Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో స్మాల్ & మీడియం బిజినెసెస్ ( ఎస్ఎంబీలు) ని డిజిటల్ గా సమర్థవంతంగా చేయడానికి అమేజాన్ వారి నిబద్ధతలో భాగంగా తమ డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయంతో 50 లక్షలకు పైగా స్థానిక స్టోర్స్ మరియు వ్యాపారాలకు తాము సాధికారతని కల్పిస్తున్నట్లుగా అమేజాన్ పే నేడు ప్రకటించింది. హైదరాబాద్ లో సుమారు 3 లక్షల స్మాల్ & మీడియం బిజినెసెస్ ఇప్పుడు అమేజాన్ పేని ఉపయోగిస్తాయి. ఇంతకు ముందు కేవలం క్యాష్ రూపంలో మాత్రమే లావాదేవీలు చేసిన అధికసంఖ్యాక ఈ ఎస్ఎంబీలు ఇప్పుడు అమేజాన్ పే క్యూఆర్ కోడ్ ని ఉపయోగించి కస్టమర్లు నుండి చెల్లింపులు స్వీకరిస్తారు.
అమేజాన్ సంభవ్ లో 'ఇన్నోవేటింగ్ ఫర్ ఏ బెటర్ ఇండియా (మెరుగైన భారతదేశం కోసం నవీకరణ)' సమావేశంలో నందన్ నీలేకనితో చేసిన సంభాషణలో అమేజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , రస్సెల్ గ్రాండినెట్టి ఈ సాధించిన మైలురాయి గురించి వివరించారు. ఈ 50 లక్షల ఎస్ఎంబీలు విలక్షణమైన వ్యాపారులు మరియు ఔత్సాహికుల సమూహంగా రూపొందుతారు. 25 లక్షల మందికి పైగా వ్యాపారులు కిరాణా స్టోర్స్ వంటి రీటైల్ & షాపింగ్ అవుట్ లెట్లు, సుమారు 10 లక్షల మంది రెస్టారెంట్లు & చిన్న ఈటరీలు వంటి ఫుడ్ & బెవరేజ్ అవుట్ లెట్స్ ని, 5 లక్షలకు పైగా వ్యాపారులు సేలూన్స్ వంటి సేవలు, సుమారు 4 లక్షల మంది ఆరోగ్యం డ వైద్య సంరక్షణ వంటివి, తక్కిన వారు టాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్లంబర్స్ మరియు ఇంకా మరెన్నో రకాల వృత్తుల్ని నిర్వహిస్తున్నారు.
ఎస్ఎంబీలు కోసం డిజిటల్ చెల్లింపుల స్వీకరణని సులభతరం చేయడానికి అమేజాన్ పే ని 'అమేజాన్ పే ఫర్ బిజినెస్' మొబైల్ యాప్ ని కూడా ప్రారంభించింది. ఆండ్రాయిడ్ పై ప్రస్తుతం లభిస్తున్న ఈ యాప్ ని తమని నమోదు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉపయోగించవచ్చు, విలక్షణమైన క్యూఆర్ కోడ్ ని ఉత్పన్నం చేసి, క్షణాల్లో డిజిటల్ చెల్లింపులు స్వీకరించడాన్ని ఆరంభించవచ్చు. అమేజాన్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడానికి కస్టమర్లు ఏదైనా యూపీఐ యాప్ ని ఉపయోగించవచ్చు మరియు ఈ వ్యాపారాలకు చెల్లింపు చేయవచ్చు.
'స్మాల్ డ మీడియం బిజినెసెస్ లు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటివి. 50 లక్షలకు పైగా చిన్న వ్యాపార యజమానులు మరియు ఔత్సాహికులు డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించేలా చేయడానికి, మేము వారిని డిజిటల్ ఇండియాలో చేర్చడాన్ని ప్రారంభించామని ఈ సమావేశాన్ని సమీక్షించిన మహేంద్ర నెరూర్కార్, సీఈఓ, అమేజాన్ పే అన్నారు. ద అమేజాన్ పే ఫర్ బిజినెస్ యాప్ ఈ అనుసరణని మరింత శక్తివంతం చేస్తుంది మరియు నిముషాల్లో డిజిటల్ చెల్లింపుల ఆవరణ వ్యవస్థలో వ్యాపారాలు ప్రవేశించేలా చేస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటిగా పేరు పొందిన యూపీఐని ఉపయోగించి ఎస్ఎంబీలు కోసం మా డిజిటల్ చెల్లింపు స్వీకారాన్ని మేము నిర్మించాము మరియు పెంపొందించాము మరియు భారతదేశం చెల్లింపు చేసే విధానాన్ని పరివర్తనం చేసే మరిన్ని ఉత్పత్తుల్ని సృష్టించడానికి మేము ఎదురు చూస్తున్నాము.'
అమేజాన్ పే ఈ క్రింది ప్రయోజనాల్ని అందిస్తోంది:
వివిధ రకాల కాంటాక్ట్ లెస్ చెల్లింపుల స్వీకారం పద్ధతులు: కస్టమర్లు అమేజాన్ షాపింగ్ పై స్కాన్ & పే ఫీచర్ లేదా ఏదైనా యూపీఐ యాప్ ని ఉపయోగించి అమేజాన్ క్యూఆర్ కోడ్ ఉపయోగించే ఎస్ఎంబీ నుండి షాపింగ్ చేయవచ్చు. యూపీఐ-సదుపాయం గల క్యూఆర్ కోడ్ ఎస్ఎంబీలు చెల్లింపుల్ని నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకి అందుకునేలా అవకాశం ఇస్తుంది.
తమ వ్యాపారం పెంచుకోవడానికి అవకాశం: డిజిటల్ చెల్లింపుల స్వీకరించే సామర్థ్యం వలన వ్యాపారులు పెద్ద ఎత్తున కస్టమర్ల సంఖ్యని పెంచుకోవడానికి, ప్రత్యేకించి సౌకర్యం మరియు పరిశుభ్రతలు కోసం డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లని పెంచుకోవడంలో సహాయపడుతుంది.
ఆర్థకపరమైన ప్రోత్సాహకాలు: డిజిటల్ మార్గంలో చేరేలా అర్హులైన వ్యాపారుల్ని ప్రోత్సహించడానికి అమేజాన్ వివిధ బహుమతుల కార్యక్రమాల్ని వారి కోసం నిర్వహిస్తోంది. ప్రస్తుతం, అర్హులైన వ్యాపారులు అమేజాన్ పేని ఉపయోగించి డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించడం ద్వారా ఐఎన్ఆర్ 5,000 వరకు ప్రతీరోజూ గెలుపొందగలరు.
ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రవేశం: అమేజాన్ పే ద్వారా చెల్లింపుల్ని స్వీకరించడం ద్వారా ఎస్ఎంబీలకు చిన్న వ్యాపారాలు డ ఔత్సాహికులు కోసం భారతదేశంలో అమేజాన్ ద్వారా ప్రత్యేకంగా తయారు చేయబడిన పలు కార్యక్రమాలు మరియు ప్రయోజనాల్ని పొందగలరు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం: డిజిటల్ చెల్లింపులు స్వీకరించడం ద్వారా, వ్యాపారులు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన స్రవంతిలో భాగంగా మారతారు మరియు దృఢమైన ఆర్థిక వ్యవస్థని రూపొందించే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతు ఇస్తారు.