‌గా గుర్తింపబడటం ఈ బృందం యొక్క స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది’’ అని అన్నారు.
అంతర్జాతీయ మహమ్మారి ప్రభావం వేళ సైతం ఇండియా ఫస్ట్ లైఫ్ ఎన్నో అంశాలలో మొట్టమొదటిసారి తగ్గ విజయాలను నమోదు చేసింది. సంస్థ యొక్క చారిత్రాత్మక ప్రదర్శనలలో –
- మొత్తం ప్రీమియం 4వేల కోట్ల రూపాయలను అధిగమించింది
- రిటైల్ ఏపీఈలో 5% వృద్ధితో 894 కోట్ల రూపాయలు (2020 ఆర్ధిక సంవత్సరంలో 850 కోట్ల రూపాయలు)
- మొత్తంనూతన వ్యాపార ఏపీఈలో 6% వృద్ధితో 995 కోట్ల రూపాయలు నమోదు (2020 ఆర్థిక సంవత్సరంలో 941 కోట్ల రూపాయలు)
- రెన్యువల్ ప్రీమియం ఆదాయం 2000 కోట్ల రూపాయలను అధిగమించింది (2020 ఆర్థిక సంవత్సరం 1494 కోట్ల రూపాయలు)
- వ్యక్తిగత 13 నెలల నిలకడ గణనీయంగా వృద్ధి చెంది 78.7% కు చేరిక (2020 ఆర్ధిక సంవత్సరంలో 75.8%)
ఓ సంస్థగా ఇండియా ఫస్ట్ లైఫ్ గత సంవత్సర కాలంలో తమ బ్రాండ్ ఆఫరింగ్స్‌ను బలపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. డిజిటల్ కనెక్ట్ ను ఏర్పాటుచేయడంతో పాటుగా తమ వినియోగదారులకు ఎలాంటి క్లిష్టత లేని ప్రాప్యతను అందించడం కోసం ఈ– సంపర్క్ మరియు ఘర్ బైటే ఇన్సూరెన్స్‌లను ఆవిష్కరించింది. ఈ ప్రస్తుత ఉత్పత్తులు నాన్ పార్ మరియు ప్రొటెక్షన్ ఉత్పత్తులు అయిన ఇండియా ఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ బెనిఫిట్ ప్లాన్, ఇండియా ఫస్ట్ లైఫ్ గ్యారెంటీడ్ ప్రొటెక్షన్ ప్లాన్ మరియు ఇండియా ఫస్ట్ లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్కమ్ ప్లాన్ వంటి వాటితో వృద్ధి చేయబడింది. కస్టమర్ ఫస్ట్ సొల్యూషన్స్ అయినటువంటి ఒన్ డే క్లెయిమ్ సెటిల్మెంట్ను కంపెనీ మరింత విస్తృత పరిచింది. ఇది వినియోగదారులకు ఆనందం కలిగించే రీతిలో ఉంది. ఇండియా ఫస్ట్ లైఫ్ యొక్క బ్రాండ్ క్యాంపెయిన్ భోండు జస్ట్ చిల్ మరియు నెట్‌ఫ్లిక్స్ డ్రీమ్‌తో భాగస్వామ్యంతో పాగలైట్ దీని విజిబిలిటీని మరింతగా వృద్ధిచేసింది.
‘‘ఇండియా ఫస్ట్ లైఫ్ యొక్క విజయం , మనం ఎంత త్వరగా స్వీకరించాము,మెరుగుపరిచాము మరియు ఆవిష్కరించామనే దాని మీద నిర్మించబడింది. ఇందుకు మా శక్తివంతమైన బ్యాంకస్యూరెన్స్ ఛానెల్‌తో పాటుగా వైవిధ్యమైన పంపిణీ సామర్థ్యాలు కూడా కారణమే. భవిష్యత్ పట్ల నేను ఆశాజనకంగా ఉన్నాను. మేము జీవితాలను నిరంతరం కాపాడుతూనే మా వాటాదారులందరికీ విలువనూ సృష్టిస్తాము’’ అని గాంధీ జోడించారు.