Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విజయవాడలో JSP మోటర్రాడ్ను తన ఆథరైజ్డ్ డీలర్ పార్ట్నర్గా నియమిస్తున్నట్లు BMW మోటర్రాడ్ ఇండియా ప్రకటించింది. JSP మోటర్రాడ్కు JSP మోటర్రాడ్ డీలర్ పార్ట్నర్ శ్రీ సుదర్శన్ పొన్రాజ్ నేతృత్వం వహిస్తున్నారు మరియు షోరూమ్ డోర్ No. 54-16-20/13A-2F, 101, గ్రౌండ్ ఫ్లోర్, భవిష్యాస్ ప్రైడ్, వెటర్నరీ కాలనీ, రింగ్ రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – 520008 లో ఉంది.BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ మాట్లాడుతూ, ‘‘BMW మోటర్రాడ్ దీన్ని సొంతం చేసుకున్న ఒక అల్టిమేట్ రైడింగ్ మెషిన్ మరియు ఈ భావోద్వేగాలను పంచుకునే శియర్ బైకింగ్‌లో భాగంగా ఉంది. మా వినియోగదారులు తాము అత్యుత్తమమైన ఉత్పత్తిని మాత్రమే పొందలేదని, జీవితకాలానికి అత్యుత్తమ క్షణాలు కూడా అందిస్తున్నామని మేము వాగ్దానం చేస్తున్నాము. మా మనోహరమైన శ్రేణిలో అన్ని రకాల రైడర్లకు మోటార్ సైకిళ్లు మరియు సమగ్ర ఆఫ్టర్‌సేల్స్ సేవలు అందించేందుకు బలమైన డీలర్ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. మా డీలర్ నెట్వర్క్ విస్తరణ సరైన మార్గంలో ఉంది మరియు భారతదేశం అంతటా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మా ఉనికిని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాము. మా విశ్వసనీయ భాగస్వామి - JSP మోటర్రాడ్తో కలిసి విజయవాడలో మొదటి BMW మోటర్రాడ్ షోరూమ్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది. కస్టమర్లకు పర్సనలైజ్ చేసిన, ఎమోషనల్ మరియు ప్రీమియం బ్రాండ్ అనుభవాన్ని మా బ్రాండ్‌కు అందించడంలో షోరూమ్ కీలక పాత్ర పోషిస్తుందని’’ ధీమా వ్యక్తం చేశారు.
JSP మోటర్రాడ్ డీలర్ పార్టనర్ శ్రీ సుదర్శన్ పొన్రాజ్ మాట్లాడుతూ ‘‘BMW మోటర్రాడ్ ఇండియాతో మా భాగస్వామ్యం పలుసంవత్సరాలుగా వృద్ధి చెందుతూ వస్తోంది మరియు మేము సంయక్తంగా సాధించిన అభివృద్ధి మాకు గర్వకారణంగా ఉంది. ఈ అత్యాధునిక షోరూమ్ ద్వారా మేము ‘అల్టిమేట్ రైడింగ్ మెషిన్’ మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలోని మోటారుసైకిల్ ఔత్సాహికులకు క్యూరేటెడ్ రైడింగ్ అనుభవాలను కూడా అందిస్తాము. ఒక ప్రధాన ప్రదేశంలో ఉన్న మరియు సరి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన ఈ ఫెసిలిటీ వివేకవంతులైన మా వినియోగదారులకు ఊహించని అనుభవాన్ని అందించడంలో కీలక పాత్రను పోషించనుందని’’ వివరించారు. షోరూమ్‌లో 4 మోటార్‌సైకిళ్లను డిస్ప్లేలో ఉంచగా, విస్తృత శ్రేణి BMW మోటర్రాడ్ యాక్ససరీలు, లైఫ్ స్టైల్ మర్చండైజ్తో పాటు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కోసం మెకానికల్ బే కలిగి ఉంది. JSP మోటర్రాడ్ ఫెసిలిటీ సేల్స్, సర్వీస్, స్పేర్-పార్ట్స్ మరియు బిజినెస్ సిస్టమ్స్ అన్నింటినీ ప్రాసెస్ చేస్తూ వినియోగదారులకు బెస్ట్-ఇన్-క్లస్ ప్రీ అండ్ పోస్ట్ సేల్స్ ఓనర్షిప్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే హామీని ఇస్తుంది. ఈ ఫెసిలిటీ తన ప్రాంగణం పరిధిలో, వాహనాల ప్రదర్శన మరియు వర్క్ స్టేషన్లు పనితీరు, సమగ్రమైన శానిటైజేషన్ ప్రక్రియను కట్టుదిట్టంగా అనుసరిస్తుంది.