Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో జపాన్ ఇన్వెస్టమెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 45 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,348 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరుపుతోందని సమాచారం. ఇందులో భాగంగా స్విగ్గీ మార్కెట్ విలువను 500 కోట్ల డాలర్లుగా లెక్కగట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. స్విగ్గీ ఇప్పటికే ఫాల్కాన్ ఎడ్జ్ క్యాపిటల్, అమాన్సా క్యాపిటల్, థింక్ ఇన్వెస్టమెంట్స్, కార్మిగ్నాక్, గోల్డ్‌మన్ శాక్స్ నుంచి ఈ నెలలో కంపెనీ 80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,862 కోట్లు) నిధులు సమీకరించింది.