Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఆన్లైన్లో నగదు బదిలీకి ఉపయోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్) సేవలు ఆదివారం నిలిచిపోనున్నాయి. శనివారం సాధారణ పని వేళలు ముగిసిన తర్వాత వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్బిఐ ఇది వరకే ప్రకటించింది. చెల్లింపుల్లో సాంకేతిక ఆధునీకరణ నిమిత్తం ఆర్టిజిఎస్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని బదిలీ చేయడానికి ఆర్టిజిఎస్ ఉపయోగపడుతోంది. ఆదివారం మధ్యాహ్నం కల్లా తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయమై ఇప్పటికే బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు సమాచారం ఇచ్చాయి. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో 14 గంటల పాటు ఆర్టిజిఎస్ సేవల్ని నిలిపివేస్తున్నారు. ఆన్లైన్లో నగదు బదిలీ కోసం వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవడానికి వీలుంది.