Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి త్రైమాసికంలోనూ క్షీణతే : బీఓఎఫ్ఏ రిపోర్ట్
- వైద్య రంగానికి నిధులు పెరగాలి : ఫిచ్
ముంబయి : కరోనా వైరస్ రెండో దశ ఉదృతి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ ముప్పులో పడిందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజి సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. 2020-21 మార్చి త్రైమాసికంలో 3 శాతం వృద్థి ఉండొచ్చన్న ఇది వరకు తమ అంచనాలు చేరకపోవచ్చని పేర్కొంది. అయితే ఎంత వృద్థి నమోదయ్యే అవకాశాలున్నాయే మాత్రం వెల్లడించలేదు. గడిచిన ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో వరుసగా దేశ జిడిపి ప్రతికూలతను ఎదుర్కొందని గుర్తు చేసింది.
ఇటీవల భారీగా పెరుగుతోన్న కరోనా కేసులను కట్టడి చేయడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ ఆంక్షల వల్ల జీడీపీలో 100-200 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని ఈ రిపోర్ట్ హెచ్చరించింది. మొత్తం జీడీపీలో 16 శాతం వాటా కలిగిన మహారాష్ట్రలో లాక్డౌన్ విధించడంతో వృద్థి రేటు మరింత ఒత్తిడిల పడిందని తెలిపింది. మరోవైపు 2021-22లో రుణాల వృద్థి రేటులోనూ స్తబ్దత చోటు చేసుకుందని పేర్కొంది.
వైద్య రంగానికి వ్యయాలు పెరగాలి : ఫిచ్ సొల్యూషన్స్
దేశంలో చాలా తీవ్రంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని ఫిచ్ సొల్యూషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య రంగానికి కేటాయింపులు, పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. గతేడాది కొన్ని కట్టడి చర్యలు తీసుకున్న తర్వాత ద్వితీయార్థంలో ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకుందని గుర్తు చేసింది. గత కొన్ని వారాలుగా భారీగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరి లాంటి వాటి కోసం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వైద్య మౌలిక వసతులు, పరికరాలు , ఆక్సిజన్, వెంటీలేటర్లు కొరతను ఎదుర్కొంటున్నాయని.. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ రంగంపై వ్యయం పెరగాలని పేర్కొంది.