Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తైవాన్ కేంద్రంగా పని చేస్తోన్న ఆసుస్ భారత మార్కెట్లోకి కొత్తగా జెన్‌బుక్ మోడల్స్‌లో రెండు ప్రీమియం లాప్టాప్లను విడుదల చేసింది. 11వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో ఆవిష్కరించిన జెన్‌బుక్ డుయో 14 (యుఎక్స్ 482), జెన్‌బుక్ ప్రో డుయో 15 ఒఎల్ఇడి (యుఎక్స్ 582) లాప్‌టాప్‌లు రెండూ రెగ్యులర్ డిస్ప్లేతో పాటుగా స్క్రీన్పాడ్ ప్లస్ డిస్ప్లే కూడా కలిగి ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. దీని ప్రారంభ ధర రూ.99,990. జిఇ ఫోర్స్ ఆర్టిఎక్స్ 3070 గ్రాఫిక్స్ ప్రారంభ ధరను రూ.2,39,990గా నిర్ణయించింది.