Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: రొచె డయాగ్నస్టిక్స్ ఇండియా తన క్వాంటిటేటివ్ యాంటీబాడీ టెస్ట్ – ఎలెసిస్ యాంటీ సార్స్ కోవ్ -2ఎస్ ను ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టింది. నాటి నుంచి కూడా ఈ టెస్ట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, ల్యాబ్ లలో విస్తృతంగా వినియోగించబడుతోంది. ఈ టెస్ట్ యాంటీబాడీలను లెక్కిస్తుంది. గతంలో ఉన్న న్యూట్రల్ ఇన్ఫెక్షన్ లేదా టీకాకు శరీర రోగనిరోధకత స్పందించే తీరును గుర్తించేందుకు ఇది తోడ్పడుతుంది.
రొచె ఎలెసిస్ సార్స్ కోవ్ – 2 ఎస్ క్వాంటిటేటివ్ యాంటీబాడీ టెస్ట్ అనేది సార్స్ కోవ్ -2 వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్ కు వ్యతిరేకంగా పని చేసే యాంటీబాడీలు సీరమ్ లేదా ప్లాస్మాలో ఎంతమేరకు ఉన్నాయో గుర్తించి, లెక్కిస్తుంది. యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేయడంలో సాధారణ లక్ష్యంగా ఉండేది స్పైక్ ప్రొటీన్. ఈ రకం యాంటీబాడీలు వైరస్ ను మానవకణాల్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి. తద్వారా ఓ వ్యక్తికి రక్షణ కల్పిస్తాయి. అందువల్ల ఎన్నో కోవిడ్ -19 టీకాలు స్పైక్ ప్రొటీన్ లేదా కనీసం దాని లోని భాగాన్ని కలిగిఉంటాయి. తద్వారా అవి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీలు, ఇమ్యూన్ సెల్స్ రూపంలో రోగనిరోధకతను ఉత్పత్తి చేయగలుగుతాయి. రోచె ఎలెసిస్ సార్స్ కోవ్ -2 ఎస్ టెస్ట్ లో చేసిన మాదిరిగానే ల్యాబ్ లో స్పైక్ ప్రొటీన్ కు వ్యతి రేకంగా ఉండే యాంటీబాడీలను లెక్కించడం ద్వారా టీకాలు ఉత్పత్తి చేసే యాంటీబాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ ను గణించవచ్చు. ఈ విధంగా యాంటీబాడీల కార్యకలాపాన్ని తటస్థీకరించడం అనేది పొందబోయే రక్షణాత్మక రోగనిరోధకత (పొటెన్షియల్ ప్రొటెక్టింగ్ ఇమ్యూనిటీ)తో సన్నిహిత సంబందాన్ని కలిగిఉంటుంది. వ్యాక్సినేషన్ సందర్భంలో ఇది మరింతగా ముఖ్యమైంది. రోచె ఎలెసిస్ సార్స్ కోవ్ – 2 ఎస్ ఈ విధమైన న్యూట్రలైజేషన్ కార్యకలాపాన్ని గుర్తిస్తుంది.
వ్యాక్సినేషన్ తరువాత లేదా ఒక / సహజ ఇన్ఫెక్షన్ తరువాత అభివృద్ధి చెందిన యాండీబాడీస్ కన్ సెంట్రేషన్ లేదా పరిమాణం ఎంతనో క్వాంటిటేటివ్ యాంటీబాడ్ టీస్ట్ రిపోర్ట్ తెలియజేస్తుంది. మరో వైపున క్వాలిటేటి వ్ యాంటీబాడీ టెస్ట్ అనేది ఫలితాన్ని అంకెల్లో ఇచ్చినప్పటికీ, ఎస్ లేదా నో అనే సమాధానాన్ని మాత్రమే ఇ స్తుంది. ఈ విధంగా చూస్తే, క్వాలిటేటివ్ టెస్ట్ అనేది ‘ఇఫ్’ అనే ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇస్తుంది, క్వాంటి టేటివ్ టెస్ట్ మాత్రం ‘హౌ మచ్’ (ఎంతగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి) అనే ప్రశ్నకు కూడా సమాధానం అందిస్తుంది. యాంటీబాడీ టెస్ట్ ను ఎంచుకోవడంలో ఈ రెండింటి మధ్య తేడాను చూడడం కూడా ముఖ్యం.
