Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంతర్జాతీయ శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమంలో అంతర్భాగంగా, 80 కొత్త జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్ వీ) పాఠశాలల్లో స్మార్ట్ తరగతుల్ని చేరుస్తున్నట్లు శామ్ సంగ్ ఇండియా ప్రకటించింది. భారతదేశపు ఆధునిక యువతరానికి సాధికారత కలిగించడం ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన వారి పిల్లలకు డిజిటల్ చదువు కేటాయిస్తూ, #PoweringDigitalIndia కలని నెరవేర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ జోడింపుతో, కంపెనీ వారి అంతర్జాతీయ శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ చొరవలో భాగమైన శామ్ సంగ్ స్మార్ట్ తరగతి దేశవ్యాప్తంగా 5 లక్షలమంది విద్యార్థులకు లబ్ది చేకూరుస్తూ శామ్¬సంగ్ ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతులు 625 జేఎన్ వీ పాఠశాలలు మరియు 10 నవోదయ లీడర్ షిప్ ఇన్ స్టిట్యూట్ లలోని 835 తరగతి గదుల్లో లభిస్తుంది.
కొత్త స్మార్ట్ తరగతులు అధికసంఖ్యలో సుదూర గ్రామీణ జిల్లాలైన జమ్ము & కాశ్మీర్ లో కుప్ వారాలో, గుజరాత్ లో దహోడ్, ఛత్తీస్ ఘర్ లో సుక్మా, పశ్చిమ బెంగాల్ లో డార్జిలింగ్ లో, అస్సాంలో బక్సాలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కొత్త జేఎన్ వీ పాఠశాలలు 17 రాష్ట్రాల్లో వ్యాపించాయి. గ్రామీణ భారతదేశానికి చెందిన ప్రతిభ గల పిల్లలకు ఆధునిక విద్యని అందచేయడానికి జేఎన్వీ పాఠశాలలు భారత ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిచే నిర్వహించబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 661 జేఎన్ వీ పాఠశాలలు ఉన్నాయి. నవోదయ విద్యాలయ సమితి సహకారంతో, శామ్¬సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమంలో అంతర్భాగంగా, శామ్¬సంగ్ వారి మొదటి శామ్ సంగ్ స్మార్ట్ తరగతి 2013లో స్థాపించబడింది మరియు కార్యక్రమం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4.3 లక్షల విద్యార్థులకు ప్రయోజనం కలిగించింది. ఏర్పాటు చేయబడిన కొత్త స్మార్ట్ తరగతులు నుండి అదనంగా 50,000 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. కార్యక్రమం టీచర్ల శిక్షణకు కూడా మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తుంది. ప్రభావవంతంగా బోధించడానికి ఇంటరాక్టివ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలి విషయం పై ఇప్పటి వరకు, 8,000 మందికి పైగా టీచర్లు శిక్షణ పొందారు.
శామ్¬సంగ్ వారు ఏర్పాటు చేసిన ప్రతీ స్మార్ట్ తరగతి ఇంటరాక్టివ్ శామ్ సంగ్ ఫ్లిప్, శామ్ సంగ్ టాబ్లెట్స్, ప్రింటర్, సర్వర్, పవర్ బ్యాక్ అప్ మరియు డిజిటల్ లెర్నింగ్ కంటెంట్ ని కలిగి ఉంటుంది. “శామ్ సంగ్ తో ఎన్ వీఎస్ కి ఎంతో బలమైన మరియు విజయవంతమైన సంబంధం ఉంది. ప్రపంచం డిజిటలీకరణ చెందిన సమయంలో టెక్నాలజీని సమతుల్యం చేయడానికి మన విద్యార్థులు మరియు బోధనా సిబ్బందికి 2013 నుండి పని చేస్తున్న ద శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ ప్రాజెక్ట్ అనుమతిని ఇచ్చింది. దేశంలో జేఎన్ వీ విద్యార్థులు అత్యంత ఉత్తమమైన సామర్థ్యాన్ని కలిగిన వారిలో ఒకరు మరియు వారికి ఈ కార్యక్రమం ద్వారా కొత్త సాంకేతికతని అందచేయడం వలన వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుత సమయంలో ఇది మరింత ముఖ్యమైనదిగా మారనుంది,” అని వినాయక్ గర్గ్, కమిషనర్, నవోదయ విద్యాలయ సమితి అన్నారు.
