Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య ఐదు లక్షలకు చేరనుంది. దీంతో ప్రపంచ ఐటిలోనే వచ్చే రెండు, మూడేళ్లలో ఉద్యోగ కల్పనలో అగ్రస్థానంలోకి చేరనుంది. ప్రస్తుతం ఈ రంగంలో 5.37 లక్షల ఉద్యోగులతో అమెరికన్ కంపెనీ అసెంచర్ అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో టిసిఎస్ కొత్తగా 40వేల మందిని తీసుకోవడంతో ప్రస్తుతం 4,88,469 ఉద్యోగులకు చేరారు. ఇందులో 90వేల మంది ఇతర దేశాల్లో పని చేస్తున్నారు. దేశంలోనూ ప్రయివేటు రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తోన్న సంస్థల్లో టిసిఎస్ పెద్దదిగా ఉంది.