Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పెద్ద, చిన్న బ్యాంకుల కోసం ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. యూనివర్సల్ బ్యాకింగ్ లైసెన్స్ కోసం యుఎఇ ఎక్స్ఛేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిపాట్రియేట్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ బ్యాంక్ లిమిటెడ్ (రెప్కో బ్యాంక్), చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య దరఖాస్తులు చేసుకున్నాయని వెల్లడించింది. అదే విధంగా చిన్న ఫైనాన్స్ బ్యాంకులకోసం విసాఫ్ట్ టెక్నాలజీస్ ప్రయివేటు లిమిటెడ్, కాలికట్ సిటీ సర్వీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అఖిల్ కుమార్ గుప్తా, ద్వార క్షత్రియ గ్రామీణ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకింగ్ సర్వీసులు ప్రారంభించుకునేందుకు ఆసక్తిని కనబర్చాయని పేర్కొంది. బ్యాంకుల ఏర్పాటుకు దరఖాస్తులను సమీక్షించేందుకు ఆర్బిఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామల గోపీనాథ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.