క్వాంటిటేటివ్ యాంటీ బాడీ పరీక్షలు ఆ కన్ సెంట్రేషన్ ఎంతగా ఉన్నదనే విషయాన్ని సందేహాలకు తావిచ్చే యూనిట్లలోనో లేదా సూచీ మాదిరిగానో కాకుండా సార్వత్రిక ఆమోదం పొందిన ప్రమాణాల్లో వెల్లడించాల్సి ఉం టుంది. ఇది పరీక్ష ఫలితాలను సరళంగా, ఏకరీతిగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎలెసిస్ యాంటీ సార్స్ – కోవ్ – 2 ఎస్ యూనిట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ అంతర్జాతీయ ప్రమాణాల యూనిట్లకు సమానమైనవి గా పరిగణించవచ్చు. సార్స్ కోవ్ –2 నూతన వేరియంట్లు పుట్టుకొస్తున్న సమయంలో వాటి ప్రవర్తన ధోరణి, ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎంచుకునే యాంటీబాడీ టెస్ట్ ఆ వేరియంట్ వైరస్ కు వ్యతిరేకంగా వృద్ధి చెందిన యాంటీ బాడీలను గుర్తించేదిగా ఉండాలి, తద్వారా సార్స్ కోవ్ -2 కు గతంలో లోనై ఉంటే, ఆ విషయాన్ని వెల్లడించేది గా ఉండడం ముఖ్యం.
ఈ సందర్భంగా రోచె డయాగ్నస్టిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేంద్ర వర్దె మాట్లాడుతూ, ‘‘ఎలెసిస్ యాం టీ సార్స్ – కోవ్ – 2 ఎస్ టెస్ట్ అనేది భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమయ్యే సమయంలో, స రైన సమయంలో ప్రవేశపెట్టబడింది. ఎంతో కచ్చితత్వం, తటస్థీకరణ పరీక్షలకు సహసంబంధం తో, ప్రామాణిక రిపోర్టింగ్ తో ఈ పరీక్ష సార్స్ కోవ్ -2 కు ఎక్స్ పోజర్ ను మదింపు వేయడం మాత్రమే గాకుండా టీకాచే జొ ప్పించబడిన ఇమ్యూన్ రెస్పాన్స్ ను కూడా క్యారెక్టరైజ్ చేస్తుంది. దీన్ని ప్రవేశపెట్టడంతో మేం వినూత్న, అత్యు న్నత స్థాయి వైద్య విలువ కలిగి ఉండే వినూత్నతలను దేశానికి అందించాలనే మా కట్టుబాటును పూర్తి చేసు కున్నట్లయింది’’ అని అన్నారు.
టెనెట్ డయాగ్నస్టిక్స్ లేబొరేటరీ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ స్మితా జువ్వాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘అన్ని యాంటీబాడీ టెస్ట్ లు ఒకే రకంగా ఉండవు. సరైన యాంటీబాడీ టెస్ట్ అనేది కోవడి- 19 టీకా తీసుకున్న తరువాత వచ్చే రోగ నిరోధకత స్పందనను మదింపు వేసేలా మరియు న్యూట్రలైజేషన్ టెస్ట్ లతో సన్నిహిత సంబంధాన్ని చూపించేలా, సంబంధిత రోగనిరోధకత స్పందన వృద్ధిని చేపించేలా ఉండాలి. యాంటీబాడీ కాన్ సెంట్రేషన్ ను అంతర్జాతీయంగా ఆమోదించబడిన యూనిట్లలో రిపోర్ట్ చేసేదిగా ఉండాలి, తద్వారా ఇంటర్ ప్రిటీషన్ అనేది ఏకరీతిగా ఉంటుంది’’ అని అన్నారు.