“మా పౌరసత్వం కల 'టుగెదర్ ఫర్ టుమారో !' ఎనేబ్లింగ్ పీపుల్ లో భాగంగా మెరుగైన విద్యా మరియు అభ్యాసన అవకాశాల్ని పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు శామ్ సంగ్ సహాయపడుతోంది. శామ్¬సంగ్ స్మార్ట్ స్కూల్ కార్యక్రమంలో అంతర్భాగంగా, జేఎన్ వీ పాఠశాలల్లో 80 కొత్త స్మార్ట్ తరగతుల్ని జోడించడం మా పవరింగ్ డిజిటల్ ఇండియా కలకి మా నిబద్ధతకు బలాన్ని చేకూరుస్తుంది. ఈ పౌరసత్వ చొరవ భారతదేశపు అభివృద్ధి ఎజెండాతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది మరియు అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు విస్త్రతంగా చేరడానికి మరియు ప్రభావం కలిగించడాన్ని నిర్థారించడాతనికి గాను ప్రభుత్వ భాగస్వామంతో సన్నిహితంగా పని చేస్తూ అమలు చేయబడింది,” అని పార్థా ఘోష్, వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ సిటిజన్ షిప్, శామ్ సంగ్ ఇండియా అన్నారు. పౌరసత్వ చొరవలు ద్వారా ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పించడానికి మరియు సమాజాల్ని సానుకూలంగా మార్చడానికి శామ్ సంగ్ తమ ఆవిష్కరణ వారసత్వాన్ని ఉపయోగించడానికి కట్టుబడింది. భారతదేశంలో శామ్ సంగ్ కంపెనీ వారి ఫ్లాగ్ షిప్ పౌరసత్వం చొరవ శామ్సంగ్ స్మార్ట్ స్కూల్, గ్రామీణ మరియు పట్టణ భారతదేశాలు మధ్య డిజిటల్ విభజనకు మరియు అన్ని నేపధ్యాలకు చెందిన పిల్లలకు నాణ్యతతో కూడిన చదవును కోసం సమానమైన అవకాశాల్ని కలిగించడానికి వారధి వేసే లక్ష్యాల్ని కలిగి ఉంది. శామ్ సంగ్ స్మార్ట్ స్కూల్ సహాయంతో, విద్యార్థులకు గణితం, శాస్త్ర విజ్ఞానం, ఇంగ్లిష్ మరియు సోషల్ సైన్స్ సబ్జెక్టులు దృశ్యపరంగా ఆకర్షణీయమైన , విద్యార్థుల్ని నిమగ్నం చేసే విధానంలో బోధించబడతాయి. వారు మెరుగ్గా నేర్చుకోవడానికి మరియు నేర్చుకున్న విషయాలు మెరుగ్గా నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. శామ్ సంగ్ ఏర్పాటు చేసిన స్మార్ట్ క్లాస్ వలన విద్యార్థులు పాల్గొనడం, స్మార్ట్ బోర్డ్స్, టాబ్లెట్స్ మరియు ప్రింటర్స్ వంటి టెక్నాలజీతో సౌకర్యం మరియు పరిచయం ఎక్కువైందని జేఎన్ వీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు పాఠశాల ప్రిన్సిపల్స్ తమ ప్రతిస్పందన తెలియ చేసారు. అదనంగా, విద్యార్థులు క్లిష్టమైన భావనల్ని మరింత సులభంగా నేర్చుకుంటున్నారని మరియు డిజిటల్ గా ఇంటరాక్టివ్ వాతావరణం సంకోచంగా లేదా సిగ్గుపడే విద్యార్థులు తరగతి గదుల్లో మెరుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని టీచర్లు చెప్పారు.
సామ్సంగ్ ఇండియా న్యూస్‌రూమ్ లింక్:
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్‌ను గురించి శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.