Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అగ్రస్థానంలో వున్న 10 ఐస్ క్రీం బ్రాండ్స్ లో ఒకటిగా వెలుగొందుతూ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరిలో విస్తృతంగా ఉనికలో వున్న డెయిరీ డే, కొత్త శ్రేణి 500మిలీ ఐస్ క్రీం కేక్స్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 100% శాఖాహార, గుడ్లు కలపని ఐస్ క్రీం కేక్స్ ఇప్పుడు – రెడ్ వెల్వెట్, ఛాకో మోకా, చాకో ఫాంటసీ, హనీ ఆల్మండ్ అనే 4 కొత్త రుచుల్లో లభిస్తున్నాయి.
· రెడ్ వెల్వెట్ ఐస్ క్రీం కేక్ మీకు ప్రత్యేకమైన వారికోసం ఇది చక్కటి విందు, రెడ్ వెల్వెట్ కేక్ పొరలమధ్య ఐస్ క్రీం శాండ్విచ్ వుంటుంది.
· ఛాకో మోకా ఐస్ క్రీం కేక్, ఇది కాఫీ అభిమానులకి ఒక ఉల్లాసం, ఐస్ క్రీం, కేక్, కాఫీ రుచుల సమ్మేళనం ఇది.
· ఛాకో ఫాంటసీ ఐస్ క్రీం కేక్ ఇందులో వుండే చాకొలేట్ ఐస్ క్రీం, చాకొలేట్ కేక్ ల పొరలు నోటిలో కరిగిపోతాయి, ఇది చాకొలేట్ ప్రేమికులకి నిజమైన ఆనందం.
· హనీ ఆల్మండ్ ఐస్ క్రీం కేక్, ప్రతి విధంగానూ ఇది ఉల్లాసమే, ఇందులో తిరుగులేని తేనె, ఆల్మండ్ టాపింగ్స్ వుంటాయి.
శ్రీ. ఎం.ఎన్.జగన్నాథ్, సహ వ్యవస్థాపకులు, డెయిరీ డే, ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ ఐస్-క్రీం కేక్, ఐస్ క్రీం, కేక్ లని ఇష్టపడేవారికి చక్కటి విందవుతుంది. డెయిరీ డే ఐస్ క్రీం కేక్ వినియోగదారులకి రెండు డిజర్ట్స్ తాలూకు ఆనందకరమైన మనోహరమైన అనుభవాన్ని ఇస్తాయి. సాటిలేని రుచుల ఐస్ క్రీంలకి డెయిరీ డే బ్రాండ్ పేరుపొందింది. మార్కెట్లోకి ఎప్పుడూ సృజనాత్మకమైన కొత్త ఉత్పత్తులని తీసుకురావడానికి మేం నిరంతరం కృషి చేస్తుంటాం. ఈ వేసవిలో మేం కొత్త రుచుల శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాం”. రెడ్ వెల్వెట్, ఛాకో మోకా, ఛాకో ఫాంటసీ, హనీ ఆల్మండ్ ఐస్ క్రీం కేక్స్ 500 మిలీ ప్యాక్స్ లో రూ. 299 ధర నుంచి లభ్యమవుతాయి. ఈ సాటిలేని కొత్త రుచులు, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో 30,000 లకు పైగా అవుట్లెట్లలో దొరుకుతాయి.